collapse
...
Home / వినోదం / హిందీ / Hindi Movie: తెరకెక్కనున్న వీర్‌ సవార్కర్ జీవిత చరిత్ర - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News |...

Hindi Movie: తెరకెక్కనున్న వీర్‌ సవార్కర్ జీవిత చరిత్ర

2022-05-29  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Veer Savarkar  
 

భారత స్వాతంత్ర్య సమరయోధుడు వీర సవార్కర్ జీవిత చరిత్ర త్వరలో తెరకెక్కనుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వీర్ సవార్కర్ 139వ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హీరో రణదీప్ హుడా సవార్కర్‌ పాత్ర చేస్తున్నాడు. మహేశ్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. 

నాసిక్‌లో జన్మించిన సవార్కర్   

వీర్ సవార్కర్ మహారాష్ట్రలోని నాసిక్‌లో 1883లో మే 28న జన్మించారు. రచయితగా, లాయర్‌గా, రాజకీయ నాయకుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా తన జీవిత కాలంలో అనేక విధులు నిర్వర్తించారు. హిందూ మహాసభకు చెందిన కీలక సభ్యుడిగా కూడా సవార్కర్‌ సేవలు అందించారు. హిందుత్వ అనే పదాన్ని వాడుకలో తెచ్చింది కూడా సవార్కరే అని చరిత్రకారులు చెబుతున్నారు. వీర్ సవార్కర్ పూర్తి పేరు వినాయక్ దామోదర్ సవార్కర్. 

ఫస్ట్ లుక్ షేర్ చేసిన హుడా   

స్వతంత్ర వీర్ సవార్కర్ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు చెందిన పోస్టర్‌తో పాటు    ఓ చిన్న వీడియోను కూడా హీరో    రణదీప్ హుడా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. హిందుత్వ ధర్మ్ నహీ..ఇతిహాస్‌ హై అనే అక్షరాలు పోస్టర్ పై భాగంలో కనిపిస్తున్నాయి. ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, లెజెండ్ స్టుడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆనంద్ పండిట్, సందీప్ సింగ్, సామ్ ఖాన్‌లు నిర్మాతలుగా వ్యవహిరిస్తున్నారు.

భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో కీలక భూమిక పోషించిన ఇటువంటి మహా వ్యక్తి జీవిత చరిత్ర తెరకెక్కించడం సాధారణ విషయం కాదు. సవార్కర్ జీవితంలోని ప్రధాన ఘట్టాలను సవాలుగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు రణదీప్ హుడా ట్వీట్ చేశాడు. చాలా కాలంగా మరుగున పడిన    ఓ మహానుభావుడి చరిత్రను సరైన రీతిలోనే తెరకెక్కిస్తామనే నమ్మకం తనలో ఉందని హుడా ట్వీట్ ద్వారా తెలిపాడు. దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కూడా ఈ సినిమాకు సంబంధించిన వివరాలతో కూడిన ట్వీట్‌ను షేర్ చేశాడు.

 



2022-05-29  Entertainment Desk