@ursvamsishekhar/Twitter
నటరత్న నందమూరి తారక రామారావు సినీ కెరియర్లోనే దానవీరశూర కర్ణ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాలోని ప్రత్యేకతలేమిటంటే ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో జీవించారని చెప్పాలి. కృష్ణుడిగా..దుర్యోధనుడిగా..కర్ణుడిగా నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. అప్పట్లో ఆ చిత్రంలోని డైలాగుల క్యాసెట్లు కూడా ఉండేవి. అవి ప్రతి ఇంట్లోనూ ఉండేవి. కొండ వీటి వెంకటకవి రాసిన మాటలు తూటాల్లా పేలాయి. అంత చక్కటి మాటలను ఆయన అందించారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకనిర్మాతగా వహించడం గమనార్హం. పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ మరోమారు ఈ చిత్రంతో రుజువయింది.
1977 సంవత్సరంలో విడులైన ఈ పౌరాణిక చిత్రం ఎన్నో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించడంతో పాటు ఈ సినిమాలో కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. ఇక ఈ సినిమా నిడివి మొత్తం 4 గంటల 17 నిముషాలు. ఈ 4 గంటల 17 నిమిషాల్లో దాదాపు నాలుగు గంటల పాటు ఎన్టీఆర్ స్క్రీన్ పైన ఉంటాడు. అది మాములు విషయం కాదు. సాధారణంగా ఒక సినిమా నిడివి ఎంత అంటే ఇప్పుడున్న వాళ్ళు టక్కున 2 గంటల 30 నిముషాలు అని చెప్పేస్తారు. దాదాపుగా ఇప్పుడున్నఅన్ని సినిమాలు 2.30 నిముషాలే నిడివి ఉంటుంది. ఏదో కొన్ని సినిమాలు మాత్రం 3 గంటలు తీస్తున్నారు. దానికే ఇప్పుడు అబ్బో 3 గంటలా.. ఎవరు చూస్తారు అని అంటారు. ఇప్పుడు ఇలా కానీ పాతతరంలో అన్ని సినిమాలు దాదాపు మూడు గంటలు నిడివి ఉండేవి. ఇక నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు దాన వీర శూర కర్ణ సినిమా అయితే ఏకంగా 4 గంటల 17 నిముషాలు ఉంటుంది.
దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లో పూర్తి అయ్యింది. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంత వరకూ ఎవరూ చెరపని ఒక రికార్డ్ ఈ సినిమాకే సొంతం. ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో లాంగ్వేజస్ లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఏ సినిమాను కూడా 4 గంటల దాటి నిడివిలో తీయలేదు. అయితే రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ సినిమా 4 గంటల 24 నిముషాలు తీశారు కానీ ఆ తర్వాత మళ్ళీ 40 నిమిషాలు కట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన సినిమా మరొకటి లేదు. చూద్దాం మరి భవిష్యత్తులో అయినా ఈ రికార్డ్ బ్రేక్ చేసే సినిమా వస్తుందేమో.
కాగా ఎన్. టి రామా రావు తో పాటు ఈ సినిమాలో జయప్రభ, రాజనాల, ప్రభాకర్ రెడ్డి, హరి కృష్ణ, బాలకృష్ణ, శారధ, జె పి శర్మ, కైకాల సత్యనారాయణ, గుమ్మడి వెంకటేశ్వర రావు, చలపతి రావు, జగ్గ రావు, బి సరోజ దేవి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని ఎన్ టి రామా రావు తన స్వియ దర్శకత్వం లో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పెంద్యాల మగేశ్వరరావు సంగీతం అందించారు.