2022-05-22News Desk దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచేముందు కేంద్రం.. రాష్ట్రాలను సంప్రదించిందా అని తమిళనాడు ప్రభుత్వం ప్రశ్నించింది. ఇప్పుడు వీటిపై ఎక్సయిజు సుంకాలను తగ్గించి.. వ్యాట్ ను తగ్గించాలంటూ రాష్ట్రాలను కోరుతోందని తమిళనాడు ఆర్ధిక మంత్రి పి. త్యాగరాజన్ విమర్శించారు. View more
2022-05-22News Desk హెలికాప్టర్ రవాణా కంపెనీ అయిన బ్లేడ్ తన చాపర్ సర్వీసులను గోవాలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్థానికులకు, టూరిస్టులకు రైడింగ్ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ హెలికాప్టర్ సేవలు గోవా విమానాశ్రయం నుంచి ఉత్తర గోవాకు, దక్షిణ గోవాకు, పాత గోవాకు కనెక్ట్ చేస్తాయని కంపెనీ తెలిపింది. View more
2022-05-22News Desk దేశంలో ఇంధన ధరల పెరుగుదలపై వ్యక్తమవుతున్న ప్రజాగ్రహాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించింది. వీటిపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీంతో పలు రాష్ట్రాలు కూడా పెట్రోలు, డీజిల్ పై విలువ ఆధారిత పన్నను (వ్యాట్) తగ్గిస్తున్నాయి. ఇప్పటివరకు రాజస్థాన్, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. View more
2022-05-22News Desk శునకాలు మనుషుల ఉత్తమ స్నేహితులు అనడంలో సందేహమే లేదు. ఇంటర్నెట్లో దీనికి అనేక నిదర్శనాలు కనబడుతున్నాయి. పర్వత సింహంతో తలపడిన ఒక శునకం నేరుగా తన యజమాని ప్రాణాలనే కాపాడి ఔరా అనిపించింది. ఆ శునకం వయస్సు రెండున్నర సంవత్సరాలు మాత్రమే. ఉత్తర కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. View more
2022-05-22News Desk పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించిన ఇండియాను పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదని, రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ ... రష్యా నుంచి ఇండియా డిస్కౌంట్ పై ఆయిల్ దిగుమతులు చేసుకుంటూనే ఉందని ఆయన అన్నారు. View more
2022-05-22News Desk ఢిల్లీ విద్యా విధానం దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ అన్నారు. దేశమంతా ఢిల్లీ తరహా విద్యా వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఢిల్లీ తరహా విధానాన్ని అమలు చేయకపోయినా.. తెలంగాణ టీచర్లను ఢిల్లీకి పంపి ఓరియెంటేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. View more
2022-05-22News Desk ఈ ఏడాది ప్రారంభమై ప్రస్తుతం ఐదవ నెలలో ఉన్నాము. కాగా ఈ నెల ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ నెల ప్రత్యేకత ఏమిటంటే ఈ ఏడాది మే నెలలో బ్యాంకులకు మొత్తం 11 సెలవులు వచ్చాయి. ఈ నెల ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నా... ఇంకా మూడు సెలవులు మిగిలి ఉన్నాయి. View more
2022-05-22News Desk నిన్నటి వరకు పెట్రో ధరలు జనానికి పట్టపగలే చుక్కలు చూపించాయి.... అసలు అంతర్జాతీయ మార్గెట్ ధరలు తగ్గినా, పెరిగినా తమకేం సంబంధం లేదన్నట్టు పెట్రో కంపెనీలు ధరలు పెంచడమే తప్ప తగ్గేదేలేదంటూ ఇన్నాళ్లూ భీష్మించుకుని కూర్చున్నాయి. ఏ తరహా సూచనలూ లేకుండానే అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం కాస్త కరుణించి, లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. View more
2022-05-21News Desk తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు జ్ఞానవాపి మసీదు కేసు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. మసీదులో శివలింగం దొరికిన ప్రాంతాన్ని కాపాడాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. View more
2022-05-21News Desk ఉక్రెయిన్‌కు వివిధ దేశాలనుంచి సమకూరుతున్న ఆయుధాలను తాము నాశనం చేసినట్టు రష్యా ప్రకటించింది.ఈ మేరకు శనివారం రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. View more
2022-05-21News Desk మరాఠీలు అరాధ్య దైవంగా కొలిచే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొన్నాళ్లపాటు నివసించిన లాల్ మహల్ కోటలో డాన్స్ చేసినందుకు గాను వైష్ణవీ పాటిల్ అనే సినీ నటిని అదుపులోకి తీసుకున్నారు. View more
2022-05-21News Desk ఇప్పటికే 45 డిగ్రీలకుపైగా ఎండలతో అల్లాడి పోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. తమిళనాడు, కర్ణాటకలోకి తీర ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కొన్నిప్రాంతాల్లో ఈదురు గాలులు, చిరుజల్లులు, భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy