ఐపీఎల్ టోర్నీ 2022 భాగంగా జరిగిన 59వ మ్యాచ్‌లో చెన్నై జట్టు చతికిల పడింది. తొలిత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు కేవలం 97 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి ముంబై జట్టు ఆపసోపాలు పడింది. 15వ ఓవర్ లో టార్గెట్ రీచ్ అయింది. ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ మాత్రం స్కోర్ చేయడానికి కూడా అనేక తంటాలు పడింది. 5 వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ, హృతిక్ షోకీన్‌లు ముంబై జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో ఓటమి ద్వారా చెన్నై జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ప్లే ఆఫ్ రేస్ నుంచి అందరికంటే ముందుగా వైదొలిగిన ముంబై జట్టు తమతో పాటు చెన్నై జట్టును కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకునే చేసింది.
చెత్తగా ఆడిన చెన్నైఆటగాళ్లు
తొలిత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ధోనీ చేసిన 36 పరుగులే జట్టు స్కోర్‌లో హయ్యస్ట్ స్కోర్ కావడం బట్టి చూస్తే...ఆ జట్టు ప్రదర్శన ఎలా ఉందో ఇట్టే అర్ధమౌతోంది. టాపార్డర్ పూర్తిగా విఫలమయింది. ఓపెనర్ కాన్వే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే వచ్చిన మోయిన్ అలీ కూడా డకౌట్ అయ్యాడు. జట్టు స్కోర్ ఒక్క పరుగు ఉన్నప్పుడు చెన్నై జట్టు ఒక వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 2కి చేరిన తర్వాత 2వ వికెట్ కోల్పోయింది. మోయిన్ అలీ తర్వాత బరిలో దిగిన రాబిన్ ఊతప్ప కూడా నిరాశ పరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో చెన్నై జట్టు 5 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది.
17 పరుగులకు 4 వికెట్లు
మరోపక్క ఓపెనర్ రుతరాజ్ గైక్వాడ్ బరిలో ఉన్నాడు. అంబటి రాయుడు గైక్వాడ్‌కు జత కలిశాడు. వీరిద్దరూ జట్టును గాడిలో పెడతారని చెన్నై అభిమానులు ఆశించారు. కానీ వాళ్ల ఆశలపై డేనియల్ సామ్స్ నీళ్లు పోసాడు. గైక్వాడ్‌ను 7 పరుగుల వద్ద ఔట్ చేశాడు. దీంతో చెన్నై జట్టు 17 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఇక అక్కడి నుంచి తేరుకోలేకపోయింది. కీలక బ్యాటర్లందరూ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో మిగతా ప్లేయర్లపై ఒత్తిడి పెరిగింది. వారు కూడా ముంబై బౌలర్ల ముందు తలవంచారు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ ధోనీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 4 బౌండరీలు, 2 సిక్సర్లు కొట్టి అభిమానులను అలరించాడు. చివరి వరకు బరిలో నిలిచాడు. 16వ ఓవర్ చివరి బంతికి ముకేశ్ చౌదరి రనౌట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. ముంబై బౌలర్ల ధాటిని తట్టుకోలేకపోయిన CSK టీమ్ కేవలం 97 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబై బౌలర్ల హవా
ముంబై బౌలర్లలో డేనియల్ సామ్స్ 3 వికెట్లు తీశాడు. కుమార కార్తీకేయ 2 వికెట్లు, మెరిడిన్ 2 వికెట్లు పడగొట్టారు. రమన్ దీప్ సింగ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ముంబై బ్యాటింగ్
స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు కూడా మొదట్లో తడబడింది. ఓపెనర్లు ఇద్దరూ విఫలమయ్యారు. ఇషాన్ కిషన్ 6 పరుగులకు ఔటవ్వగా..రోహిత్ శర్మ 18 పరుగులకు పెవిలియన్ చేరాడు. . చెన్నై బౌలర్ ముకేశ్ చౌదరి అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌కి దిగిన ముంబై జట్టుకు చెమటలు పట్టించాడు. ఒకానొక దశలో ముంబై జట్టు కూడా కష్టాల్లో పడింది. 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బరిలోకి వచ్చిన తిలక్ వర్మ 34, హృతిక్ షోకీన్ 18, టిమ్ డేవిడ్ 16 పరుగులు చేయడం ద్వారా ముంబై జట్టు విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
4 ఓవర్లలో 3 కీలక వికెట్లు తీసిన ముంబై బౌలర్ డేనియల్ సామ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చెన్నై టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, మోయిన్ అలీ వికెట్లు తీశాడు.
Daniel Sams set the ball rolling for @mipaltan & bagged the Player of the Match award for his fine bowling display. 👍👍
Scorecard ▶️ https://t.co/c5Cs6DHILi#TATAIPL | #CSKvMIpic.twitter.com/nv72G9Sugd— IndianPremierLeague (@IPL) May 12, 2022
Match Report - A fine bowling display led by Daniel Sam’s three wicket haul reduced CSK to 97 in the first innings before a vital partnership between Tilak Varma and Hrithik Shokeen powered MI to a 5-wicket win - by @mihirlee_58
READ - https://t.co/ufqyEzUSix#TATAIPL#CSKvMI— IndianPremierLeague (@IPL) May 12, 2022
Mukesh Choudhary is our Top Performer from the second innings for his bowling figures of 3/23.
A look at his bowling summary here 👇👇 #TATAIPL#CSKvMIpic.twitter.com/StDWPGHLeK— IndianPremierLeague (@IPL) May 12, 2022