collapse
...
Home / బిజినెస్ / ఆటోమొబైల్ / లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యు i4 వర్సెస్‌ కియా EV6 AWD - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | New...

లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యు i4 వర్సెస్‌ కియా EV6 AWD

2022-05-31  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

bmw
 

దేశంలో ఎలక్ర్టిక్‌ కార్ల హవా క్రమంగా ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు ఆకర్షణీయమైన ఎలక్ర్టిక్‌ కార్లు ఈ నెలలో మార్కెట్‌లో విడుదల అయ్యాయి. వాటిలో తాజాగా బీఎండబ్ల్యు ఇండియా థర్డ్‌ పుల్‌ ఎలక్ర్టిక్‌ ఆఫరింగ్‌ i4 ఎగ్జిక్యూటివ్‌ సెడాన్‌ ఈ నెల 26న మార్కెట్లో విడుదల చేసింది. అయితే వెనువెంటనే  అంటే జూన్‌ 2న కియా కూడా ఈవీ6 అనే  కొత్త ఎలక్ర్టిక్‌ కారును మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ క్రాస్‌వోవర్‌ కారు గురించి పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో మీడియాలో పెద్ద ఎత్తున సమీక్షలు కూడా వచ్చాయి. అయితే ఈ రెండు కార్ల ఆఫరింగ్‌ వేర్వేరుగా ఉంటాయి. బాడీ, స్టయిలింగ్‌ అంతా దేనికది ప్రత్యేకం. అయితే ధర మాత్రం ఇంచుమించు రెంటి ధర సమానంగానే ఉండే అవకాశం ఉందని ఆటో రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్లే ఈ రెండు లగ్జరీ కార్ల  గురించి పోల్చి విశ్లేషిస్తున్నారు.

బీఎండబ్ల్యు i4, కియా EV6 AWD రెండు ఈవీలు ఒక్కసారి పుల్‌చార్జి చేస్తే సునాయాసంగా 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.  బీఎండబ్ల్యు 80.7 కెడబ్ల్యుహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో 590 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే.. అదే కియా ఈవీ6 77.5 బ్యాటరీ ప్యాక్‌తో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కాగా వాస్తవానికి చూస్తే ఫస్ట్‌ డ్రైవ్‌ తర్వాత ఈ రెండు కార్లు 400 కిలోమీటర్ల కంటే కాస్తా ఎక్కువ వరకు ప్రయాణించాయి.

ఇక ఇంజిన్‌ వివరాల విషయానికి వస్తే 300 హెచ్‌పీ ఫ్లస్‌ పవర్‌ ఫిగర్‌ కలిగిన ఈ రెండు ఈవీలు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఆరు సెకన్లలో అందుకుంటాయి. బీఎండబ్ల్యు రియల్‌ యాక్సిల్‌ మౌంటెడ్‌ మోటార్‌ 340 పీఎస్‌ ,430 ఎన్‌ఎం పవర్‌ ఉత్పత్తి చేయగా.. కియా ఈవీ6 ఎడబ్ల్యుడి డ్యూయల్‌ మోటార్‌ మాత్రం 325 పీఎస్‌ 605 ఎన్‌ఎం పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎక్స్‌ ట్రా టార్క్‌ రెంటి మధ్య కాస్తా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈవీ6ఎస్‌ 5.5 సెకన్లలో 0-100 కిలోమీటర్లకు తాకితే అదే బీఎండబ్ల్యు మాత్రం 5.7 సెకన్లకు చేరింది. టాప్‌ స్పీడ్‌ రెండు ఈవీలలలో ఎలక్ర్టానిక్‌ కార్లలో పరిమితి ప్రకారం 190 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేశారు.ఇక కారు డైమన్షన్‌ను చూస్తే బీఎండబ్ల్యు ఐ4ను తీసుకుంటే 4,783 ఎంఎం కాగా కియా ఈవీ 6 కంటే చాలా పెద్దది, పొడవు నుంచి   వీల్‌బేస్‌ విషయానికి వస్తే బీఎండబ్ల్యు కంటే ఈవీ 6 పెద్దగా ఉంది. 

ఇక ఇంటీరియర్‌ పీచర్స్‌ విషయానికి వస్తే ఈ రెండు కార్ల ఇంటీరియర్స్‌ చాలా లగ్జరీగా ఉన్నాయి. బీఎండబ్ల్యు ఐ4 విషయానికి వస్తే 12.3 అంగుళాల డిజిటల్‌ ఇన్సుస్ర్టుమెంట్‌ క్లస్టర్‌ 14.9 అంగుళాల టచ్‌ స్ర్కీన్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటోంది. ఇక బీఎండబ్ల్యు విషయానికి వస్తే లెటెస్టు ఐ డ్రైవ్‌ 8 ఇంటర్‌పేజ్‌ ద్వారా ఓటీఏ అప్‌డేట్స్‌ సపోర్ట్‌ చేస్తుంది. 360 డిగ్రీల కెమెరా 3 జోన్‌ క్లయిమెంట్‌ కంట్రోల్‌, సన్‌రూఫ్‌, పవర్డ్‌ ఫ్రంట్‌సీట్స్‌, అన్నీ ఎల్‌ఈడీ లైట్స్‌ బిగించింది. దీనికి వ్యతిరేకంగా కియా  ఈవీ6 కూడా అత్యాధునిక మాడ్రన్‌ కేబిన్‌ ఈవీ6 డ్యాష్‌బోర్డు రీసైక్లిబుల్‌ మెటిరియల్‌గా వాడుకోవచ్చు. మొత్తం లగ్జరీకి ఎలాంటి కాంప్రమైజ్‌ లేకుండా రూపొందించింది. డిజిటల్‌ కాక్‌పిట్‌ విషయానికి వస్తే రెండు 12.3 అంగుళాల స్ర్కీన్‌, 24 అంగుళాల కర్వ్‌డ్‌ డిస్‌ప్లే రియల్‌ ఎస్టేట్‌...  డ్రైవర్‌కు ఎప్పటికప్పడు సమాచారం ఇవ్వడంతో పాటు ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సదుపాయం కూడా ఉంది. దీంతో పాటు 360 డిగ్రీల కెమెరా, సన్‌రూఫ్‌ పవర్డ్‌  ఫ్రంట్‌ సీట్స్‌, అయితే ఈ విభాగంలో కియా కాస్తా పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు. ధర విషయానికి వస్తే బీఎండబ్ల్యు ఐ4 రూ.69.9 లక్షలు కాగా.. కియా ఈవీ 6 రూ.65 లక్షలుగా ఉండవచ్చునని మార్కెట్‌ వర్గాల అంచనా.

 

మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి

 2022-05-31  Business Desk