collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / PAN - AADHAAR: రూ.20 లక్షలు దాటితే తప్పనిసరి.. ఎందుకంటే? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News...

PAN - AADHAAR: రూ.20 లక్షలు దాటితే తప్పనిసరి.. ఎందుకంటే?

2022-05-14  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Bank

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సరికొత్త నిబంధన తీసుకొచ్చింది.  బ్యాంక్‌లో 20 ల‌క్ష‌లు, ఆపైన డిపాజిట్ చేసినా,  విత్‌డ్రా చేసినా ఆధార్ లేదంటే పాన్ కార్డు నెంబ‌ర్‌ చెప్పాలని వెల్లడించింది. ఒక ఏడాది కాలంలో 20 ల‌క్ష‌లకు మించి లావాదేవీలు జ‌రిగే అకౌంట్ల‌కు పాన్, ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ విషయానికి  సంబంధించి సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకులతో పాటు పోస్టాఫీసులలోనూ క‌రెంట్ అకౌంట్ లేదంటే క్యాష్ క్రెడిట్ అకౌంట్‌ను ఓపెన్ చేసినా..  పాన్,  ఆధార్ నెంబర్ ను తప్పకుం డా వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు 2022 మే 26 నుంచి  అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  

*ఆధార్, పాన్ నెంబర్ తప్పనిసరి  
ఇప్పటి వరకు ఆయా లావాదేవీలకు సంబంధించి వ్యక్తికి పాన్ నెంబర్ ఉందా? లేదా? అనే విషయం మాత్రమే బ్యాంకు అధికారులు చూసే వారు. తాజా నిబంధనలతో ఇకపై  బ్యాంకు రికార్డుల్లో ఆ పాన్‌ లేదంటే ఆధార్ నెంబర్ ను బ్యాంకు అధికారులు మెన్షన్ చేయాలని కేంద్రం ఆదేశించింది.  అంతేకాదు.. ఆదాయ పన్ను శాఖకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను చెప్పాల్సి ఉంటుందని వెల్లడించింది. ఎవరైనా పెద్ద మొత్తంలో  లావాదేవీలు చేయాలి అనుకున్నప్పుడు సదరు వ్యక్తులు పాన్‌ లేదంటే ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ మోతాదులో  లావాదేవీలు నిర్వహిస్తూ కూడా పాన్‌ లేని వ్యక్తులను, పన్ను పరిధిలోకి తీసుకొచ్చే లక్ష్యంతోనే ఈ నిబంధన అమలు చేస్తున్నట్లు కేంద్ర తెలిపింది. ఈ నిర్ణయం మూలంగా పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా తప్పించుకునే వారిని కట్టడి చేసేందుకు వీలవుతుందని వెల్లడించింది.    

*పోస్టాఫీస్, సహకార సంఘాలకూ వర్తింపు  
ఈ కొత్త నిబంధనలు బ్యాంకులకు మాత్రమే కాకుండా పోస్టాఫీస్, సహకార సంఘాలకు కూడా వర్తిస్తాయని కేంద్రం వెల్లడించింది.  ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణిని అదుపు చేసి, నగదు డిపాజిట్, లేదంటే విత్ డ్రాను ట్రాక్ చేసే దిశగా కొత్త నిబంధనలు తీసుకు వచ్చినట్లు ఆర్థిక నిపుణులు  అభిప్రాయపడుతున్నారు.  పాన్ నెంబర్ లేదంటే ఆధార్‌ నంబర్ చెప్పడం మూలంగా  ఆయా ట్రాన్సాక్షన్స్‌కు టీడీఎస్ వర్తించినా లేకపోయినా..  అలాంటి వ్యక్తుల ఆర్థిక ట్రాన్సాక్షన్స్‌ను ఐటీ శాఖ ట్రాక్ చేసే వెసులుబాటు ఉంటుంది. రూల్ 114బీ ప్రకారం ఇప్పటికి ఒక రోజులో రూ.50,000కు మించి నగదును డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరి. కానీ ఇప్పటి వరకు వార్షిక పరిమితి లేదు. ఇప్పుడు ఈ వార్షిక పరిమితిని విధించింది కేంద్ర ప్రభుత్వం.

*పన్ను ఎగవేతకు అడ్డుకట్ట  
ఆర్థిక లావాదేవీలు జరుపుతూ పన్నులను ఎగవేసే వారిని కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నమోదీ సర్కారు.. గతంలో లేని విధంగా వార్షిక పరిమితిని తీసుకొచ్చింది. ఆర్థిక అవక తవకలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే కఠిన నిర్ణయాలను తీసుకుంటుంది. ఎలాంటి లూప్ హోల్ లేకుండా జాగ్రత్త పడుతుంది. పన్ను ఎగవేత ప్రయత్నాలను పూర్తి స్థాయిలు అడ్డుకునేలా చర్యలు తీసుకుంటుంది.



2022-05-14  News Desk