collapse
...
Home / వినోదం / ఇంగ్లీషు / O.T.T Movie trailer review: ఉన్మాదపు కామెడీ.. ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో' - 6TV News : Telugu in News | Telugu News | Lates...

O.T.T Movie trailer review: ఉన్మాదపు కామెడీ.. ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో'

2022-06-04  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Man from Toronto
 

హాలీవుడ్‌లో బడ్డీ కామెడీ డ్రామాలకి మంచి క్రేజ్ ఉంటుంది. ఇద్దరు అబ్బాయిల మధ్య స్నేహంప్రేమఅపార్థాలు వంటి అంశాలతో తెరకెక్కే ఇలాంటి సినిమాలు తరచుగా వస్తుంటాయి. ఈ జానర్‌లో తాజాగా వస్తున్న మరో బడ్డీ యాక్షన్ కామెడీ ఫిలిం 'ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో'. ది హిట్ మ్యాన్ బాడీ గార్డ్హిట్‌ మ్యాన్ వైఫ్ బాడీగార్డ్ ,ఎక్స్ పెండబుల్స్ వంటి ఉన్మాదపు యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయినా పాట్రిక్ హ్యూస్ దర్శకత్వంలో.. కెవిన్ హార్ట్, వుడీ హారెల్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ది మ్యాన్ ఫ్రమ్ టొరంటోట్రైలర్ తాజాగా నెట్ ఫ్లిక్స్ విడుదలై దుమ్ములేపుతుంది. జూన్ 24న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు.. కిల్లర్ కామెడీ మూవీ ఫాన్స్ కోసం అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. 

మార్కెటింగ్ ఏజెంట్ పాత్రలో హీరో 

ఈ సినిమాలో మార్కెటింగ్ ఏజెంట్ పాత్రలో హీరో కెవిన్ హార్ట్ నటించాడు. ప్రయాణికుల కోసం ఇల్లువస్తువులు వంటి అన్ని వసతులని అద్దెకిచ్చే AirBnb అనే సంస్థ తరుపున పనిచేసే కెవిన్ హార్ట్ పొరపాటున వేరే ఇంటికి వెళ్తాడు. అక్కడే హీరో హార్ట్‌కి.. హంతకుడు హారెల్‌సన్ పరిచయం అవుతాడు. ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో అని పిలవపడే హారెల్‌సన్‌ని.. హిట్ మ్యాన్ అనుకుని ఫ్రెండ్షిప్ చేస్తాడు కెవిన్ హార్ట్.   అయితే జరగబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించిన కెవిన్..   తానూ పొరపాటున ఒక హంతకుడి ఇంటికి వచ్చానని.. హారెల్‌సన్ తనని   హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నట్టు గ్రహిస్తాడు. హత్య చేసింది తానే అని పోలీసులు నమ్మేలా.. కెవిన్ హార్ట్‌కి హారెల్‌సన్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాడు. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే తీవ్ర ఉన్మాదంగా ఉంటాయి. దాంతో ఎలాగైనా హారెల్‌సన్ బారి నుండి కెవిన్ హార్ట్   తప్పించుకోవాలని చూడటంఇరుక్కోవటం జరుగుతూ ఉంటుంది. 

ఇంటలిజెన్స్ ఏజెన్సీ నుండి ఆదేశాలు 

అయితే నిజమైన హంతకుడిని పట్టుకోవడానికి హారెల్‌సన్ దగ్గరే ఉండాలని కెవిన్‌కి ఇంటలిజెన్స్ నుండి కూడా ఆదేశాలు రావటంతో చేసేదేమి లేక.. హారెల్‌సన్ ఉన్మాదపు చర్యలకు బలవుతుంటాడు కెవిన్ హార్ట్. మరి ఈ మూవీలో నిజమైన హంతకుడు ఎవరు.. అసలు మ్యాన్ ఫ్రమ్ టొరంటో ఎక్కడున్నాడు.. హారెల్‌సన్ బారి నుండి కెవిన్ హార్ట్ ఎలా తప్పించుకున్నాడన్నదే.. 'ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో అసలు కథ. ఇక ఈ యాక్షన్ కామెడీలో కాలే క్యూకోజాస్మిన్ మాథ్యూస్లేలా లోరెన్పియర్సన్ ఫోడేజెన్‌కార్లోస్ కానెలా వంటి స్టార్స్ నటించగా.. రాబీ ఫాక్స్ మరియు క్రిస్ బ్రెమ్నర్ కథని అందించారు. టాడ్ బ్లాక్జాసన్ బ్లూమెంటల్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా అందుబాటులోకి రానుంది. 



2022-06-04  Entertainment Desk