పంజాబ్ ఖాతాలో మరో విజయం
ఐపీఎల్ టోర్నీ 2022లో భాగంగా జరిగిన 60వ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు విజయం సాధించింది. 54 పరుగుల తేడాతో బెంగళూర్ జట్టు ఓటమి చెందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా..బెంగళూర్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారీ ఓటమి తప్పలేదు.
2010 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూర్ జట్టు 33 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టి ఊపందుకున్న కోహ్లీ..కిగిసో రబడాకు దొరికిపోయాడు. 20 పరుగుల వద్ద ఔటయ్యాడు. కెప్టెన్ డ్యూ ప్లెసిస్ కూడా పంజాబ్ బౌలర్ల ధాటిని తట్టుకోలేకపోయాడు. 10 పరుగులకే వెనుదిరిగాడు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ పరుగులకే ఔటవ్వడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది.
ఆ తర్వాత వచ్చిన వారిలో రజత్ పటీదార్ 26 పరుగులు చేయగా..మాక్స్ వెల్ 35 పరుగులు చేశాడు. మిగతా ఎవ్వరూ రాణించలేకపోయారు. దీంతో బెంగళూర్ జట్టు ఓటమి ఖాయమయింది. బెంగళూర్ జట్టు ఏ దశలోనూ పోరాట పటిమ కనబరచలేదు. ఇటీవల కాలంలో చిచ్చరపిడుగు వలే చెలరేగుతున్న దినేశ్ కార్తీక్ కూడా ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. కేవలం 11 పరుగులకే ఔటయ్యాడు.
కగిసో రబడకు 3 వికెట్లు
పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ 3 వికెట్లు తీయగా..రిషి ధావన్, రాహుల్ చాహల్ రెండే వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కగిసో రబడ 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
పంజాబ్ బ్యాటింగ్ అదుర్స్
తొలిత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు ఓపెనర్ జానీ బెయిర్ స్టో అద్భుత ఆరంభం అందించాడు. మెరుపు వేగంతో ఆడాడు. చిచ్చర పిడుగు వలే చెలరేగి ఆడాడు. స్టేడియం నలువైపులా షాట్లు కొట్టాడు. అభిమానులను అలరించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 21 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాజపక్సా కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో బెయిర్ స్టో కు ..లియామ్ లివింగ్ స్టోన్ జత కలిశాడు. ఇద్దరూ కలిసి బెంగళూర్ బౌలర్లను చిత్తు చేశారు. 10 ఓవర్లు పూర్తికాకముందే జట్టు స్కోర్ 100 పరుగుల మైలురాయిని దాటింది. 10వ ఓవర్ తొలి బంతికి బెయిర్ స్టో ఔటయ్యాడు.
29 బంతుల్లోనే 66 పరుగులు
ఓపెనర్‌గా వచ్చిన బెయిర్ స్టో జట్టు స్కోర్‌ను 100 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. 7 భారీ సిక్సర్లు బాదాడు. 4 ఫోర్లు కొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు.
లివింగ్ స్టోన్ బాదుడు
బెయిర్ స్టో ఔటైన తర్వాత లివింగ్ స్టోన్ బాదుడు బాధ్యతలు తీసుకున్నాడు. 20వ ఓవర్ రెండో బంతి వరకూ క్రీజులో ఉన్నాడు. హర్షల్ పటేల్ వేసిన ఆ ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. 42 బంతుల్లోనే 5 బౌండరీలు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. వీరిద్దరి వీర బాదుడుతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ఈ మ్యాచ్‌లో వీర బాదుడు బాదిన బెయిర్ స్టో కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తాను వీరవిహారం చేస్తే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్‌లో చూపించాడు. మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు. అభిమానులను అలరించాడు.
.@jbairstow21 set the ball rolling for @PunjabKingsIPL and bagged the Player of the Match award for his stunning knock. 👌 👌
Scorecard ▶️ https://t.co/jJzEACTIT1#TATAIPL | #RCBvPBKSpic.twitter.com/HLkKfpD8x0— IndianPremierLeague (@IPL) May 13, 2022
READ: @jbairstow21 & @liaml4893 starred with the bat as @PunjabKingsIPL beat #RCB by 5⃣4⃣ runs to seal their 6⃣th win of the #TATAIPL 2022. 👍 👍 - By @mihirlee_58
Here's the match report 🔽 #RCBvPBKShttps://t.co/s9Zq366d6K— IndianPremierLeague (@IPL) May 13, 2022