collapse
...
Home / చదువు / Gold Rush: అంతా పరుగులు తీస్తున్నది దీని వెంటే.... - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News...

Gold Rush: అంతా పరుగులు తీస్తున్నది దీని వెంటే....

2022-01-13  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

edu tech
 

విద్యా వ్యాపారం  లక్షల కోట్ల రూపాయల విలువైందిగా మారిపోయంది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ బిజినెస్ ఇప్పుడు బ్యాంకర్లు, ఇంజినీర్లు, పరిశోధకులను ఆకర్షిస్తున్నది. 

ఆధునిక కాలంలోనూ కొన్నేళ్ల కిందటి వరకూ విద్య నేర్పడం అనేది ఓ సేవా కార్యక్రమంగానే భావించేవారు. ప్రాథమిక  విద్య నుంచి పెద్ద విద్య వరకు విద్యా సంస్థలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండేవి. కానీ క్రమంగా దేశంలో కార్పొరేట్ సంసృతి పెరిగాక, కార్పొరేట్ సంస్థలు పెరిగాక, ప్రవేశ పరీక్షలు పెరిగాక విద్యా రంగం కూడా కార్పొరేటీకరణ అయ్యింది, అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు రంగప్రవేశం చేశాయి.

విద్య నేర్పడం అనేది వ్యాపారం అయిపొయింది. చదువుకున్న వాళ్ళు టీచర్లు అయ్యారు. చదువు రానివాళ్ళు స్కూళ్ళు నడుపుతున్నారు అని అతడు సినిమాలో ఓ డైలాగ్ ఉంది. విద్య అనేది వ్యాపారమయ్యాక ఇతర కోర్సులు చేసినవాళ్లు, వేరే వ్యాపారాలు చేస్తున్న వారు, ప్రజా సేవ చేస్తున్న రాజకీయ నాయకులు కోట్లు సంపాదించుకోవచ్చని విద్యా వ్యాపారంలోకి దిగిపోయారు. ఇంకా దిగి పోతున్నారు.

సాంకేతిక విజ్ఞానం పెరిగిపోవడంతో విద్యా వ్యాపారానికి దాన్ని జోడించారు. దాన్నే ఎడ్ టెక్ బిజినెస్ (ఎడ్యుకేషన్ టెక్నాలజీ బిజినెస్)  అంటున్నారు.  గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుత లం చేస్తోంది. దీంతో ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయంగా వర్చువల్ బోధన రంగప్రవేశం చేసింది. టెక్నాలజీ కారణంగా ఇది సాధ్యమైంది.  గత ఏడాది నవంబరులో ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండే షన్ ప్రచురించిన నివేదిక ప్రకారం ...భారత్ లో 2020 ఎడ్ టెక్ బిజినెస్ విలువ 750 మిలియన్ల అమెరికన్ డాలర్లు.

2025 నాటికి ఇది 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ నివేదిక ప్రకారం ....ప్రస్తుతం భారత్ లో ఎడ్ టెక్ కు సంబంధించి 4530 అంకుర సంస్థలు (స్టార్ట్ అప్స్) పనిచేస్తున్నాయి. వీటిల్లో 435 సంస్థలు గత రెండేళ్లలో ఆవిర్భవించాయి. ఎడ్ టెక్ సంస్థలు ఐదు ప్రధాన రంగాలను కవర్ చేస్తున్నాయి.

అవి ... పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్య విద్య అంటే స్కిల్ ఎడ్యుకేషన్,   పోటీ పరీక్షలకు తయారు చేయడం,  నాన్ అకాడమిక్ అంటే విద్యకు సంబంధం లేని అంశాలను బోధించడం ( పాటలు పాడటం, వాయిద్యాలు నేర్పించాడం,  భాషలు నేర్పించడం మొదలైనవి ). ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ....ఎడ్ టెక్ పోర్టల్స్ పైన చెప్పిన పనులు చేయడమే కాకుండా నైపుణ్యాలు ఉన్నవారు వాటిని  మరింత మెరుగు పరుచుకునేందుకు ఇంటి నుంచే శిక్షణ తీసుకునే వెసులు బాటు కల్పిస్తున్నాయి. 

బోధనా అనుభవం, అకడమిక్ నేపథ్యం ఉన్నవారికే కాకుండా  ఇతరులకు కూడా అనేక ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తున్నాయి. గతంలో కార్పొరేట్ లేదా వృత్తిపరమైన నేపథ్యం ఉన్నవారు  బోధనా రంగం వైపు మళ్లడానికి ఎడ్ టెక్ పోర్టల్స్   ప్రోత్సహిస్తున్నాయి.  సాధారణ విద్యా వ్యవస్థలో ఉద్యోగం కోరుకునేవారికి పాఠశాలలైతే బీఈడీ అర్హత ఉండాలి.  ప్రొఫెసర్లు కావాలనుకునేవారికి  నెట్ లేదా  పీ హెచ్ డీ అర్హత ఉండాలి.

అయితే ఎడ్ టెక్ సంస్థలు ఈ అర్హతలు లేకపోయినా పట్టించుకోవు.  బోధనా సిబ్బందిగా నియమిం చుకుంటాయి. బోధనా సిబ్బందిగా నియమించుకోవడానికి వివిధ అంశాల్లో వారి ప్రతిభనే ప్రాతి పదికగా తీసుకుంటారు. భారత్ లో ఎడ్ టెక్ రంగాన్నిప్రభుత్వం నియంత్రిస్తోంది. పర్యవేక్షిస్తోంది.  దీనిపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన మాట్లాడుతూ ఎడ్ టెక్ సంస్థల కోసం ఒక విధానం రూపొందించడానికి  ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెప్పారు.

ఎడ్ టెక్ పోర్టల్స్ లో రూ.30  వేల నుంచి రూ. లక్షన్నర వరకు పారితోషికంగా చెల్లిస్తున్నారు.  వాస్తవం ఏమిటంటే వీరంతా బాంకర్లు, ఇంజినీర్లు, పరిశోధకులు.ఎడ్ టెక్ పోర్టల్స్ లో పని చేయా లనుకునే వారికి బీఈడీ,  బీటీసీ తదితర బోధనా రంగానికి సంబంధించిన క్వాలిఫికేషన్లు అదనపు అర్హతలు అవుతాయి తప్ప అవే ప్రధాన అర్హతలు కాదు. వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వారికి,  కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికే ప్రాధాన్యం. ఎడ్ టెక్ బూమ్ కొత్త ఉపాధి మార్గాలకు ద్వారాలు తెరుస్తోంది.  బోధనా నేపథ్యం లేకపోయినా ఉపాధికి అవకాశాలు ఉన్నాయి. పారితోషికాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. అందుకే అర్హతలు ఉన్న వారు…లేని వారు సైతం ఈ రంగం వైపు పరుగులు తీస్తున్నారు. 



2022-01-13  Education Desk