collapse
...
Home / వినోదం / ఓటిటి / O.T.T Documentary:నీరజ్ పాండే క్రికెట్ డాక్యుమెంటరీ ట్రైలర్‌కు విశేష స్పందన - 6TV News : Telugu in News | Telugu News |...

O.T.T Documentary:నీరజ్ పాండే క్రికెట్ డాక్యుమెంటరీ ట్రైలర్‌కు విశేష స్పందన

2022-06-03  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Bandon Mai Tha Dum  
 

క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమాలకు మన దేశంలో మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమయింది. మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా దర్శకుడు నీరజ్ పాండే రూపొందిన ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ పేరుతో వచ్చిన సినిమాను మన దేశంలో పాటు పలు దేశాల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కాసుల వర్షం కురిపించారు. తాజాగా అదే దర్శకుడు మరోసారి క్రికెట్ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందిస్తున్నాడు. వూట్ ఓటీటీ ద్వారా ఈ డాక్యుమెంటరీ విడుదల కానుంది. బందో మే థా దమ్ పేరిట రూపొందిన ఆ సినిమా ట్రైలర్‌ ప్రస్తుతం విడుదలయింది. జూన్ 16 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది.

రెండో ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులు   

భారత క్రికెట్ జట్టు 2020లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. టెస్టు మ్యాచుల్లో దారుణంగా విఫలమయింది. ఒక మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులు చేసి టీమిండియా ఆలౌటయింది. ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఆ స్థితి నుంచి వెంటనే తేరుకుంది. పట్టుదలతో ఆడింది. మెరుగైన ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పించింది. తద్వారా విమర్శకుల నోళ్లు మూయించింది. ఆస్ట్రేలియా జట్టుపై తిరుగులేని విజయం సొంతం చేసుకుంది.    2-1 తేడా టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సంఘటనల ఆధారంగా నీరజ్ పాండే స్ర్కిప్ట్ సిద్ధం చేసుకుని..డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. బందోంమే థా దమ్‌ అనే పేరుతో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆ డాక్యుమెంటరీకి చెందిన ట్రైలర్ విడుదలయింది. విశేషంగా ఆకట్టుకుంటోంది. మాజీ క్రికెటర్లు ఈ ట్రైలర్‌ను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ నాటి రోజులను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఆకాశ్ చోప్రావీవీఎస్ లక్ష్మణ్ వంటి మాజీ క్రికెటర్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

కష్టాలను ఎదిరించి..   

టెస్టు సిరీస్‌కై అక్కడను వెళ్లిన భారత జట్టుకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. సీనియర్ ప్లేయర్లు గాయాలపాలయ్యారు. బుమ్రా, షమీ వంటి బౌలర్లు గాయాల కారణంగా ఆ టెస్టులో ఆడలేకపోయారు. 3 మ్యాచుల ఆ టెస్టు సిరీస్‌ భారత జట్టుకు సవాలుగా మారింది. భారత టెస్టు జట్టు సారధి విరాట్ కోహ్లీ ఆ సమయంలో తన భార్య ప్రసవం కారణంగా మధ్యలోనే ఇండియా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ భారత జట్టుకు సారధిగా నిలిచాడు. జట్టును విజయ పథంలో నడిపించాడు. 

సిడ్నీ టెస్టు మ్యాచ్‌   

సిడ్నీ టెస్టు మ్యాచ్‌‌లో అద్భుతం జరిగింది. హనుమ విహారిరవిచంద్రన్ అశ్విన్‌లు అద్భుతంగా ఆడారు. విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఓడిపోతాదని అందరూ అనుకున్న మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకుంది. 

గబ్బా మ్యాచ్‌   

గబ్యా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్శార్ధుల్ ఠాకుర్‌లు విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. సీనియర్లు లేని బౌలింగ్‌ విభాగం ఆ రోజు మ్యాచ్‌లో అంచనాలకు మించి   రాణించింది. ఆసీస్ జట్టుకు చుక్కలు చూపించింది. 

చివరి టెస్టు మ్యాచ్‌లో ఏం జరిగిందంటే...   

నాల్గవది, చివరిది అయిన టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ ఇరగదీశాడు. అంచనాలకు మించి ఆడాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా టెస్టు సిరీస్‌ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.

నీరజ్ పాండే ట్వీట్లు   

ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకడు నీరజ్ పాండే కొన్ని అద్భుతమైన వాక్యాలను ట్వీట్ చేశాడు. పరిస్థితులన్నీ తమకు ప్రతికూలంగా మారిన సందర్భంలో టీమిండియా జట్టు సభ్యులు తమ సత్తా చాటారు. పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డారు. అకుంఠిత దీక్షతో ఆడి విజయం సాధించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ మేలు మలుపు వంటి ఈ సంఘటనలను తెరపై చూడండి అంటూ దర్శకుడు ట్వీట్ చేశాడు. 

 2022-06-03  Entertainment Desk