collapse
...
Home / వినోదం / ఓటిటి / O.T.T Updates: అలియా భట్‌ డిజిటల్ ఎంట్రీ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telug...

O.T.T Updates: అలియా భట్‌ డిజిటల్ ఎంట్రీ

2022-05-26  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

  Alia bhatt OTT Movie

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌   ప్రస్తుతం బిజీగా ఉంది. పెళ్లి అనంతరం కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.   గంగూభాయ్ కథియావాడీఆర్‌ఆర్‌ఆర్‌   వంటి సక్సెస్‌ ఫుల్‌ మూవీస్‌ తర్వాత ఆమె చేసే ప్రాజెక్ట్స్‌ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలియా తన హాలీవుడ్‌ డెబ్యూ మూవీ హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఎట్టకేలకు ఆమె నటించిన డార్లింగ్స్‌ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. 

  alia bhatt

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్   

కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. త్వరలోనే విడుదల తేదీస్ట్రీమింగ్‌ టైంను వెల్లడిస్తామని పేర్కొన్నారు. 

Shefali Shah  
 కాగా ప్రముఖ రైటర్‌ జష్మీత్‌ కీ రీన్‌ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆలియా లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా.. నటి షెఫాలీ షావిజయ్‌ వర్మ, రోషల్‌ మాథ్యూలు కీ రోల్‌ పోషిస్తున్నారు. కామెడీసస్సెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని బాలీవుడ్‌ బాద్‌ షారుఖ్‌ ఖాన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్‌చీల్లి ఎంటర్‌టైన్మెంట్‌లో తెరకెక్కించాడు.



2022-05-26  Entertainment Desk