collapse
...
Home / జాతీయం / OMICRON: చివరి అవతారం ఇదేనా...ఇంకా ఉన్నాయా ? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for T...

OMICRON: చివరి అవతారం ఇదేనా...ఇంకా ఉన్నాయా ?

2021-12-24  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Omicron-1
 

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూడకముందు యావత్ ప్రపంచం తిరిగి కార్యకలాపాల్లో మునిగిపోతుందని అంతా అనుకుంటున్న తరుణంలో మళ్లీ నిరాశలు అలుముకున్నాయి. కొత్త వేరియంట్ కు విపరీతమైన వ్యాప్తి లక్షణం కలిగి ఉండడం, ఏ వ్యాక్సిన్ దానికి పని చేస్తుంది, అసలు దాని కట్టడిలో టీకా పవరెంత?, లేకపోతే కొత్త టీకా కనుగొనాల్సిన అగత్యం ఏర్పడుతుందా..? ఉన్న వాటిలో ఏదో ఒకదానితో అది కట్టడి అవుతుందా? ఇవన్నీ అందరి మదిలో మెదిలిన ప్రశ్నలు.   

ఒమిక్రాన్ సోకినా ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఉండదని, సాధారణ చికిత్సతో తగ్గిపోతుందని అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. అది కొంచెం ఊరటనిచ్చే వార్తగా ప్రపంచానికి చేరింది.  ఏదిఏమైనా కొత్త వేరియంట్ రూపంలో ఇప్పుడు ఒమిక్రాన్ ప్రపంచానికి సవాళ్లు విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్, దాని లక్షణాలు, వేరియంట్ ను ఎదుర్కోవడానికి కొత్త వ్యాక్సిన్లు ఏమైనా కనుగొనాల్సి వస్తుందా? లేకపోతే ప్రస్తుతమున్న టీకాలతో దేనినైనా బూస్టర్ డోసుగా వాడితే సరిపోతుందా అన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. దేని నుంచి ప్రజలకు అత్యుత్తమైన రక్షణ లభిస్తుందని శాస్ర్తవేత్తలు లెక్కలుగడుతున్నారు.   

కొవిడ్ వేరియంట్లలో ఒకటైన ఒమిక్రాన్ అంతంతో కరోనా వైరస్ అంతమవుతుందా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు ఉద్భవిస్తోంది. రానున్నకొన్ని మాసాల్లో ఒమిక్రాన్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి అన్నదానిపై కూడా క్లారిటీ రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు, పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ర్టేషన్ మాజీ కమిషనర్ డాక్టర్ స్కాట్ గొట్టిలెబ్  దీని గురించి వివరించారు. ‘ఒమిక్రాన్ ను దేశం ఎదుర్కొనాల్సిందే, అది తాత్కాలిక ఘటన మాత్రమే.. త్వరాత అంతా సర్వసాధారణమవుతుంది’ అన్నారు. ‘నా అభిప్రాయంలో కొవిడ్ తోనే  ప్రజలు విసిగివేసారిపోయారు. కొవిడ్ వ్యాప్తిని తట్టుకుంటూనే రోజువారీ పనుల్లో తిరిగి చేరిపోతున్నారు.. దాంతో కలిసి జీవిస్తున్నారు’ అని పేర్కొన్నారు. శుక్రవారంనాడు ఫైజర్ ఎగ్జిక్యూటివ్ మేజర్ తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. 2024 వరకు కొవిడ్ వివిధ రూపాలుగా పరివర్తనం చెందుతూనే ఉంటుందన్నారు.  ఫైజర్ కే చెందిన చీఫ్ సైంటిఫిక్ అధికారి మికాయిల్ డోల్ స్టెన్ మాట్లాడుతూ... కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, కొంత మేరకు ప్రభావం చూపుతుంటాయన్నారు.   

దక్షిణాఫ్రికాలో తేలిందేమిటీ..?  

ఒమిక్రాన్ రోగులకు 80శాతం అస్పత్రి పాలయ్యే ప్రమాదం ఉండదని సౌతాఫ్రికా నిపుణులు ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. డెల్టా వేరియంట్ తో పోల్చితే 30శాతం తీవ్రత తక్కువేనని పేర్కొంది. ఒమిక్రాన్ రోగులకు ప్రాణాలకు ముప్పు కూడా పొంచివుండదని తెలిపారు.   

స్కాటిష్ శాస్ర్తవేత్తలు ఏమంటున్నారు..?  

స్కాట్లాండ్ కు చెందిన ఎడిన్ బర్గ్ శాస్ర్తవేత్త అధ్యయనం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో 60శాతం రోగులకు అస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని, డెల్టాతో పోల్చి చూస్తే ఇది చాల తక్కువ ప్రభావం చూపిస్తుందని తేల్చారు. టీకా తీసుకున్న ప్రజలు ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండగలుగుతున్నారని స్కాటిష్ శాస్ర్తవేత్తల అధ్యయనంతేల్చింది.   

లండన్ ఇంపీరియల్ కాలేజీ అధ్యయనం ఏం చెబుతోంది..?  

డిసెంబర్ 22న లండన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీ ఒమిక్రాన్ పై జరిపిన ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. ఒమిక్రాన్ సోకిన వారిలో 15 నుంచి 20 శాతం మంది వరకే ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ రూమ్ లను ఆశ్రయించాల్సి వస్తుందని, మిగతా వారికి పెద్దగా ప్రమాదం లేదని పరిశోధనకు నాయకత్వం వహించిన నీల్ ఫెర్గూసన్ పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ తో పోల్చితే 40శాతం మందిలో ఒమిక్రాన్ తీవ్ర లక్షణాలు ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఉండదని తెలిపారు.   

హాంకాంగ్ అధ్యయనం తేల్చిందేమిటీ..?  

హాంగ్ కాంగ్ వైద్య నిపుణుల చెప్పనదానికి ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ కు 70శాతం అధికంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నట్లు తేల్చారు. డెల్టాతో పోల్చితే ఇది ప్రమాదకారి అని పేర్కొన్నారు. గత వేరియంట్లతో సరిపోల్చితే దీనికి మానవుల ఊపిరితిత్తులను కొంత ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఒమిక్రాన్ ప్రపంచంలో మరిన్ని వేరియంట్లుకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. 2007లో ఏవియన్ ఫ్లూ మరియు మెర్స్ ను కనుగొన్న విధానాన్నే ఒమిక్రాన్ వేరియంట్ ను విశ్లేషించడంలో వర్తింప చేసినట్లు వివరించారు. సార్స్ కోవ్-2 వేరియంట్ల తీవ్రతను కూడా తద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.   

 



2021-12-24  News Desk