collapse
...
Home / వినోదం / హిందీ / Samrat Prithviraj Movie Review: అక్షయ్ కుమార్ అంచనాలు అందుకున్నాడా? - 6TV News : Telugu in News | Telugu News | Latest T...

Samrat Prithviraj Movie Review: అక్షయ్ కుమార్ అంచనాలు అందుకున్నాడా?

2022-06-04  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Samrat Prithvi Raj
 

పద్మావత్కేసరిబాజీరావు మస్తానీ వంటి చిత్రాల తరువాత బాలీవుడ్‌లో విడుదలైన మరో చారిత్రాత్మక చిత్రం సామ్రాట్ పృథ్వీ రాజ్. మోస్ట్ సక్సెస్ ఫుల్ బాలీవుడ్ హీరో.. సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించే ఏకైక సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.. సామ్రాట్ పృథ్వీ రాజ్ పాత్రలో నటించటంతో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. అక్షయ్‌తో పాటు సంజయ్ దత్సోనుసూద్మనూషి చిల్లర్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించాడు. టైటిల్ విషయంలో వివాదం.. భారీ యాక్షన్స్హిందూ సెంటిమెంట్ వంటి అంశాలతో.. హిందీతెలుగుతమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ టాక్ ఏంటో చూద్దాం

పృథ్వీరాజ్ సాహసాలువీరత్వం

చహమానస్ రాజవంశానికి చెందిన రాజు పృథ్వీరాజ్ చౌహాన్ (అక్షయ్ కుమార్) ఢిల్లీ సంస్థానానికి యువరాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. అయితే అదే ఢిల్లీ కిరీటాన్ని చేజిక్కించుకోవాలని సుల్తాన్ ముహమ్మద్..  పృథ్వీరాజ్ చౌహాన్‌తో యుద్దానికి సై అంటాడు. కానీ  పృథ్వీరాజ్ చౌహాన్ రాజుగా ఉండగా ఢిల్లీ గడ్డపై ఇతర వ్యక్తుల నీడ కూడా పడనివ్వనంటూ.. ముహమ్మద్‌పై యుద్దానికి సై సై అంటూ కథన రంగంలోకి కత్తులతో బరిలోకి దిగుతాడు. ఈ క్రమంలో జరిగిన యుద్దంలో ఘోరీని పృథ్వీరాజ్ ఓటమి పాలు చేశాడా.. తనకు పక్కలో బళ్లెంగా మారిన జైచంద్ (అశుతోష్ రాణా) కూడా ఢిల్లీని హస్తగతం చేసుకోవాలని చూసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులకి దారితీస్తుంది.  పృథ్వీరాజ్ సాహసాలువీరత్వం చూసిన యువరాణి సంయోగితతో (హీరోయిన్ మనూషి చిల్లర్) ప్రేమకథలో ట్విస్ట్ ఏంటీ.. ఫైనల్‌గా జరిగిన యుద్ధంలో గెలుపు ఎవరిదీ అన్నదే సామ్రాట్ పృథ్వీ రాజ్అసలు కథ.

Samrat Prithviraj telugu poster
చరిత్రను వక్రీకరించారని విమర్శలు

ఇక సామ్రాట్ పృథ్వీ రాజ్ లో అసలు చరిత్రని వక్రీకరించారన్నది ఈ మూవీ చూసిన ఆడియన్స్క్రిటిక్స్ నుండి వస్తున్న ప్రధాన విమర్శలు. వాస్తవాలను చూపెట్టకుండా.. స్క్రిప్ట్ పై సరైన పరిశోధన చేయకుండానే సినిమాని లాగించేశారని టాక్. పృథ్వీ రాజ్ మూవీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వకుండా.. చూస్తుంటే డాక్యుమెంటరీ ఫీలింగ్ వచ్చిందని.. క్లాస్ రూమ్‌లో హిస్టరీ లెక్చరర్ చెప్పే పాఠంగా ఉందని ఆడియన్స్ అభిప్రాయం. అయితే సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా కథకు మూలం చాంద్ బర్ దాయి.. రచించిన పృథ్వీరాజ్ రాసో అనే అద్భుతమైన ప్రేమకావ్యం. 

Akshay with Manushi
పృథ్వీ రాజ్యువరాణి సంయోగితతో వచ్చే ప్రేమ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకి ఆహ్లాదాన్ని ఇస్తుంది.  సంయోగిత పాత్రలో మాజీ ప్రపంచ సుందరి మనూషి చిల్లర్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. యుద్దాలుకుట్రలువీరత్వం కంటే.. సినిమాలో ప్రేమ సన్నివేశాలే కరెక్ట్‌గా పండాయని చెప్పొచ్చు. పృథ్వీరాజ్ చౌహాన్‌గా అక్షయ్ కుమార్‌కి కాస్త నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి. పృథ్వీరాజ్ వంటి రాజుకి ఉండాల్సిన మానసికంగాశారీరకంగా ఉండాల్సిన ధృడత్వం తెరపై కనపడలేదనిరణ్వీర్ సింగ్ లాంటి యంగ్ హీరో చేస్తే బాగుండేదని కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి హిస్టారికల్ జానర్స్ ని ఇష్టపడే వారికి తప్ప మిగితా ఆడియన్స్ కి సామ్రాట్ పృథ్వీ రాజ్ సోసో గానే అనిపిస్తుంది.



2022-06-04  Entertainment Desk