ఇటీవలి కాలంలో మనం తీసుకునే ఆహారంపై వివాదం మొదలైంది. శాకాహారం, మాంసాహారం పై రచ్చ ప్రారంభమైంది. ఆ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ….శాకాహార మాసం జనవరిలోనే ఈ వివాదం చోటు చేసుకోవడం ఓ విశేషం. శాకాహార మాసం పై ప్రత్యేక కథన….
శాకాహారిగా ఉండటానికి మీరు జంతు మాంసాన్ని ఆహారంగా స్వీకరించకుండా ఉండటమే కాదు.. జంతువుల ఉత్పత్తులన్నింటిని త్యజించగలగాలి. ప్రజల ఆహార అలవాట్లను మార్చడం, ఇతర జీవన శైలి ఉత్పత్తుల్లో జంతువులతో తయారు చేసిన వస్తువులను ధరించకుండా ఉండేలా ప్రజలను ప్రోత్సహించడం శాకాహార మాసం లక్ష్యాలు. శాకాహార మాసం చరిత్ర ఎలా మొదలైందో తెలుసుకుందాం.
శాకాహార మాసం చరిత్ర
ప్రపంచ చరిత్రలో శాకాహార మాసం 2014 జనవరిలో మొదలైంది. శాకాహార సంస్థాపకులు జేన్ మరియు మాథ్యూలు శాకాహార ప్రపంచాన్ని చూడాలనే కోరికతో దీన్ని ప్రారంభించారు. ప్రపంచంలో గొప్ప మార్పులన్నింటిలాగే తాము కూడా ఏదో ఒక చోట దీన్ని మొదలెట్టాల్సి ఉంటుంది వీరికి తెలుసు. పైగా కనీస అవగాహన లేకపోవడం అనేది శాకాహారానికి అతి పెద్ద అవరోధంగా ఉంటోంది. అందుకో శాకాహార తాత్వికతపై ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగానే శాకాహార మాసాన్ని ప్రారంభించారు. శాకాహారులుగా మారాలనే వారికి మద్దతునిస్తూ వారికి తగిన సూచనలు ఇస్తుంది. ప్రజలు నూతన సంవత్సర తీర్మానాలను చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ జనవరిలోనే మొదలయ్యే శాకాహార మాసం ప్రజలకు మరింత ప్రసిద్థమైన నూతన సంవత్సర తీర్మానం చేసుకోవడానికి మంచి అవకాశం ఇస్తోంది.
2014 జనవరిలో మొదలైన తొలి శాకాహార మాసం ఎంతగానో ఎదిగి, ఖండాతరాలకు విస్తరించింది. ఇప్పుడు ప్రపంచమంతా దీన్ని అనుసరిస్తున్నారు. శాకాహార మార్కెట్లో ఇది చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చింది. జంతు ఆధారిత ఆహారోత్పత్తులకు ప్రత్యామ్నాయంగా అనేక శాకాహార బ్రాండ్లను ఇది ప్రోత్సహించింది. ప్రతి సంవత్సరం శక్తి పుంజుకుంటున్నందువల్ల భూమిపై ఎన్నడూ లేనంతగా అత్యధిక ప్రజానీకం ఇప్పుడు శాకాహారులుగా మారారు. మీరూ శాకాహారులుగా మారడాని ఇంతకు మించిన మంచి తరుణం మరొకటి ఉండదు మరి.
చరిత్రలో శాకాహరం:
వర్తమాన శక పూర్వం 500
వర్తమాన శక పూర్వం 500వ సంవత్సరంలో ప్రాచీన భారతీయ, మధ్యప్రాచ్య సంస్కృతులు మాంసాహారాన్ని త్యజించాయి. ఆ తర్వాత వేలాది సంవత్సరాలుగా శాకాహారాన్ని పాటిస్తూ వచ్చాయి. అయితే దీన్ని మొట్టమొదటిగా రికార్డు చేసినవారు గ్రీక్ తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు ఫైథాగరస్.
1806
శాకాహార తాత్వికతను మొదటిసారిగా యూరప్‌లో ప్రారంభించారు. డాక్టర్ విలియం లాంబే ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల కారణంగా శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం మొదలెట్టారు. దీంతో ఆయన ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. తనవద్దకు వచ్చే రోగులకు శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం ప్రబోధిస్తూ చ్చారు. శాకాహారంపై 1815లో ఈయన ఒక పుస్తకం కూడా రాశారు.
1944 యూరప్‌లో తొలిసారిగా వేగన్ పదం
యుకే వేగన్ సొసైటీని స్తాపించిన డేవిడ్ వాట్సన్ వెజిటేరిటయన్ అనే పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చి దానికి వేగన్ అనే పొట్టి పేరు ఖరారు చేశారు. మాంసాహారాన్ని మాత్రమే కాకుండా పాలు, గుడ్లు వంటి జంతు ఉత్పత్తులను కూడా వదిలిపెట్టడాన్ని ఈ పదం వివరిస్తుంది.
2014 మొట్టమొదటి శాకాహార మాసం ప్రారంభం
జనవరి తొలి ప్రారంభాలకు, కొత్త అలవాట్లకు సరైన సమయం అనే గ్రహింపుతో జనవరి నెల పొడవునా ప్రజలు శాకాహారమే ఆరగించేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చరిత్రలో తొలి శాకాహార మాసం బ్రిటన్‌లో ప్రారంభమైంది. దివంగతులైన జేన్ మరియు మాథ్యూ గ్లోవర్లు బ్రిటన్‌లో లాభేతర సంస్థగా దీన్ని ప్రారంభించారు.
2019 కేఎఫ్‌సీ తొలి వేగన్ చికెన్
భూ-అనుకూల పరిణామంలో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ చికెన్ ఆహార చైన్ సంస్థ కేఎఫ్‌సీ 2019 జనవరి 2న శాకాహార చికెన్ బర్గర్‌ని విడుదల చేసింది. శాకాహారులందరికీ జనవరిలో దీన్ని అందించడమే దీని లక్ష్యం. దీనికి ఇంపోస్టర్ బర్గర్ అని పేరుపెట్టారు.
2019 బ్రిటన్‌లో పబ్‌ల మందకొడితనానికి కారణమైన శాకాహారం
గ్రేట్ బ్రిటన్ పొడవునా 2019 జనవరిలో పబ్‌లు, రెస్టారెంట్లను మాంద్యం ఆవరించిందిం. ఎందుకంటే ఆ సంవత్సరం జనవరిలో శాకాహారం ప్రధాన జాతీయ స్రవంతిలో ప్రవేశించింది. ఈ పరిణామాన్ని చూసి పబ్ ఓనర్లు ఆశ్చర్యపడకపోయి ఉండవచ్చు కానీ, పబ్‌లలో మరిన్ని శాకాహార రకాలను మెనులో చేర్చడానికి ఇది వారిని ప్రేరేపించింది. ప్రత్యేకించి యువతరంలో శాకాహారం బాగా వ్యాప్తి చెందడంతో వారికి అనుకూలమైన మెనూను పబ్స్ చేపట్టాయి.
2020 శాకాహార తత్వానికి పెరిగిన డిమాండ్
ప్రారంభించిన ఆరు సంవత్సరాలలోపే వేగనరీ ప్రపంచ వ్యాప్తంగా 4,50,000 మంది ప్రజల్లో విస్తరించింది. ఈమెయిల్ ద్వారా వేగనరీ కోససం సైన్ చేసిన వారికి శాకాహార జీవన శైలిని అలవర్చుకునేలా ఎన్నో రిమైండర్లు, టిప్‌లతో సందేశాలు పంపారు.
2021 మెక్‌డోనాల్డ్ మెక్ ప్లాంట్ వేగన్ బర్గర్
ఈ సంవత్సరం జనవరి మాసంలో మొట్టమొదటిసారిగా స్వీడన్, డెన్మార్క్ దేశాల్లో మెక్ ప్లాంట్ వేగన్ బర్గర్‌ని ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సస్థ మెక్ డోనాల్డ్ ప్రవేశపెట్టింది. సెప్టెంబర్‌లో బ్రిటన్‌లోనూ దీన్ని ప్రారంభించారు.
వేగనరీ మాసాన్ని వేడుకగా జరుపుకోవడానికి మీకు ఏ కారణాలైనా తోడై ఉండవచ్చు కానీ, మీరు శాకాహార మాసాన్ని పాటించడమే అన్నిటికంటే ముఖ్యమైంది. కాలిప్లవర్ స్టీక్లను మాంసాహారానికి బదులుగా తీసుకోవడం, మీ షాపింగ్ కార్ట్‌లో పూర్తిగా పండ్లు, కూరగాయలు కనిపించడం అనేది ఆరోగ్యకరమైన, నిలకడైన నైతిక జనవరి మాసాన్ని గుర్తు చేస్తుంది. దీనికోసం మీ శరీరం మీకు నిజంగా కృతజ్ఞత చెబుతుంది కూడా.