collapse
...
Home / వినోదం / ఇంగ్లీషు / O.T.T Update: దూసుకుపోతున్న గ్రే మ్యాన్ ట్రైలర్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News fo...

O.T.T Update: దూసుకుపోతున్న గ్రే మ్యాన్ ట్రైలర్

2022-05-26  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Gray man PIC

 వేసవి సెలవులకి మరింత హీటెక్కించేలా ప్రతిష్టాత్మక నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ మరో ప్రెస్టీజియస్ మూవీని రిలీజ్ చేయనుంది. ఎవెంజర్స్   ఇన్ఫినిటీ వార్ఎవెంజర్స్ ఎండ్‌  గేమ్ వంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్స్ ని తెరకెక్కించిన రస్సో బ్రదర్స్ నుండి వస్తున్న  మరో యాక్షన్-థ్రిల్లర్ 'ది గ్రే మెన్'. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ 'ది గ్రే మెన్మూవీ అఫీషియల్ ట్రైలర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై దూసుకెళుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్   'ది గ్రే మెన్'లో నటిస్తుండటంతో ఇండియాలో కూడా భారీ హైప్ వచ్చింది. అయితే ఈ అంచనాలని అందుకోవడంలో 'ది గ్రే మెన్ట్రైలర్ సక్సెస్ అయ్యింది. 'ది గ్రే మెన్పేరుతోనే  2009  లో విడుదలైన మార్క్ గ్రీనీ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.   

ట్రైలర్ అదరహో

సియెర్రా సిక్స్ అనే కోడ్‌నేమ్‌ని ఛేదించి.. తన ఏజెన్సీకి సంబంధించిన నేరపూరిత రహస్యాలను కనిపెట్టడంతో హీరో జెంట్రీని చంపాలనుకుంటుంది సీక్రెట్ ఏజెన్సీ. దీంతో వారి నుండి తప్పించుకుని తిరుగుతున్న బ్లాక్ ఆప్స్ ఏజెంట్  హీరో జెంట్రీని చంపడానికి లాయిడ్ అనే మరో వ్యక్తిని పంపిస్తారు. సియెర్రా సిక్స్ అనే నిషేదిత అక్రమాలకు పాల్పడే ఏజెన్సీని కాపాడడానికి  లాయిడ్ అనే కిరాయి సైనికుడు పనిచేస్తుంటాడు. దీంతో హీరో జెంట్రీవిలన్ లాయిడ్ మధ్య టామ్ అండ్ జెర్రీ వలే జరిగే భీకర యుద్ధమే ది గ్రే మెన్ చిత్ర కథాంశం. నష్టం కలిగించే సియెర్రా సిక్స్ అనే కోడ్‌నేమ్‌ని తొలగించాలని.. ప్రాణాల కోసం పోరాడుతున్న హీరో కోర్ట్ జెంట్రీ పాత్రలో ర్యాన్ గోస్లింగ్ నటించగా.. జెంట్రీని చంపాలనుకునే కిరాయి హంతకుడు లాయిడ్ హాన్సెన్ పాత్రలో క్రిస్ ఎవాన్స్ కనిపిస్తాడు. వీరిద్దరూ ఒకప్పుడు సహ ఉద్యోగులు కూడా. కానీ వీరిద్దరూ ఒకర్నొకరు ఎందుకు విభేదించుకుంటారో అన్న అంశాన్ని ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్ లో చూపించారు. 

Dhanush OTT Movie
భారీ తారాగణం

ఇక CIA వంటి అంతర్జాతీయ ఇన్విస్టిగేషన్ సంస్థలు హీరో జెంట్రీని ఎందుకు ట్రాప్ చేసి చంపాలనుకున్నది కూడా ప్రధాన కథాంశం. అయితే స్క్రీన్ టైమ్‌లో ఎక్కువ భాగం వీరిద్దరికి కేటాయించినా భారీ తారాగణం కూడా ఇందులో ఉంది. ముఖ్యంగా ఇండియా నుండి హీరో ధనుష్ కూడా ఈ మూవీలో ఉంటాడు. అయితే ట్రైలర్ లో మాత్రం ఒక్కటంటే ఒక్క సెకండ్ మాత్రమే ధనుష్ కనిపిస్తాడు. ఇది ధనుష్ ఫ్యాన్స్ కి కాస్త నిరుత్సాహం కలిగించినా.. అంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్ నటించటం చాలా గ్రేట్. సియెర్రా సిక్స్‌  ని తొలగించే బాధ్యతను అప్పగించే ఏజెన్సీ బాస్‌గా బ్రిడ్జర్టన్ అలుమ్ రెజ్-జీన్ పేజ్ నటిస్తే.. అనా డి అర్మాస్ ఏజెంట్ డానిగా నటించాడు. ఇక 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్నుండి బిల్లీ బాబ్ థోర్న్‌టన్ఆల్ఫ్రే వుడార్డ్నార్కోస్ స్టార్ వాగ్నర్ మౌరా మరియు జూలియా బటర్స్ వంటి స్టార్స్ 'ది గ్రే మెన్'లో నటించారు. 2022-05-26  Entertainment Desk