collapse
...
Home / తెలంగాణ / హైదరాబాద్ / రివెంజ్ కోసం దారుణం..పక్కా ప్లానేనా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

రివెంజ్ కోసం దారుణం..పక్కా ప్లానేనా?

2022-05-31  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

sexual assault
హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన గురించి వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన భర్తతో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో.. యువతిపై కిరాయి మూకతో లైంగిక దాడి చేయించింది ఓ కిలాడీ లేడీ. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన  పోలీసులు మహిళ సహా ఆరుగురిని అరెస్టు చేశారు.  

*శ్రీకాంత్ తో పరిచయం ఎలా అంటే?  
గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలో గాయత్రి, తన భర్త శ్రీకాంత్ తో కలిసి నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. లా-ఎక్సలెన్స్ ఇన్టిట్యూట్‌ లో క్లాసులకు వెళ్తున్నాడు. బాధితురాలు కూడా అదే ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ యువతికి శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడింది. ఆమెను తన భార్య గాయత్రికి కూడా పరిచయం చేశాడు. గతేడాది అక్టోబర్‌లో గాయత్రికి అనారోగ్యంగా ఉండటంతో బాధితరాలిని ఇంటికి పిలిచింది. వారిద్దరికి పరిచయం పెరగడంతో తన ఇంట్లోనే ఉండమని గాయత్రి చెప్పింది. ఫిబ్రవరి వరకూ గాయత్రి ఇంట్లోనే ఉండి బాధితురాలు సివిల్స్‌కు ప్రిపేర్ అయింది.  

*పక్కా ప్లాన్ ప్రకారమే లైంగిక దాడి   
ఉన్నట్లుండి తన భర్తతో బాధితురాలు వివాహేతర సంబంధం పెట్టుకుందని ఏప్రిల్ 22న గాయత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.  ఈ నెల 26న బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులను గాయత్రి తన ఇంటికి పిలిచింది. కేసు వాపస్ తీసుకుంటానని చెప్పడంతో వాళ్లు వచ్చారు. చెప్పినట్లుగానే కేసును విత్ డ్రా చేసుకున్నది. బాధితురాలి కుటుంబ సభ్యులను ఇంటి బయటే ఉంచింది.  బాధితురాలిని మాత్రం ఇంట్లోకి తీసుకెళ్ళింది. అప్పటికే తనకు పరిచయం ఉన్న ఐదుగురు వ్యక్తులను గాయత్రి ముందుగానే ఇంట్లో ఉంచింది. యువతి లోపలకి రాగానే పృధ్వీ, విష్ణు వర్థన్, మనోజ్, మస్తాన్, ముజాహిద్, మౌలాలీ అనే వ్యక్తులు కాళ్లూ, చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆమె నోటిలో గుడ్డలు కుక్కి లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటనను గాయత్రి ఫోన్ లో రికార్డ్ చేసింది. బాధితురాలు కేకలు పెట్టడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం బయట చెప్తే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని గాయత్రి బెదిరించింది. బాధితురాలిని బయటకు పంపించింది. రక్తస్రావంతో బయటకు వచ్చిన తన బిడ్డను.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. జరిగిన ఘటనపై పోలీసులు  ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రితో పాటు నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

*భర్తకు తగ్గ భార్య..  
గాయత్రి గతంలో ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో విభేదాలతో 2014 నుంచి శ్రీకాంత్ అనే వ్యక్తిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. 2015లో గాయత్రి తండ్రి రత్నాకర్ రాజు చనిపోవడంతో ఆయన ఆస్తి మీద శ్రీకాంత్ కన్నుపడిందని గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపించారు.  శ్రీకాంత్, గాయాత్రి కలిసి  తనను, తన కుమారుడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారని గాయత్రి తల్లి కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేసింది.  ఇల్లు తన పేరు మీద ఉంటే శ్రీకాంత్‌తో కలిసి గాయత్రి తనపై దౌర్జన్యానికి దిగిందని చెప్పింది. యువతిపై జరిగిన ఘటనకు అసలు కారణం శ్రీకాంత్ అని వెల్లడించింది. తన కూతురితో కావాలనే శ్రీకాంత్ ఇలాంటి పని చేయించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తోంది.  



2022-05-31  News Desk