collapse
...
క్రికెట్
   గంగూలీ ఎందుకీ గందరగోళం...ఆ యాప్ కోసమేనా ఇదంతా..!

   గంగూలీ ఎందుకీ గందరగోళం...ఆ యాప్ కోసమేనా ఇదంతా..!

   2022-06-02  Sports Desk
   బీసీసీఐ బాస్ గంగూలీ పోస్ట్ వెనుక గందరగోళం ఏంటి? క్రికెట్ వ్యవహారాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నా? మరి అలాంటిది ఏమిలేదని దాదా క్లారిటీ ఇచ్చారు. దేనికోసం గంగూలీ అలా పోస్ట్ చేశారు..కొత్తగా ఏం చేయబోతున్నారు.
   Singer KK death: గాయకుడికి నివాళులర్పించిన క్రికెటర్లు

   Singer KK death: గాయకుడికి నివాళులర్పించిన క్రికెటర్లు

   2022-06-02  Entertainment Desk
   ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్‌..కేకే అర్ధాంతరంగా చనిపోవడం మన దేశంలో ఎందరినో కలచివేసింది. కేకే మరణవార్త .. అతడి అభిమానులకు ఎందరికో తీరని శోకమ మిగిల్చింది. వారందరూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కేకే అభిమానుల్లో క్రికెటర్లు కూడా ఉన్నారు. వారు కూడా కేకే మరణవార్తను తట్టుకోలేకపోయారు. ట్విట్టర్ వేదికగా తమ బాధను వ్యక్తం చేశారు.
   Sports Updates: ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్

   Sports Updates: ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్

   2022-06-01  Sports Desk
   క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ ప్రభుత్వం..మరోసారి ఛాంపియన్లకు అండగా నిలిచింది. నగదు బహుమతి ప్రకటించింది. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌, షూటింగ్ స్టార్ ఈషా సింగ్‌లకు ఒక్కక్కరికీ రెండేసి కోట్ల రూపాయలను అందించాలని నిర్ణయించింది. నగదు పురస్కారంతో పాటు హైదరాబాద్‌లో ఓ మంచి ప్రదేశంలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
   Sports Updates: మరో 3 రోజుల్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

   Sports Updates: మరో 3 రోజుల్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

   2022-06-01  Sports Desk
   ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. హర్యానాలోని పంచకులాలో జరిగే ఈ క్రీడోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 4 నుంచి జూన్ 13వ తేదీ వరకు యూత్ గేమ్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో 5 సాంప్రదాయ క్రీడలకు కూడా చోటు కల్పించారు. గట్కా కలరిపయట్టు, మల్‌కంబ్, యోగాసన, తాంగ్ తా వంటి క్రీడలు ఈ సారి పోటీల్లో జతకలిశాయి.
   Sports Updates: పురుషుల హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం

   Sports Updates: పురుషుల హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం

   2022-06-01  Sports Desk
   హాకీ ఆసియాకప్‌లో టీమిండియా పురుషుల హాకీ జట్టును దురదృష్టం వెంటాడింది. గోల్స్‌ తేడా కారణంగా టీమిండియా ఫైనల్‌ చేరకుండానే సూపర్‌-4లోనే ఇంటిబాట పట్టింది. సూపర్‌-4లో భాగంగా మే 31న దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను భారత్‌ 4-4తో డ్రా చేసుకుంది. దీంతో భారత్‌, కొరియా జట్లు చెరో ఐదు పాయింట్లు సాధించాయి. అయితే జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మలేషియా విజయం సాధించడం భారత్‌ అవకాశాలను దెబ్బ తీసింది.
   ఎంఎస్ ధోనీపై బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదైంది ?

   ఎంఎస్ ధోనీపై బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదైంది ?

   2022-06-01  News Desk
   ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కమాండ్‌ను తీసుకుని.. ఫినిషర్‌ అనే పదానికి నిర్వచనం చెబుతూ పలుమార్లు మంచి ఇన్నింగ్స్‌లతో మెరిసిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి చర్చల్లో నిలిచాడు. తాజాగా ఆయనపై బీహార్‌లో కేసు నమోదైంది. బీహార్‌లోని బెగుసరాయ్‌లో మిస్టర్ కూల్‌పై చెక్ బౌన్స్ కేసు నమోదైంది.
   Sports: విరాట్ కోహ్లీపై షోయబ్ అక్తర్ ప్రశంసలు

   Sports: విరాట్ కోహ్లీపై షోయబ్ అక్తర్ ప్రశంసలు

   2022-05-31  Sports Desk
   ఐపీఎల్ టోర్నీలో దారుణంగా విఫలమైన కోహ్లీకి అనూహ్య మద్దతు లభించింది. పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీని గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్‌టైమ్స్ అంటూ ప్రశంసిచాడు. ఒక పాకిస్తానీ పౌరుడిగా తాను ఈ మాట చెబుతున్నానని అన్నాడు. కోహ్లీ విమర్శకలపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ గత రికార్డులను ఓ సారి గుర్తుచేశాడు.
   ఐపీఎల్ అభిమానుల మనసు దోచుకున్న మిస్టరీ గర్ల్స్ వీరే..

   ఐపీఎల్ అభిమానుల మనసు దోచుకున్న మిస్టరీ గర్ల్స్ వీరే..

   2022-05-31  News Desk
   74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైనల్ ముగిసింది. 10 ఫ్రాంఛైజీలు పోటీపడిన ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్(GT vs RR) టగ్ ఆఫ్ వార్‌లో.. గుజరాత్ కప్ దక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్ మొత్తం మీద స్టేడియంలలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటైన IPL మిస్టరీ గర్ల్స్ క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకర్షించారు.
   I.P.L Updates: గ్రౌండ్ స్టాఫ్‌కు బీసీసీఐ నజరానా 

   I.P.L Updates: గ్రౌండ్ స్టాఫ్‌కు బీసీసీఐ నజరానా 

   2022-05-30  Sports Desk
   ఐపీఎల్‌ టోర్నీ విజేతగా నిలిచిన గుజరాత్ జట్టు...తమ సొంత గడ్డపై విక్టరీ ర్యాలీ చేపట్టనుంది. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోనుంది. ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత గుజరాత్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. తమ జట్టుకు గత రెండు నెలలుగా మద్దతుగా నిలిచిన అభిమానులకు అభివాదాలు తెలిపేందుకు నేరుగా వారిని కలిస్తే బాగుంటుందని భావించిన జట్టు యాజమాన్యం విక్టరీ ర్యాలీని ప్లాన్ చేస్తోంది
   Sports Updates: వివాహబంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు

   Sports Updates: వివాహబంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు

   2022-05-30  Sports Desk
   టీమిండియాతో ఆస్ట్రేలియా జట్టు తలపడనుంది. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ గేమ్స్ కోసం ఏర్పాట్ల్ శరవేగంగా జరుగుతున్నాయి. ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ ఆసక్తికరంగా మారింది. భారత జట్టు ఫైనల్స్ కి చేరాలంటే కొరియాను ఓడించాల్సిందే. ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాలను మరింత డిటైల్డ్ గా తెలుసుకుందాం.
   ఆ తప్పిదాలే రాజస్థాన్ జట్టు కొంపముంచాయి...అభిమానుల ఆగ్రహం

   ఆ తప్పిదాలే రాజస్థాన్ జట్టు కొంపముంచాయి...అభిమానుల ఆగ్రహం

   2022-05-30  Sports Desk
   ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ జట్టు ఓటమి చెందింది. 7 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. తుదిపోరులో చేతులెత్తేసింది. ఫైనల్‌ మ్యాచ్‌లో చేసిన తప్పిదాలే ఆ జట్టు కొంపముంచాయని ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా వదులుకున్నారని మండిపడుతున్నారు. నాలుగు పొరపాటు నిర్ణయాలు ఆ జట్టు ఓటమికి కారణాలుగా చెబుతున్నారు.
   I.P.L 2022 Ended: ముగిసిన క్రికెట్ పండుగ

   I.P.L 2022 Ended: ముగిసిన క్రికెట్ పండుగ

   2022-05-30  Sports Desk
   ఐపీఎల్‌ 2022 సీజన్ ముగిసింది. క్రికెట్ అభిమానులకు రెండు నెలల పాటు మజాను అందించింది. మూర్చి 26న ప్రారంభమైన 15వ సీజన్ మే 29 వరకు జరిగింది. కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అరంగేట్రం చేశాయి. మొత్తంగా 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆ పది జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచుల్లో నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్నాయి. మే 22 వరకు లీగ్‌ దశ మ్యాచులు జరిగాయి.