6tvnews

collapse
...
Home / బిజినెస్ / ఫార్మా / Make in India: కోల్డ్ చెయిన్ ఉత్పాదనల తయారీ కేంద్రం ప్రారంభం

Make in India: కోల్డ్ చెయిన్ ఉత్పాదనల తయారీ కేంద్రం ప్రారంభం

2022-01-12  Business Desk

Medical-Pic
 

మెడికల్ కోల్డ్ చెయిన్ సొల్యూషన్స్ లో అంతర్జాతీయ అగ్రగామి , లగ్జెంబర్గ్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న బి మెడికల్ సి స్టమ్స్    గుజరాత్ లోని ముంద్రాలో తన తయారీ కేంద్రం ప్రారంభించింది. పలువురు జాతీయ , అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రూ. 100 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రం వ్యాక్సిన్ రిఫ్రిజిరేటర్లు , ఫ్రీజర్లు , ట్రాన్స్ పోర్ట్ బాక్స్ ల వంటి మెడికల్ కోల్డ్ చెయిన్ ఉత్పాదనలను  100,000 యూనిట్ల మేరకు తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుం ది. డిమాండ్ ఆధారంగా ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం కూడా ఉంది. ముంద్రాలోని కర్మాగారం కంపెనీకి సంబంధిం చి యూరప్ వెలుపల నిర్మించిన మొట్టమొదటి తయారీ కేంద్రం. కచ్ ప్రాంతంలో ఇది వేలాది ఉద్యోగావకాశాలను కల్పిం చనుంది.    లగ్జెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్ ఈ సందర్భంగా తన సందేశాన్ని అందించారు. ఏడాది క్రితమే ప్రధాని మోదీతో సమావేశమయ్యానని, ఏడాది తిరక్కముందే ఆ సమావేశం ఫలితాలను అందిస్తోందని అన్నా రు. 

జంతు సంరక్షణలోనూ కీలకం    

కేంద్ర ఫిషరీస్ , పశు సంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ మంత్రి  పురుషోత్తం రుపాలా ఈ సందర్భంగా బి మెడికల్ సిస్టమ్స నుంచి భారతదేశంలో మొదటిసారిగా తయారైన మల్టీ మోడ్ వ్యాక్సిన్ రిఫ్రిజిరేటర్ / ఫ్రీజర్, ఐస్ ప్యాక్ ఫ్రీజర్ యూనిట్ ను ప్రారంభించారు. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను మెరుగుపర్చడంలో ఇవి కీలకపాత్ర పోషించను న్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రుపాలా మాట్లాడుతూ , ‘‘ భారత్ , లగ్జెంబర్గ్ ప్రధానమంత్రులకు నా అభినందనలు , వారి నాయకత్వ మార్గదర్శకత్వం కారణంగా ఈ ద్వైపాక్షిక ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది కోట్లాది మానవ జీవితాలను కా పాడడం మాత్రమే గాకుండా , జంతువుల ఆరోగ్య సంరక్షణకు కూడా తోడ్పడుతుంది ’’ అని అన్నారు.    

‘అవర్ మేక్ ఇన్ ఇండియా జర్నీ’    

ఈ ఫ్యాక్టరీని భారతదేశంలో గ్రాండ్ డచీ ఆఫ్ లగ్జెంబర్గ్ దౌత్యవేత్తగా ఉన్న పెగ్గీ ఫ్రాంట్ జెన్ ప్రారంభించారు. అదాని పోర్ట్ ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ రక్షిత్ షా       తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదానీ పోర్ట్స్ సెజ్    ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్    రక్షిత్ షా , బిమెడికల్ సిస్టమ్ ఇండియా ప్రై.లి.  'అవర్ మేక్ ఇన్ ఇండియా జర్నీ ' గత సంవత్సర కాలపు ప్రయాణ జ్ఞాపికను ఆవిష్కరించారు.

బి మెడికల్ సిస్టమ్స్ ఇండియా ప్రై.లి. సీఈఓ  జెసాల్ దోషి ఈ సందర్భంగా మాట్లాడుతూ , ‘‘బి మెడికల్ సిస్టమ్స్ కల ని జమైన చారిత్రక సందర్భం ఇది. భారతదేశ ఆరోగ్యసంరక్షణ వ్యవస్థకు అండగా నిలవడం మాకు గర్వకారణం. మేం అత్యా ధునిక సాంకేతికతలను , వినూత్నతలను తీసుకువస్తున్నాం. అవి విశ్వసనీయ మెడికల్ కోల్డ్ చెయిన్ ను దేశం లోని ప్ర తీ ప్రాంతానికీ అందిస్తాయి. ఈ కేంద్రాన్ని ప్రారంభించడం భారతదేశం చేపట్టిన మేక్ ఇన్ ఇండియాపట్ల మాకు గల అం కితభావానికి నిదర్శనం. భారతదేశాన్ని యావత్ ప్రపంచానికి కోల్డ్ చెయిన్ క్యాపిటల్ గా చేయడం మా ఆశయం ’’ అని అన్నారు. 

ఫ్యాక్టరీలో మహిళలే అధికం...    

ఈ ఫ్యాక్టరీలో అధిక శాతం సిబ్బంది మహిళలే కావడం ఓ విశేషం. అదాని ఫౌండేషన్ అండతో మహిళా సాధికారికతకు ఈ కంపెనీ కృషి చేస్తోంది. వెయ్యి మంది అణగారిన వర్గాల పిల్లల కోసం బి మెడికల్ సిస్టమ్స్ రెండు సిఎస్ ఆర్ ప్రాజెక్టు లను కూడా ప్రకటించింది. వీటిలో ఒకదాన్ని కచ్ లో యూసుఫ్ మెహరల్లీతో ఫౌండేషన్ తో , మరోదాన్ని అనాథ పిల్లలకు , అణగారిన వర్గాల పిల్లలకు చదవు చెప్పేందుకుపాలిటానలో విద్యావిహార్ ఖేల్ వాణితో కలసి నిర్వహించనుంది. 

ప్రధాని నరేంద్ర మోదీ నుంచి బి మెడికల్ సిస్టమ్స్ ఆహ్వానం అందుకున్న తరువాత , బి మెడికల్ సిస్టమ్స్ఇండియా 2021 మొదట్లో ఏర్పడింది. దేశం చేపట్టిన ఇమ్యూనైజేషన్ ప్రయత్నాలకు భారత్ లోని ఉత్పత్తి కేంద్రం అండగా నిలువ నుంది. భారత్ లగ్జెంబర్గ్ ల మధ్య  2020 నవంబర్  19న జరిగిన వర్చువల్    ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఈ పురోగతి చోటు చేసుకుంది. 

 

 


2022-01-12  Business Desk