collapse
...
Home / జాతీయం / parliament: పది బిల్లులకు ఆమోదం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News...

parliament: పది బిల్లులకు ఆమోదం

2021-12-22  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Parliament_of_India
పార్లమెంటు ఉభయ సభలలో శీతాకాల సమావేశాలు జరిగిన తీరు ఆందోళన కలిగించేదిగానే ఉంది. రెండు సభలలోనూ కేవలం 48 గంటల పాటు వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. మొత్తం మీద బుధవారం ముగిసిన సమావేశాల కాలంలో 10 బిల్లులు ఆమోదం పొందాయి. లోక్ సభ పరిశీలకు ప్రభుత్వం 12 కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిలో 10 బిల్లులకు సభ ఆమోదం లభించింది. వీటిలో రెండు బిల్లులు గత సమావేశ కాలం నాటివి కావడం గమనార్హం.  

అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుత సమావేశ కాలంలో పరిశీలించిన అంశాలు, తదితర వివరాలు ఇలా ఉన్నాయి. 

లోక్ సభ – మొత్తం 26.5 గంటల పాటు మాత్రమే సభ సజావుగా సాగింది. వాస్తవానికి ఈ సమావేశాల కాలంలో 83.2 గంటల సమయం చర్చలకు కేటాయించారు. సభా కార్యక్రమాలలో సుమారు 37 గంటల పాటు చట్ట సంబంధం లేని అంశాల మీదే గడిచిపోయింది. 

రాజ్య సభ – చర్చకు కేటాయించిన 45.4 గంటల వ్యవధిలో కేవలం 21.7 గంటల సమయాన్ని మాత్రమే చట్ట సంబంధమైన అంశాలను చర్చించగలిగింది.  

పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లులను పరిశీలిస్తే, వాటిని ఆమెదించడానికి ముందు ఎంత స్వల్పస్థాయిలో చర్చ జరిగిందో తెలుస్తుంది. దాదాపు గతత ఏడాది మొత్తం ఢిల్లీని, పరిసర రాష్ట్రాలను అతలాకుతం చేసిన  రైతుల ఆందోళనతోనే గడిచిపోయింది. సుదీర్ఘమైన పోరాటం తరువాత ప్రభుత్వం వివాదాస్పదంగా మారిన మూడు బిల్లులను వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించిన చర్చ కేవలం రెండు నిముషాలలోనే లోక్ సభలోనూ, 8 నిముషాలలో రాజ్యసభలోనూ పూర్తయిందనిపించి ఆమోదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  

ఇక సాంకేతిక అంశాలు ఎక్కువగా ఉన్న అసిస్టెడ్ టెక్నికల్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లుపై మాత్రం లోక్ సభలో దాదాపు 4 గంటల పాటు చర్చ జరిగింది. 18 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇదే అంశం రాజ్య సభలో కేవలం 77 నిముషాల పాటు చర్చ జరిగింది. 14 మంది సభ్యులు పాల్గొన్నారు.  ఈ బిల్లు గర్భస్థ పిండ పరీక్షలను నిర్వహించే సాంకేతిక అంశాలకు సంబంధించినది. సుప్రీం కోర్టు, హైకోర్చు న్యాయమూర్తుల వేతనాలకు సంబంధించిన బిల్లుపై లోక్ సభలో 27 మంది ఎంపీలు ఏకంగా 9 గంటలకన్నా ఎక్కువసేపు చర్చించారు. అదే రాజ్యసభలో దీనిపై 17 మంది సభ్యులు మాట్లాడారు. ఇలా హెచ్చు సమయం పాటు చర్చించిన వాటిలో డామ్ సేఫ్టీ బిల్లు, 2019 రెండోది. దీనిపై 4 గంటల పాటు గత సెషన్ లో లోక్ సభ (31 మంది) చర్చించి ఆమోదించింది. రాజ్యసభలో ప్రస్తుత సమావేశాల కాలంలో ఏకంగా 9 గంటల పాటు (22  మంది) చర్చించారు.  

అత్యంత కీలకమైన ఎన్నికల సంస్కరణల బిల్లుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ, లోక్ సభ మాత్రం గంటన్నరలోనే ఆమోదించింది. ఇందులో వివాదాస్పదమైన ఆధార్-ఓటర్ కార్డు లింక్ అంశంపై కేవలం 26 నిముషాలు చర్చించారు. ఇతర బిల్లులు – నార్కొటిక్ డ్రగ్స్ అం సైకోట్రాపిక్ సబ్ స్టెన్స్ బిల్లు (రాష్ట్రపతి ఆమోదమే తరువాయి), ఢిల్లీ స్పెషల్ పోలీస ఎస్టాబ్లిష్ మెంట్ సవరణ బిల్లు (ఇదివరకే రాష్ట్రపతి ఆమోదించారు.), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సరణ బిల్లు (ఇదివరకే రాష్ట్రపతి ఆమోదం పొందింది), సరొగెన్సీ రెగ్యులేషన్ బిల్లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సవరణ బిల్లు (రాష్ట్రపతి ఆమోదం పొందినదే). 

స్టాండింగ్ కమిటీ పరిశీలకు చేరిన బిల్లులు – చిన్నారుల వివాహం నిషేధ సవరణ బిల్లు, మధ్యవర్తిత్వ సంబంధిత బిల్లు, చార్టెర్డ్ ఆకౌంటెంట్స్, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రెటరీల సవరణ బిల్లు, బయోలాజికల్ డైవర్సిటీ సవరణ బిల్లు.   


 



2021-12-22  News Desk