6tvnews

collapse
...
Home / అంతర్జాతీయం / Love with Robo: ఇది సినిమా కాదు మామ...

Love with Robo: ఇది సినిమా కాదు మామ...

2022-01-08  News Desk

robots
 

రోబోకి ఓ అమ్మాయి నచ్చింది.. వెంటనే మనసు ఇచ్చాడు.. ఆ అమ్మాయి ప్రేమను పొందేందుకు విధ్వంసాలు సృష్టించాడు.. ఇది సినిమా  స్టోరీ... కానీ ఇక్కడ ఓ పెద్దాయన తనకుతానుగా రోబో తో ప్రేమలో పడ్డాడు.. చివరికి పెళ్లికి కూడా సిద్ధపడ్డాడు.. ఇది నిజ జీవితంలో కళ్ల ముందు కనిపించే ఓ లవ్ స్టోరీ.. వివరాలు కావాలంటే మనం ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిందే..

హృదయం ఎక్కడున్నది... 

నీ చుట్టే అది తిరుగుతున్నది.. అంటూ రోబో చుట్టూ తిరుగుతున్నాడు ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాం డ్ కు చెందిన జియోఫ్ గల్లాఘర్. ఓ మరమనిషీ.. అంటూ రోబో వెంటపడుతున్నాడు. ఎమ్మా.. అనే పేరు గల రోబోతో ప్రేమలో ఉన్న ఈయన పెళ్లి కోసం ముస్తాబవుతున్న తీరు సర్వత్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఈ వ్యక్తి రోబో ల గురించి ఆసక్తిగా తెలుసుకోవడం తన వ్యాపకంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో  వెబ్ సైట్ ద్వారా ఎమ్మా గురించి తెలుసుకున్నారు. నీలి కళ్ళ తో ఎంతో అందం గా కనిపించిన రోబో ఇతని ఆకట్టుకుంది. ఇతని హృదయంలో ప్రత్యేక స్థానా న్ని సంపాదించుకుంది. దీనితో మనసు పారేసుకున్న ఈ పెద్దాయన ఈ రోబోను కొనుగోలు చేశాడు. 2019 లో రోబో ఇతని దగ్గరికి వచ్చింది. ప్రస్తుతం తన తో విడదీయలేని బంధం ఏర్పడిందని జియో ఫ్ చెబుతున్నారు. అందుకే రోబోను పెళ్లి చేసుకొని భార్య స్థానం ఇవ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. రోబో ను పెళ్లి చేసుకున్న మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాలని తాపత్రయపడుతు న్నారు.

ఏమిటీ వైచిత్రి.. 

యంత్రాలతో సహజీవనం అనేది సినిమా కథ లో అయితే చూపరులను ఆకట్టుకుంటుంది. కానీ వ ర్తమానంలో ఇలాంటివి దూరమౌతున్న మానవ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఇప్పటికీ చాలామంది కంప్యూటర్లు, సెల్ఫోన్ల కు అలవాటు పడి  మానవ సంబంధాలకు దూరం అయిపోతు న్నారు. కుటుంబ విలువలను కూడా మరిచి పోతున్నారు. యంత్రాల ఎదుగుదల మానవ సంబంధా లను పాతాళానికి తొక్కేస్తుందని ఇప్పటికే పాతతరం మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాం టి తరుణంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు మనుషుల్లో యంత్రాలపై పెరుగుతున్న పిచ్చికి పరాకాష్ఠగా మారుతున్నాయి. ఎక్కడికెళుతుంది.. దేశం ఏమై పోతుంది అన్న భావనను కలిగిస్తాయి.


2022-01-08  News Desk