బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టాడు. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుటెక్ స్టార్టప్.. క్లాస్ప్లస్తో చేతులు కలిపాడు. వేలాది మంది కోచ్‌లను, కంటెంట్ క్రియేటర్లకు మద్దతుగా నిలిచేందుకు నిర్ణయించుకున్నాడు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. 30 సెకన్ల పాటు ఉన్న వీడియో క్లిప్ ద్వారా తాను చేయదలచున్న కొత్త పని గురించి సౌరవ్ గంగూలీ క్లుప్తంగా వివరించాడు. మన కలలు సాకారం చేసుకునేందుకు వెయ్యాల్సిన మొదటి అడుగు సరైన్ కోచ్ ఎంపికే అంటూ గంగూలీ పేర్కొన్నాడు.
క్లాస్‌ప్లస్ ఎడ్యుకేషనల్ స్టార్టప్
క్లాస్‌ప్లస్ ఎడ్యుకేషనల్ స్టార్టప్ మన దేశంలో 3000 నగరాల్లో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రస్తుతానికి తన సేవలను అందిస్తోంది. దాదాపుగా లక్షమంది ఎడ్యుకేటర్లు, కంటెంట్ క్రియేటర్లు అందుబాటులో ఉన్నారు. 3 కోట్ల మంది విద్యార్ధులకు తమ ఆల్‌లైన్ కోర్సుల ద్వారా అందుబాటులో ఉంది. తమతో సౌరవ్ గంగూలీ చేతులు కలపడంపై ఆ సంస్థ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు.. ముకుల్ రస్తగీ స్పందించారు. తమ వద్ద ఉన్న కంటెంట్ క్రియేటర్లు మరింత అభివృద్ధి చెంది, వారి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కనున్నట్లు వెల్లడించారు. ఇటీవలే ఈ సంస్థలో ఆల్ఫావేవ్ గ్లోబర్, టైగర్ గ్లోబర్ సంస్థలు 70 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులతో సంస్థ మొత్తం పెట్టుబడులు 600 మిలియన్లకు చేరాయి.
అండగా నిలుస్తున్న అంతర్జాతీయ సంస్థలు
ఆన్లైన్ కోచింగ్ బిజినెస్‌లో కొత్తగా ప్రవేశించేవారికి, ఇప్పటికే ఆన్లైన్ కోచింగ్ వ్యాపారంలో ఉన్నవారికి తోడ్పడడం, వారి వ్యాపారాభివృద్ధికి క్లాస్‌ప్లస్ సంస్థ సహకరిస్తోంది.2018లో ప్రారంభమైన ఈ స్టార్టప్‌కు పలు అంతర్జాతీయ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. టైగర్ గ్లోబల్, AWI, ఆర్.టి.పి గ్లోబల్, బ్లమ్ వెంచర్స్, సీక్వోయియా క్యాపిటల్ ఇండియాస్ సర్జ్, స్పైరల్ వెంచర్స్, స్ట్రైవ్, టైమ్స్ ఇంటర్నెట్, అబుదాబికి చెందిన చిమేరా వెంచర్స్ వంటి సంస్థలు క్లాస్‌ప్లస్ ఎడ్యు స్టార్టప్‌కు సహకారం అందిస్తున్నాయి. ఆ సంస్థల ద్వారా 160 మిలియన్ డాలర్ల మొత్తాన్ని సేకరించింది.
ఆ ట్వీట్‌తో మొదలైన ఊహాగానాలు
జూన్ 1 తేదీ సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు గంగూలీ ఒక ట్వీట్ చేశాడు. చాలా మందికి ఉపయోగపడే ఒక కొత్త పనిని ప్రారంభిస్తున్నానని...ఎప్పటిలాగే తనకు మీఅందరి మద్దతు కావాలని ఆ ట్వీట్లో గంగూలీ కోరాడు. 2022 సంవత్సరానికి తాను క్రికెట్లోకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తవుతోందని..క్రికెట్ తనకు ఎన్నో ఇచ్చిందని, ముఖ్యంగా మీ అందరి మద్దతు నాకు లభించిందని గంగూలీ పేర్కొన్నాడు. తన ప్రయాణంలో ఇప్పటి వరకు సహకరించిన ప్రతి ఒక్కిరికీ ..ధన్యవాదాలు తెలిపాడు. ట్విట్టర్ ద్వారా చేసిన ఈ కామెంట్లు పలు ఊహాగానాలకు దారి తీసాయి. దాదా పొలికల్ ఎంట్రీ చేస్తున్నాడంటూ వార్తా కథనాలు వెలువడ్దాయి. బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా గుడ్‌బై చెబుతున్నట్లు కూడా పలు వార్తా ఛానెళ్లు ప్రసారం చేశాయి. ఈ ప్రచారం ప్రారంభమైన కొన్ని గంటలకు బీసీసీఐ సెక్రటరీ జై షా క్లారిటీ ఇచ్చారు. గంగూలీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. తాజాగా దాదా తాను చేయదలచుకున్న పని గురించి ట్వీట్ చేస్తూ...తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికాడు.
Share my new initiative with all the educators, teachers, and coaches and give me an opportunity to help them grow. Link in bio.
I am thankful to @ClassplusApps for helping me with this. pic.twitter.com/J9nTwiiWEJ— Sourav Ganguly (@SGanguly99) June 2, 2022
— Sourav Ganguly (@SGanguly99) June 2, 2022