2022-05-25News Desk బాలివుడ్ నటుడు అక్షయకుమార్ నటించిన పృధ్విరాజ్ సినిమాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిలకించనున్నారు. ఇందుకోసం థియోటర్లలో విడుదల కు రెండు రోజుల మందు జూన్ ఒకటవ తేదీన ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. View more
2022-05-25News Desk కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల జరిపిన బ్రిటన్ పర్యటన అదేపనిగా వార్తాపత్రికలకు, న్యూస్ చానెళ్లకు ఎక్కుతోంది. బ్రిటన్ లో వివాదాస్పద ఎంపీ జెరెమీ కార్బిన్ తో ఆయన సమావేశం కావడం, ఎంచక్కా ఫోటో దిగడంతో బీజేపీకి మంచి అవకాశం చిక్కింది. View more
2022-05-25News Desk విపరీతంగా పెరిగిన ఆయిల్ ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.. పన్ను కుదింపు ద్వారా సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలను అదుపులోకి తేవాలని అనుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నివేదికను అందుకున్న ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలనలో పెట్టింది. View more
2022-05-25News Desk 1991 నాటి ప్రార్థనాస్థలాల చట్ట రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ స్వామి జితేంద్రానంద సరస్వతి .. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మధురలోని కృష్ణ జన్మభూమి-షాహీ మసీదు వివాదాల నేపథ్యంలో ఈ చట్టం ఒక్కసారిగా కేంద్రబిందువయింది. View more
2022-05-25News Desk డేంజర్ అస్టరాయిడ్ 27న భూమికి అతి దగ్గరగా వస్తుంది. ఈ గ్రహశకలం వెడల్పు దాదాపు 2 కిలోమీటర్లు అని, విశ్వాంతరాళం నుంచి ఇది భూమిని సమీపిస్తోందని సైంటిస్టులు తెలిపారు. ఈ డేంజర్ అస్టరాయిడ్ వల్ల ఏం జరుగుతుందో..తెలుసా? View more
2022-05-25News Desk భారత బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్... హిజాబ్ పై వివాదంపై రియాక్ట్ అయింది.హిజాబ్ అన్నది ముస్లిం మహిళల వస్త్రధారణలో భాగం , వారి ఎంపికలపై నేను వ్యాఖ్యానించలేను. ఇది ధరించడం, ధరించక పోవటంవారి వ్యక్తిగత వ్యవహారం. నా వరకు నేనుహిజాబ్ని ధరించేందుకు ఇష్టపడతానని తేల్చిచెప్పింది View more
2022-05-25News Desk నరేంద్ర మోదీ వక్తృత్వ నైపుణ్యం గురించి వాదించే వారు చాలా తక్కువ. ఆయన వాడే కొన్ని పదాలు అత్యంత పాపులర్ అవుతూ ఉంటాయి. ఎంతగా అంటే.. ప్రధాని, అధికార పార్టీ నాయకులు ఉపయోగించే పదాలు, పదబంధాలు మనకు కూడా అలవాటై పోతుంటాయి. మన రోజువారీ భాషలో భాగమయ్యాయి. View more
2022-05-25News Desk శ్రీనగర్ శివారులోని గనై మొహల్లా అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మంగళవారం దారుణానికి ఒడిగొట్టారు. ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను అతని ఇంటి వెలుపలే ఉగ్రవాదులు అత్యంత దారుణంగా కాల్చిచంపారు. తండ్రిపై విచక్షణా రహితంగా జరుగుతున్న దాడి నుంచి రక్షించాలని పరుగెత్తిన అతని ఏడేళ్ల కుమార్తె సైతం దాడిలో గాయపడింది. తన కుమార్తెను ట్యూషన్ క్లాస్‌కి దింపేందుకు ఇంటి నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ దాడి జరిగింది. View more
2022-05-24News Desk కేరళలో సంచలనం సృష్టించిన మెడికల్ విద్యార్థి విస్మయ ఆత్మహత్య కేసులో భర్తకు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. రూ. 12.5 లక్షల జరిమానా సైతం విధించింది. View more
2022-05-24News Desk వరుస ఓటములతో డీలాపడి రోజు రోజుకూ పరిస్థితి తీసికట్టుగా మారుతుండటంతో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే సమావేశాలు నిర్వహించి మరీ వ్యూహ రచన చేస్తోంది. ఎలక్షన్ వార్ బరిలోకి దిగడానికి అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. View more
2022-05-24News Desk పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. మంత్రిపై ఆరోపణలు రావడం.. దీనికి సంబంధించి గట్టి సాక్ష్యాధారాలు లభ్యం కావడంతో సీఎం మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. View more
2022-05-24News Desk ఒక హోటల్ నిర్వహిస్తున్నప్పుడు ఉత్పత్తిని బట్టి, నిర్వహణను బట్టి ధరను నిర్ణయించడం సర్వసాధారణం.. కానీ రెస్టారెంట్లలో సర్వీస్ చార్జి పేరిట వినియోగదారులపై అదనపు భారాన్ని వేయడం ఎందుకని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సర్వీస్ ఛార్జ్ విధించే విషయంలో రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కు చర్చలకు ఆహ్వానిస్తూ లేఖ రాశారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy