మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యతర బెయిల్ పై విడుదల అయినా విషయం తెలిసిందే. ఇక ఆయన హైదరాబాద్ చేరుకొన్నారు. అయితే చంద్రబాబు కి ఇచ్చిన బెయిల్ కి సంబంధించి కండిషన్స్ పై సిఐడి అధికారులు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ను ఆశ్రయించిన విషయం కూడా విదితమే. ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తికాగా తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసి ఉంచింది. తాజాగా ఈ తీర్పును న్యాయస్థానం వెలువరించింది. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు చేయకూడదని, స్కిల్ కేసుకి సంబంధించి ఎక్కడా మాట్లాడ కూడదు అన్న ఆదేశాలను కొనసాగించింది. అయితే చంద్రబాబు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు డిఎస్పీలు ఉండాలన్న సీఐడీ అభ్యర్ధనను కోర్ట్ తిరస్కరించింది.
