collapse
...
Home / జాతీయం / Omicron: ఒక్కరోజులో 122.. మొత్తం 358కి చేరిన కేసులు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | New...

Omicron: ఒక్కరోజులో 122.. మొత్తం 358కి చేరిన కేసులు

2021-12-24  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

omicron (2)
 

దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతుంతడడం ఆందోళన కలిగిస్తోంది.  దేశంలో ఒక్క రోజులోనే 122 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  కొత్త వేరియెంట్ ప్రవేసించాక ఇన్ని కేసులు నమోదవడం ఇదే ప్రధమం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 358 కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  

ఓమిక్రాన్ వేరియంట్‌లో మహారాష్ట్రలో అత్యధికంగా 88 కేసులు నమోదయ్యాయి, ఢిల్లీలో 67, తెలంగాణ 38, తమిళనాడు 34, కర్ణాటక 31, గుజరాత్‌లో 30, కేరళ 27, రాజస్థాన్ 22, హరియాణా 4, ఒడిషా 4, జమ్ము కశ్మీర్ 3, పశ్చిమ బెంగాల్ 3, ఆంధ్రప్రదేశ్ 2, ఉత్తర ప్రదేశ్ 2, చండీగఢ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.   ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తలు చేట్టారు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై కొన్ని రాష్ట్రాలు పరిమితులు విధించి ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి.   

దిల్లీ..  

ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు రద్దు చేశారు. ఢిల్లీలో  బార్లు మరియు రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో పనిచేస్తాయి.  వివాహ సంబంధిత సమావేశాల్లో గరిష్టంగా 200 మందిన మాత్రమే అనుమతిస్తారు.  సామాజిక, రాజకీయ, మత, సాంస్కృతిక సంబంధిత సమావేశాలపై నిషేధం విధించారు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని ఒక క్లబ్‌ను సీల్ చేశారు. రెస్టారెంట్‌లు, బార్‌లలో మొత్తం సామర్థ్యంలో 50శాతం కంటే ఎక్కువ సమ్మేళనాలను నిషేధించాలన్న ఉత్తర్వులను క్లబ్ ఉల్లంఘించింది.  

మహారాష్ట్ర..  

ఓమిక్రాన్ వ్యాప్తిని నిరోధించడానికి మహారాష్ట్ర కొత్త ఆంక్షలు విధించింది. కోవిడ్ -19 కేసులతో పాటు ఒమిక్రాన్రేసులు  పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని నివారించడానికి రాష్ట్రంలో శుక్రారం నుంచి తాజా ఆంక్షలు విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది.   ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఉన్నతాధొకారులతో చర్చలు జరిపారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, వివాహాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో పార్టీల సమయంలో రద్దీని నివారించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఫంక్షన్ హాళ్ళు, క్లబ్ లు, రెస్టారెంట్లు సగం కెపాసిటికి మాత్రమే పరిమితం చేయాలని ఆంక్షలు విధించారు.  200 కి మించి అతిధులు హాజరయ్యే ఫంక్షనల్లకు ముందుగా అనుమతి తీసుకోవాలని ముంబై కార్పోరేషన్ అధికారులు సూచించారు. తమ సిబ్బంది ఆయా ఫంక్షన్లకు వెళ్ళి నిబంధనలు పాటిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేస్తారని చెప్పారు.  
 

గోవాలో..  

పర్యాటకానికి ప్రముఖ ప్రదేశం అయినందున రాష్ట్రంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించేందుకు గోవా కోవిడ్ టాస్క్‌ఫోర్స్ తో సమావేశం కానున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. రెస్టారెంటు, బార్లు లో పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజా సమూహాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను పరిమితంగా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ణప్తి చేసింది.  

ఉత్తరప్రదేశ్  

ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 25 నుండి రాత్రి కర్ఫ్యూ విధించారు.  వివాహాలకు 200 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. వచ్చే యేడాదిలో ఎన్నికలు జరగనున్నందున రాజకీయ సమావేశాలు సభలు, ప్రచార కార్యక్రమాల్లో పరిమిత సంఖ్యలో జనాలు గుమికూడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.    

మధ్యప్రదేశ్  

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచే రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించింది.    

ఆంధ్రప్రదేశ్   

రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి జిల్లాలో  నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. మాస్క్ విధిగా ధరించాలని సూచించింది.  షాపింగ్ మాల్స్, జనసమ్మర్ధం గల ప్రాంతాలలో మాస్క్ లేని వారిపై జరిమానాలు విధిస్తోంది. దుకాణాలలో కూడా మాస్క్ లేనివారిపై జరిమానాలు విధించాలని ఆదేసించింది.     

కేంద్రం సూచనలు  

పండుగల సీజన్‌కు ముందు స్థానికంగా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కేసుల సానుకూలత, రెట్టింపు రేటు, జిల్లాల్లో కొత్త కేసుల సమూహాలను పర్యవేక్షించాలని సూచించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీప భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలలో "వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని  పెంచాలని ఆదేశించింది.  ముఖ్యంగా "తక్కువ కవరేజీ ఉన్న జిల్లాలలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధించాలని సూచించింది.  పండుగల సీజన్‌కు ముందు స్థానికంగా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా పరికరాలు అమర్చి పూర్తిగా పనిచేసేలా రాష్ట్రాలు చూసుకోవాని సూచించింది. టెలి-మెడిసిన్, టెలి-కన్సల్టేషన్ కోసం ఐటి సాధనాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కూడాచెప్పింది.    

నిపుణులు ఏమంటున్నారు..  

వైద్య నిపుణులు, ప్రజారోగ్య నిపుణులు, ఒమిక్రాన్ తరచూ అసాధారణరీతిలో ఎక్కువ ఉత్పరివర్తనాలను చూపుతుందనే విషయం గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  ఇది వైవిధ్యమైన వేరియంట్ కావడంతో  రోగనిరోధక వ్యవస్థ ను దెబ్బతీస్తుందని  అన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా ఒక్కోసారి దాని ప్రభావం వైరస్ ముందు నిలబడకపొవచ్చని  ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయంటున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ముఖ్యమన సూచిస్తున్నారు.  
 2021-12-24  News Desk