collapse
...
Home / క్రీడలు / ఐపిఎల్ / I.P.L 2022: ప్లే ఆఫ్ రేసులో ముందుకు వచ్చిన ఢిల్లీ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News...

I.P.L 2022: ప్లే ఆఫ్ రేసులో ముందుకు వచ్చిన ఢిల్లీ

2022-05-12  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

DC win over RR  
 Courtesy:iplt20.com

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ..రెండు పాయింట్లతో పాటు మంచి రన్‌రేట్ కూడా సాధించింది. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి చేరింది. ప్లే ఆఫ్ రేసులో మరింత ముందుకు వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు మొత్తం 12 మ్యాచులు ఆడి 6 మ్యాచుల్లో గెలిచింది. 6 మ్యాచుల్లో ఓటమి పాలయింది. 12 పాయింట్లు సాధించిన ఆ జట్టు ఇంకా రెండు లీగ్‌ మ్యాచులు ఆడాల్సి ఉంది. 

రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు   

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 161 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై గెలుపొందింది.

రాజస్థాన్ ప్రయోగం..అశ్విన్ ఎంట్రీ   

తొలిత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ జట్టుకు ఓపెనింగ్ జోడీ..కలిసి రాలేదు. విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ 7 పరుగులకే ఔటయ్యాడు. చేతన్ సకారియా వేసిన బౌలింగ్‌లో శార్ధూల్ ఠాకుర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో రాజస్థాన్ జట్టు ఓ ప్రయోగం చేసింది. బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను బ్యాటింగ్ చేయడానికి పంపింది. అశ్విన్‌ తన జట్టు అవసరాలకు తగ్గట్లు తనను తాను మలచుకున్నాడు. బ్యాట్ ఝుళిపించాడు. పరుగుల వరద పారించాడు. ఊహించని రీతిలో చెలరేగి ఆడాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 38 బంతుల్లో 4 బౌండరీలు, 2 సిక్సర్లు కొట్టాడు. అర్ధశతకం పూర్తి చేశాడు. మరచిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు. సరిగ్గా అదే స్కోర్ వద్ద మిచెల్ మార్ష్ వేసిన బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

దేవ్‌దత్ పడిక్కల్ 48 రన్స్   

ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో దేవ్‌దత్ పడిక్కల్ మాత్రమే రాణించాడు. 30 బంతుల్లో 6 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది.

ఢిల్లీని గెలిపించిన వార్నర్, మార్ష్   

161 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టుకు మొదటి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ డకౌటయ్యాడు. పరుగుల ఖాతా తెరవకముందే ఢిల్లీ జట్టు ఓ వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌కు మిచెల్ మార్ష్ తోడయ్యాడు. అక్కడి నుంచి చెలరేగి ఆడుతూ వచ్చిన వీళ్లిద్దరూ లక్ష్యం వైపుగా అడుగులు వేశారు. ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. 18వ ఓవర్‌ వరకు మరో వికెట్ పడకుండా ఆడారు. గెలుపు అవకాశాలను పెంచుకుంటూ వచ్చారు. పరుగులకు, బంతులకు మధ్య తేడా తగ్గించుకుంటూ వచ్చారు. ఒత్తిడి లేకుండా పరుగులు సాధించారు. ఈ క్రమంలో యజువేంద్ర చాహల్ వేసిన బౌలింగ్‌లో మార్షల్ ఔటయ్యాడు. 89 పరుగులు చేసిన మార్షల్ 5 బౌండరీలు, 7 సిక్సర్లు బాదాడు. మార్షల్ ఔటైన తర్వాత వచ్చిన రిషబ్ పంత్‌..డేవిడ్ వార్నర్‌కు తోడయ్యాడు. వీరిద్దరూ జట్టును విజయతీరాలకు చేర్చారు. 

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్   

బౌలింగ్, బ్యాటింగ్‌లో తన సత్తా చాటిన మిచెల్ మార్ష్‌ కు ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 3 ఓవర్లు వేసిన మిచెల్ మార్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో ఇరగదీశాడు. 62 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. మార్షల్ తన ఇన్నింగ్స్ లో 5 బౌండరీలు, 7 సిక్సర్లు బాదాడు.

 



2022-05-12  Sports Desk