collapse
...
Home / వినోదం / ఓటిటి / Recce Web Series: హత్యా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News...

Recce Web Series: హత్యా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌

2022-06-03  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Recce Poster
 

ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. డిజిటల్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను, వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. జీ 5 సంస్థ ఇటీవల కాలంలో జోరు పెంచింది. మంచి మంచి సినిమాలను కొనుగోలు చేస్తోంది. ప్రేక్షక దేవుళ్ల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. ఓటీటీ రేసులో ముందడుగులు వేస్తోంది. తనదైన శైలిలో దూసుకుపోతోంది. తాజాగా రెక్కీ అనే వెబ్‌సిరీస్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ విడుదల చేసింది.

పోలూరు కృష్ణ దర్శకత్వం 

సిల్వర్   స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీరామ్ కొలిశెట్టి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కి పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. 1990  లో తాడిపత్రిలో జరిగిన ఒక హత్య ఆధారంగా కథను రూపొందించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ వరదరాజులు దారుణంగా చంపబడతాడు. ఈ హత్య కేసును ఛేదించడానికి ఇన్ స్పెక్టర్ లెనిన్ రంగంలోకి దిగుతాడు. వరదరాజులు హత్య కేసును ఛేదించేందకు వచ్చిన అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి?  అతడి హత్యకు దారితీసిన‎‎సంఘటనలు ఏంటి? వరదరాజులుని చంపడానికి ప్రత్యర్ధులు ఎటువంటి ప్లాన్ వేశారు? ఆ ప్రాంతానికి కొత్తగా నియమింపబడిన ఆ పోలీసు అధికారి ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేధించాడనేది ఈ వెబ్‌సిరీస్    కథ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో .. గ్రామీణ ఫ్యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో ఎపిసోడ్స్ ఉన్నాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ కథను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించనట్లు మోషన్ పోస్టర్‌ చూస్తే అర్ధమౌతోంది. ఒక హత్య చేసేటప్పుడు ఎటువంటి ప్రణాళికలు రచిస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు? ఎటువంటి ఆయుధాలు వాడతారు? అనేవి చాలా స్పష్టంగా ఈ సిరీస్‌లో చూసే అవకాశం కలగనుంది. తాడిపత్రిలో జరిగే హత్యలు రాజకీయ హత్యలా? ఫ్యాక్షన్‌ హత్యలా? మరే ఇతర కారణాల వల్ల హత్యలు జరిగాయా అనేది సిరీస్‌ చూసి తెలుసుకోవలసిందే. 

విచారణ చేపడుతున్న సమయంలో పోలీసు అధికారికి అనేక చీకటి రహస్యాలు తెలుస్తాయి. ఈ రహస్యాలను తెలుసుకున్న తర్వాత ఆ అధికారి ఏం చేశాడు అనే అంశం తెలుసకోవాలంటే జూన్ 17 వరకు ఆగాల్సిందే. 

ఒక్కో ఎపిసోడ్ 25 నిమిషాలు 

ఒక్కో ఎపిసోడ్ 25 నిమిషాల నిడివిని కలిగి ఉంటుంది. జూన్ 17 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అడుగడుగునా ఈ వెబ్ సిరీస్ ఉత్కంఠను రేకెత్తిస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. శ్రీరామ్, ధన్యా బాలకృష్ణ, శివ బాలాజీ, ఆడుకాలం నరేన్, ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. మద్దూరి శ్రీరాం ఈ సిరీస్‌కు సంగీతం అందించారు. 

శ్రీరాం కొలిశెట్టి నిర్మాతగా.. 

ఈ రెక్కీ వెబ్‌సిరీస్‌ను సిల్వర్ స్ర్కీన్ పొడక్షన్స్ పేరిట శ్రీరాం కొలిశెట్టి నిర్మిస్తున్నాడు. జీ టీలో ప్రసారమౌతున్న ప్రేమ ఎంత మధురం వంటి హిట్‌ సీరియల్‌లో నటించి, నిర్మించిన శ్రీరామ్‌ తొలిసారిగా ఓటీటీ కోసం చేస్తున్న వెబ్‌సిరీస్‌ రెక్కీ.    

ముగ్గురు శ్రీరామ్‌లు 

ఈ వెబ్‌సిరీస్‌ నిర్మాత పేరు శ్రీరామ్. ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన నటుడి పేరు శ్రీరామ్. ఈ సిరీస్‌కు మ్యూజిక్ అందించిన వ్యక్తి పేరు కూడా శ్రీరామ్ కావడం విశేషం.  

 2022-06-03  Entertainment Desk