పీసీఓఎస్ తో బాధపడుతున్నవారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్య కరమైన ఆహారం మన శరీరాన్ని ప్రభావితం చేయడంలో సహాయపడుతుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమో (పీసీఓఎస్) అనేది మహిళలకు చాలా సాధారణమైన రుగ్మతగా మారుతోంది. ఇది ఇండియాలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి సంతానోత్పత్తికి సమస్యకు దారి తీస్తుంది. అయితే పీసీఓఎస్ ఉన్న మహిళలు చాలా మంది బరువు పెరగడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుత కాలంలో ఎలాంటి చికిత్స లేకుండా, పరిస్థితిని నియంత్రించడానికి నిపుణుల సిఫార్సులు పాటిస్తూ...జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్లయితే బరవు తగ్గడం సులభం అవుతుంది. ఈ సమస్య ఉన్న మహిళలు...ఇతర మహిళల వలే బరువు తగ్గడం చాలా కష్టం. పీసీఓఎస్ తో బాధపడుతున్న మహిళలలో పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, హార్మోన్ల హెచ్చు తగ్గదల వల్ల బరువు పెరగడం ప్రధాన సమస్య.
పీసీఓఎస్ ఉన్నప్పుడు బరువు తగ్గడం అంత సులభం కాదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. హార్మోన్ కార్యకలాపాలు, జీవక్రియ, ఇన్సులిన్ నిరోధకత, అడ్రినల్ లోపం, బీఎంఐ స్థాయిలను పెంచుతాయి. పీసీఓఎస్ తో బాధపడుతున్నప్పుడు ఆకస్మాత్తుగా బరువు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. వీటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు అనేకం. కానీ మీరు బరువును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే కొన్ని సత్వర మార్గాలు ఉన్నాయి. అవేంటో చూడండి.
1. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి.
పీసీఓఎస్ ఉన్న మహిళలు అధిక మొత్తం ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అధిక ఫైబర్ ఫుడ్ జీవక్రియకు సహాయపడుతుంది. హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తాయి. పండ్లు, కూరగాయల నుంచి అధిక ఫైబర్ తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
2. తగినంత ప్రొటీన్ తీసుకోవాలి.
అన్ని పోషకాలతో పాటుగా ప్రోటిన్ కూడా ఆహారంలో ఎక్కుమ మొత్తం ఉండేలా చూసుకోవాలి. మన శరీరానికి అధిక మోతాదులో ప్రొటిన్ అవసరం ఉంటుంది. బరువు తగ్గాలంటే ప్రొటిన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాదు కండరాల బలాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రొటీన్ ఆకలిని తగ్గించడానికి అవసరపడుతుంది.
3. తక్కువ ఫుడ్ తరచుగా తినడం మంచిది
పీసీఓఎస్ తో బాధపడుతున్నవారు ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఆహారం తీసుకునే బదులుగా నాణ్యమైన, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేస్తే బరువు తగ్గడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకునేలా చూసుకోవాలి.
4. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం
యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇన్సులిన్ స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
5. పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాలకు దూరం
ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ గోధుమ, ఫ్రూట్ జ్యూసులు, సోడా, ఐస్ క్రిం వీటిల్లో ఎక్కువ మొత్తంలో కార్బొహైడ్రెట్స్ఉంటాయి. వీటికి చాలా దూరంగా ఉండాలి. ఎందుకుంటే వీటిలో ప్రొటిన్స్ కంటేనూ కార్బొహైడ్రెట్స్ అధిక మొత్తంలో ఉండటంతో...బరువు పెరగడానికి దోహదపడతాయి. కార్పొహైడ్రెట్స్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే పీసీఓఎస్ ఉన్న మహిళల్లో ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. వీటితోపాటుగా మాంసం, బేకరీ ఫుడ్స్ ,రిఫైన్డ్ ఆయిల్ , నెయ్యి, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
6. పాల ఉత్పత్తులను తగ్గించుకోవడం
పీసీఓఎస్ తో బాధపడుతున్న మహిళల పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పాడి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. పీసీఓఎస్ ఉన్న మహిళలు తరచుగా వ్యాయామం చేసినట్లయితే శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇన్సులిన్ సెన్సిటివిటిని మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. రెగ్యులర్ గా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నట్లయితే హర్మోన్లు హెచ్చు తగ్గుదలలో మార్పులు కనిపిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం, లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.