collapse
...
క్రీడలు
  Team India Ex Keeper Kiran More: హార్ధిక్ పాండ్యా 4 డైమెన్షనల్ ప్లేయర్

  Team India Ex Keeper Kiran More: హార్ధిక్ పాండ్యా 4 డైమెన్షనల్ ప్లేయర్

  2022-06-03  Sports Desk
  హార్ధిక్ పాండ్యా కొన్ని నెలల క్రితం వరకు 3 డైమన్షనల్ ప్లేయర్ మాత్రమే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రమే చేసేవాడు. ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు కూడా నెరవేరుస్తున్నాడు. అటువంటి టాలెంటెడ్ ప్లేయర్ భారత జట్టులో ఉండడం గర్వకారణమని కిరణ్ మోరే అన్నాడు.
  Sourav Ganguly: క్లాస్‌ప్లస్ ఎడ్యుకేషనల్ స్టార్టప్‌కు అండగా నిలిచిన దాదా

  Sourav Ganguly: క్లాస్‌ప్లస్ ఎడ్యుకేషనల్ స్టార్టప్‌కు అండగా నిలిచిన దాదా

  2022-06-02  Sports Desk
  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుటెక్ స్టార్టప్‌.. క్లాస్‌ప్లస్‌తో చేతులు కలిపాడు. వేలాది మంది కోచ్‌లను, కంటెంట్ క్రియేటర్లకు మద్దతుగా నిలిచేందుకు నిర్ణయించుకున్నాడు. ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
  గంగూలీ ఎందుకీ గందరగోళం...ఆ యాప్ కోసమేనా ఇదంతా..!

  గంగూలీ ఎందుకీ గందరగోళం...ఆ యాప్ కోసమేనా ఇదంతా..!

  2022-06-02  Sports Desk
  బీసీసీఐ బాస్ గంగూలీ పోస్ట్ వెనుక గందరగోళం ఏంటి? క్రికెట్ వ్యవహారాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నా? మరి అలాంటిది ఏమిలేదని దాదా క్లారిటీ ఇచ్చారు. దేనికోసం గంగూలీ అలా పోస్ట్ చేశారు..కొత్తగా ఏం చేయబోతున్నారు.
  PM Modi: బాక్సింగ్ ఛాంపియన్లకు ప్రధాని మోడీ అభినందనలు

  PM Modi: బాక్సింగ్ ఛాంపియన్లకు ప్రధాని మోడీ అభినందనలు

  2022-06-02  Sports Desk
  బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్ జరీన్ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇస్లాంబుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్‌గా అవతరించిన నాటి నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆమెను అభినందించారు. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌తో పాటు మరో బాక్సర్ మనీషా మౌన్, పర్వీన్ హుడాలను ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసానికి ఆహ్వానించారు.
  Singer KK death: గాయకుడికి నివాళులర్పించిన క్రికెటర్లు

  Singer KK death: గాయకుడికి నివాళులర్పించిన క్రికెటర్లు

  2022-06-02  Entertainment Desk
  ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్‌..కేకే అర్ధాంతరంగా చనిపోవడం మన దేశంలో ఎందరినో కలచివేసింది. కేకే మరణవార్త .. అతడి అభిమానులకు ఎందరికో తీరని శోకమ మిగిల్చింది. వారందరూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కేకే అభిమానుల్లో క్రికెటర్లు కూడా ఉన్నారు. వారు కూడా కేకే మరణవార్తను తట్టుకోలేకపోయారు. ట్విట్టర్ వేదికగా తమ బాధను వ్యక్తం చేశారు.
  Sports Updates: ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్

  Sports Updates: ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్

  2022-06-01  Sports Desk
  క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ ప్రభుత్వం..మరోసారి ఛాంపియన్లకు అండగా నిలిచింది. నగదు బహుమతి ప్రకటించింది. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌, షూటింగ్ స్టార్ ఈషా సింగ్‌లకు ఒక్కక్కరికీ రెండేసి కోట్ల రూపాయలను అందించాలని నిర్ణయించింది. నగదు పురస్కారంతో పాటు హైదరాబాద్‌లో ఓ మంచి ప్రదేశంలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
  Sports Updates: మరో 3 రోజుల్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

  Sports Updates: మరో 3 రోజుల్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

  2022-06-01  Sports Desk
  ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. హర్యానాలోని పంచకులాలో జరిగే ఈ క్రీడోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 4 నుంచి జూన్ 13వ తేదీ వరకు యూత్ గేమ్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో 5 సాంప్రదాయ క్రీడలకు కూడా చోటు కల్పించారు. గట్కా కలరిపయట్టు, మల్‌కంబ్, యోగాసన, తాంగ్ తా వంటి క్రీడలు ఈ సారి పోటీల్లో జతకలిశాయి.
  Sports Updates: పురుషుల హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం

  Sports Updates: పురుషుల హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం

  2022-06-01  Sports Desk
  హాకీ ఆసియాకప్‌లో టీమిండియా పురుషుల హాకీ జట్టును దురదృష్టం వెంటాడింది. గోల్స్‌ తేడా కారణంగా టీమిండియా ఫైనల్‌ చేరకుండానే సూపర్‌-4లోనే ఇంటిబాట పట్టింది. సూపర్‌-4లో భాగంగా మే 31న దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను భారత్‌ 4-4తో డ్రా చేసుకుంది. దీంతో భారత్‌, కొరియా జట్లు చెరో ఐదు పాయింట్లు సాధించాయి. అయితే జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మలేషియా విజయం సాధించడం భారత్‌ అవకాశాలను దెబ్బ తీసింది.
  ఎంఎస్ ధోనీపై బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదైంది ?

  ఎంఎస్ ధోనీపై బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదైంది ?

  2022-06-01  News Desk
  ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కమాండ్‌ను తీసుకుని.. ఫినిషర్‌ అనే పదానికి నిర్వచనం చెబుతూ పలుమార్లు మంచి ఇన్నింగ్స్‌లతో మెరిసిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి చర్చల్లో నిలిచాడు. తాజాగా ఆయనపై బీహార్‌లో కేసు నమోదైంది. బీహార్‌లోని బెగుసరాయ్‌లో మిస్టర్ కూల్‌పై చెక్ బౌన్స్ కేసు నమోదైంది.
  Sports: విరాట్ కోహ్లీపై షోయబ్ అక్తర్ ప్రశంసలు

  Sports: విరాట్ కోహ్లీపై షోయబ్ అక్తర్ ప్రశంసలు

  2022-05-31  Sports Desk
  ఐపీఎల్ టోర్నీలో దారుణంగా విఫలమైన కోహ్లీకి అనూహ్య మద్దతు లభించింది. పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీని గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్‌టైమ్స్ అంటూ ప్రశంసిచాడు. ఒక పాకిస్తానీ పౌరుడిగా తాను ఈ మాట చెబుతున్నానని అన్నాడు. కోహ్లీ విమర్శకలపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ గత రికార్డులను ఓ సారి గుర్తుచేశాడు.
  ఐపీఎల్ అభిమానుల మనసు దోచుకున్న మిస్టరీ గర్ల్స్ వీరే..

  ఐపీఎల్ అభిమానుల మనసు దోచుకున్న మిస్టరీ గర్ల్స్ వీరే..

  2022-05-31  News Desk
  74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైనల్ ముగిసింది. 10 ఫ్రాంఛైజీలు పోటీపడిన ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్(GT vs RR) టగ్ ఆఫ్ వార్‌లో.. గుజరాత్ కప్ దక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్ మొత్తం మీద స్టేడియంలలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటైన IPL మిస్టరీ గర్ల్స్ క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకర్షించారు.
  I.P.L Updates: గ్రౌండ్ స్టాఫ్‌కు బీసీసీఐ నజరానా 

  I.P.L Updates: గ్రౌండ్ స్టాఫ్‌కు బీసీసీఐ నజరానా 

  2022-05-30  Sports Desk
  ఐపీఎల్‌ టోర్నీ విజేతగా నిలిచిన గుజరాత్ జట్టు...తమ సొంత గడ్డపై విక్టరీ ర్యాలీ చేపట్టనుంది. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోనుంది. ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత గుజరాత్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. తమ జట్టుకు గత రెండు నెలలుగా మద్దతుగా నిలిచిన అభిమానులకు అభివాదాలు తెలిపేందుకు నేరుగా వారిని కలిస్తే బాగుంటుందని భావించిన జట్టు యాజమాన్యం విక్టరీ ర్యాలీని ప్లాన్ చేస్తోంది