Courtesy: @Mohit/Twitter
పర్యాటక రంగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక వేళ మీరు ఓ దేశంపై మోజు పడి ఆ దేశంలో స్థిర నివాసం ఏర్పర్చుకోవాలంటే ప్రస్తుతం చాలా సులభతరం అయ్యింది. పలు దేశాలు గోల్డెన్ వీసా పేరుతో రెసిడెన్సీ.. వీసా ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. ఈ విషయంలో
మీరు ఆసక్తిగా ఉంటే ఏ ఏ దేశాలు గోల్డెన్ వీసా ఆఫర్ చేస్తున్నాయో చూడండి….
ఆస్ట్రియా:
యూరోప్‌లోని ఆస్ట్రియాలో పౌరసత్వం చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందుకే ఇక్కడ గోల్డెన్ వీసాలకు చాలా డిమాండ్. ప్రతి ఏడాది 300 మందికి మాత్రమే వీసాలు ఇస్తోంది. దీని అర్ధం ఏమిటంటే అర్హులైన వారికి మాత్రమే ఈ వీసా లభిస్తుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి. ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టాలి. లేదా ప్రభుత్వ ఫండ్‌లో మూడు మిలియన్ యూరోలు లేదా సొంతంగా వ్యాపారం చేయా లనుకుంటే పది మిలియన్ యూరోలు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మీరు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం ఆ దేశంలో పది సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది.
కెనడా :
కెనడా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక్కడ బాగా ప్రసిద్ది చెందింది క్యూబెక్ ఇమ్మిగ్రెంట్ ప్రోగ్రాం (క్యూఐఐపీ). దీనికి చేయాల్సిందల్లా 1.2 మిలియన్ కెనడా డాలర్లు పెట్టుబడులు పెడితే మూడు సంవత్సరాల కాలానికి పౌరసత్వం లభిస్తుంది.
బల్గేరియా :
యూరోప్‌కు చెందిన ఈ దేశంలో గోల్డెన్ వీసా కావాలంటే కనీసం 5,12,000 యూరోల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అటు తర్వాత 18 నెలల తర్వాత పౌరసత్వం కావాలనుకుంటే దానికి రెట్టింపు పెట్టుబడు లు పెట్టాల్సి ఉంటుంది.ఒక వేళ పెద్ద మొత్తంలో డబ్బు సర్దుబాటు చేయలేకపోతే ఐదు సంవత్సరాల తర్వాత పౌరసత్వం ఇస్తారు.
యూకె :
ఇక బ్రిటన్ విషయానికి వస్తే ఇక్కడ 20 లక్షల పౌండ్లు కనీసం పెట్టుబడులు పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని అర్హతలు ఉంటే పౌరసత్వం లభిస్తుంది.
ఐర్లాండ్ :
ఇక్కడ గోల్డెన్ వీసా కావాలనుకునే వారు కనీసం మిలియన్ పౌండ్లు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ ఫండ్, రియల్ ఎస్టేట్, ఎంటర్ప్రైజెస్ ఫండ్ లేదా ఎండోమెంట్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పౌరసత్వం లభించడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. వాటిలో క్వాలిఫై అయితే లభించే అవకాశం ఉంటుంది.
స్పెయిన్ :
ఇక్కడ రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాం కొనసాగుతోంది. కనీసం ఐదు లక్షల యూరోలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే గోల్డెన్ వీసా లభిస్తుంది. అటు తర్వాత ప్రతి రెండేళ్లకు ఒకసారి పౌరసత్వాన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్విట్జర్లాండ్ :
ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ పౌరసత్వం నిబంధనలకు కాస్తంత వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ఫండ్స్‌లో కానీ రియల్ ఎస్టేట్‌లో కానీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. ఏడాదికి 150,000 నుంచి మిలియన్ క్రోనర్ (స్విస్ కరెన్సీ) ఆదాయపు పన్ను కట్టినట్లు ఆధారం చూపితే చాలు. పౌరసత్వం లభిస్తుంది. పౌరసత్వం లభించిన తర్వాత కనీసం పది సంవత్సరాలు ఆ దేశంలో ఉండాలి.
యూఏఈ :
దుబాయిలో గోల్డెన్ వీసా కావాలనుకుంటే .. కనీసం 5 మిలియన్ల స్థానిక కరెన్సీని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఐదు సంవత్సరాల కాలపరిమితి.. మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడితే పది సంవత్సరాల పాటు నివసించేదానికి అనుమతిస్తారు. లేదా మీకు ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటే సులభంగానే పౌరసత్వం లభిస్తుంది.
పోర్చుగల్ :
ఈ దేశంలో వీసా కావాలనుకుంటే రియల్ఎస్టేట్లో ఐదు లక్షల యూరోలు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాల తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సింగపూర్ :
సింగపూర్‌లో పౌరసత్వం కావాలనుకుంటే 2.5 మిలియన్ డాలర్ల సింగపూర్ కరెన్సీ పెట్టుబడులు పెట్టాలి. సొంతం గా వ్యాపారం చేసుకోవచ్చు. రెండేళ్ల పాటు ఆ దేశంలో ఉన్న తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసు కోవచ్చు. అయితే సింగపూర్‌లో ద్వంద్వ పౌరసత్వానికి అనుమతించరు. ఆ దేశం పౌరసత్వం తీసుకుంటే మాతృదేశం పౌరసత్వాన్ని వదులుకోవాల్సిందే.
దేన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా….చాయిస్ ఈజ్ యువర్స్.