2022-05-18News Desk వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదం దేశంలోఇంకా సంచలనం రేపుతుండగానే.. మరో వివాదం తలెత్తింది. కర్ణాటక మాండ్యా జిల్లాలోని శ్రీరంగపట్నంలో గల జామియా మసీదులో హనుమాన్ దేవాలయం ఉండేదని, అందువల్ల ఇక్కడ ప్రార్థనలు, పూజలు చేసేందుకు అనుమతించాలని కొన్ని హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. View more
2022-05-18News Desk దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. 30 మిలియన్లకు పైగా ప్రజలు నివసించేరాజధాని నగరం న్యూఢిల్లీ పరిసరప్రాంతంలో. మే మధ్యలో ఈప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా తక్కువ 100s ఫారెన్హీట్ (39-40 సెల్సియస్)లో ఉంటాయి, అయితేగత గురువారం నుండి రాజధానిలో ఉష్ణోగ్రతలు 110s F (43 C పైన)కి పెరగడం ప్రారంభించాయి. ఆదివారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. View more
2022-05-18News Desk సుప్రీం కోర్టు పుణ్యమా అని వారికి ఊరట లభించింది. ఉక్రెయిన్ సంక్షోభం ఒక రకంగా వారి విద్యావకాశాలను దెబ్బతీసింది. అంతకుముందు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు కారణమైన కరోనా కోవిడ్ 19 వైరస్ ముప్పు మరో విధంగా వారికి సమస్యలు తెచ్చిపెట్టింది. ఆ పరిస్థితులలో వారిని ఆదుకోవడానికి ముందుకువచ్చింది భారత దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. View more
2022-05-18News Desk కాబోయే భర్త తాగి తాగి తందనాలాడుతూ పెళ్లి ముహూర్తానికి లేటుగా వచ్చాడని ఆగ్రహించిన వధువు అతగాడిని ఛీకొట్టడమే కాదు.. మరొకరిని పెళ్లి చేసుకున్న ఘటన రాజస్థాన్లో జరిగింది. తర్వాత ఇరువర్గాలు కేసు పెట్టుకుని పోలీసు స్టేషన్కి వెళ్లడం సంచలనానికి దారి తీసింది. View more
2022-05-18News Desk అయోధ్య రామాలయం తుది సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని సీనియర్ ఆలయ ట్రస్ట్ అదికారి తెలిపారు. ఆగస్టు నెలలో ఆలయ పునాది నిర్మాణం పూర్తియిన వెంటనే రామాలయ ఉపరి నిర్మాణం ప్రారంభ మవుతుందని చెప్పారు. దశలవారీగా సాగిన ఆలయ పునాది మరో రెండునెలల్లో పూర్తవుతుందని, చివరి సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం త్వరలో మొదలవుతుందని ఆలయ ట్రస్టీ సీనియర్ అధికారి చెప్పారు. View more
2022-05-18News Desk రిక్షా నడిపే వ్యక్తి కూతురు కలెక్టర్ అయ్యింది.. పండ్లు అమ్ముకునే వ్యక్తి కూతురు డాక్టర్ అయ్యింది.. ఇలాంటివి వింటూనే ఉంటాం. నిజానికి ఇలాంటివి విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ తండ్రి తన పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఎంత కష్టపడ్డాడో.. ఎన్ని రోజులు ఆకలితో అలమటించాడో.. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడో మనం అర్ధం చేసుకోగలం. View more
2022-05-18News Desk రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ఈ నెల ప్రారంభంలో కీలక వడ్డీరేట్లు రెపో రేటును పెంచేసింది. ఎలాంటి ఉరుములు మెరుపులు లేకుండా ముందుస్తు సమాచారం లేకుండా ఆర్బీఐ వడ్డీరేట్లను సవరించింది. వాస్తవానికి ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్యపరపతి సమీక్ష నిర్వహించి కీలక వడ్డీరేట్లను పెంచడమో లేదా తగ్గించడమో చేస్తుంది. View more
2022-05-18News Desk తాజాగా నిహాంగ్లు చేసిన ఓ మర్డర్ కలకలం రేపుతోంది. క్షమాతత్వం వల్లె వేసే వీరు కొన్ని వ్యక్తిగత కలహాలతో, మరికొన్ని మతం పేరుతో అనుసరించే హింసాకాండ తో మళ్లీ వెలుగులోకి వచ్చారు. ఇందుకు సంబంధంచిన వివరాలలోకి వెళితే... View more
2022-05-17News Desk నిజానికి దేశవ్యాప్తంగా అక్షరాస్యత ఇటీవలి కాలంలోనే మెల్లి మెల్లిగా మెరుగవుతోంది. చాలా రాష్ట్రాలలో ఇప్పుడు కాస్తో కూస్తో చదువుకున్న వారి సంఖ్య ప్రోత్సాహకరంగా ఉంది. కొన్ని వర్గాల వారిలో విద్య పట్ల ఆసక్తి కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గంలో ముస్లింలకు చదువుకునే అవకాశాలు మామూలుగానే అంతంతే. View more
2022-05-17News Desk నిండువేసవిలో సూర్యుడుభగ భగమనిపించే మే నెలలో ఈశాన్య రాష్ట్రాలలో వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మేఘాలయలలో వరదలు సృష్టిస్తున్న బీభత్సానికి రెండు వందలకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయని అంచనా... View more
2022-05-17News Desk బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీని, ఆయన భార్యను ఇంటరాగేట్ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో రాష్ట్ర అధికారులు జోక్యం చేసుకోరాదని, దీన్ని అడ్డుకోవడాన్ని సహించే ప్రసక్తి లేదని హెచ్చరించింది. View more
2022-05-17News Desk కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరం మళ్ళీ చిక్కుల్లో పడ్డారు. తల్వండీ సాబో విద్యుత్ ప్రాజెక్టు కోసం కొంతమంది చైనా వర్కర్లకు వీసాలు లభించేలా చూసేందుకు ఆయన యత్నించాడని, ఇందుకోసం 50 లక్షల రూపాయల ముడుపులు కోరాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy