భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్‌లో తమ సత్తా చాటింది. 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. సెమీఫైనల్‌కు చేరింది. పతకం ఖాయం చేసుకుంది. అద్భుత ఆటతీరుతో దూసుకుపోతున్న భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియాను ఓడించింది.
ఎలా గెలిచామంటే..
తొలి సింగిల్స్ లో యంగ్ సెన్సేషన్ లక్ష్యసేన్ ఓటమి చెందాడు. 21-23, 9-21 తేడాతో లీ జియా చేతిలో పరాజయం పాలయ్యాడు.
డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి 21-19, 21-15 తేడాతో గోఫియ్..ఇజుద్దీన్ జంటపై గెలుపొందింది.
మరో సింగిల్స్ పోటీలో కిదాంబి శ్రీకాంత్ 21-11, 21-17 తేడాతో జె యంగ్‌పై గెలిచాడు.
శ్రీకాంత్ విజయం తర్వాత భారత జట్టు 2-1 స్కోర్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది.
డబుల్స్ లో కృష్ణ ప్రసాద్, విష్ణు వర్ధన్ జోడీ 19-21, 17-21 తేడాతో ఓటమి చెందింది. దీంతో స్కోర్లు 2-2 సమం అయ్యాయి
ఆ సమయంలో H.S. ప్రణయ్ ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడాడు. జూన్ హోపై గెలుపొందాడు. 21-13, 21-8 తేడాతో విజయం సాధించాడు. భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. భారత జట్టును సెమీస్‌కు చేర్చాడు. పతకాన్ని ఖాయం చేశాడు.
1979 తర్వాత భారత జట్టు ఓ పతకం సాధించడం గగనంగా మారింది. ఈ సారి మన ప్లేయర్లు అదరహో అనిపించారు. పతకం ఖాయం చేశారు.
ఉబెర్ కప్‌లో నిరాశ
ఉబెర్ కప్‌లో భారత జట్టుకు నిరాశే ఎదురయింది. P.V. సింధు నేతృత్వంలోని భారత జట్టు ఓటమి చెందింది. థాయిలాండ్ జట్టు చేతిలో చిత్తయింది. తొలి సింగిల్స్ లో సింధు రచనోక్ ఇంటోనన్ చేతిలో ఓటమి పాలయింది. 21-18, 17-21, 12-21 తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. తొలి గేమ్ నెగ్గిన సింధు ఆ తర్వాత తడబడింది. ప్రత్యర్ధి జోరుకు తలవగ్గింది. డబుల్స్ విభాగంలో కూడా భారత జంట శ్రుతి మిశ్రా, సిమ్రాన్ సింగ్‌లు ఓటమి చెందారు. మరో సింగిల్స్ లో ఆకర్షి కశ్యప్ కూడా ఓటమి పాలవ్వడంతో భారత్ ఓటమి ఖాయమయింది.
భారత జట్టుపై ప్రశంసలు
థామస్ కప్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు అరుదైన రికార్డు సాధించడంతో ప్రశంసలు కురుస్తున్నాయి. 43 ఏళ్ల తర్వాత పతకం సాధించడంలో భాగమైన ప్లేయర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
HE DID IT 😭❤️
It's a win for @PRANNOYHSPRI & #TeamIndia secured the 1️⃣st ever medal at #ThomasCup (New format) and have booked a spot in the semis after 4️⃣3️⃣ years beating 5️⃣ times champion #TeamMalaysia 💪#TUC2022#Bangkok2022#ThomasCup2022#IndiaontheRise#Badmintonpic.twitter.com/30nJfAn22c— BAI Media (@BAI_Media) May 12, 2022
MEDAL ASSURED for 🇮🇳 !!
Extremely proud of our boys on scripting HISTORY 🤩🤩
India defeated Malaysia (🇮🇳3- 2🇲🇾) in the QFs to make it to the SEMIS of #ThomasCup after 4️⃣3️⃣ years 😁
They have done it 🔥🔥
Let's Go 💪💪
Great going!!
📸 @BAI_Media#TUC2022#badminton 🏸 pic.twitter.com/BWXXCwzE5g— SAI Media (@Media_SAI) May 12, 2022