ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ పోరు ముగిసింది. ఫైనల్ పోరులో ఎవరు ఆడేది క్లారిటీ వచ్చేసింది. ఈ టోర్నీలో విజేత ఎవరో మరికొన్ని గంటట్లో తేలనుంది. తొలి సెమీస్ పోరులో రఫెల్ నాదల్ నెగ్గాడు. ఆట మధ్యలో జ్వెరెవ్ గాయపడడంతో నాదల్ ఫైనల్ చేరుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తొలి సెట్‌ను నాదల్ అతి కష్టం మీద నెగ్గాడు. రెండో సెట్ కూడా హోరాహోరీగా జరుగుతున్న వేళ...జ్వెరెవ్ ఆడలేని పరిస్థితి నెలకొంది. ఇద్దరి స్కోర్లు సమంగా నిలిచాయి. 6-6 వద్ద ఉన్నప్పుడు సెకండ్ సెట్ నిలిచిపోయింది. మ్యాచ్ ఆపాల్సి వచ్చింది. దీంతో రఫెల్ నాదల్ ఫైనల్ చేరినట్లు స్పష్టమయింది.
ఇక రెండో సెమీస్‌లో కాస్పర్ రుడ్, మారిన్ సిలిక్లు హోరాహోరీగా తలపడ్డారు. చివరకు కాస్పర్ రుడ్ పైచేయి సాధించాడు. 3-6, 6-4,6-2,6-2 తేడాతో గెలిచి ఫైనల్ చేరుకున్నాడు. తొలి సెట్ 3-6 తేడాతో ఓడిపోయిన కాస్పర్..వెంటనే తేరుకున్నాడు. ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా చెలరేగి ఆడాడు. వరుసగా మూడు సెట్లు గెలిచాడు. తుది పోరుకు దూసుకుపోయాడు. ఆదివారం రోజును రఫెల్ నాదల్, కాస్పర్ రుడ్లో ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. అమీతుమీ తేల్చుకోనున్నారు.
లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహించాలనే విషయమై ఐసీసీ తర్జన భర్జన పడుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణపై ఐసీసీ దృష్టి సారిస్తోంది. తుది పోరును లార్డ్స్ మైదానంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఐకానిక్ వెన్యూలో ఫైనల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయమై ఐసీసీ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. వచ్చే నెలలో జరిగే వార్షిక సమావేశంలో ఐసీసీ అధికారులు ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
చెస్ ఫెడరేషన్‌కు మధ్యంతర సెక్రటరీ
ఆలిండియా చెస్ ఫెడరేషన్‌కు కొత్త సెక్రటరీ నియామకం జరిగింది. AICF అధ్యక్షుడు సంజయ్ కపూర్, విప్నేష్ భరద్వాజ్‌ను మధ్యంతర సెక్రటరీగా నియమించారు. చెన్నైలోని మహాబలిపురంలో జూన్ 11న జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో అనేక విషయాలపై క్లారిటీ రానుంది. ఇటీవలే భరత్ సింగ్ చౌహాన్ ఎంపికపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నియామకంపై స్టే ఇచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విప్నేష్ భరద్వాజ్‌ను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు చెస్ ఫెడరేషన్‌కు ఉపాధ్యక్షుడిగా ఉన్న భరద్వాజ్‌ను నియమ నిబంధలకు అనుగుణంగానే ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు త్వరలో జరగనున్న చెస్ ఒలింపియాడ్‌పై ఎటువంటి ప్రభావం చూపవని నిర్వాహకులు తెలిపారు. మహాబలిపురంలో జరగనున్న 44వ చెస్ ఒలింపియాడ్‌కి భరత్ సింగ్ చౌహాన్.. టోర్నమెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతారని నిర్వాహకులు స్పష్టం చేశారు. చెస్ ఫెడరేషన్ సెక్రటరీగా చౌహాన్ నియామకం చెల్లదని R.N.డోంగ్రే కోర్టును ఆశ్రయించడంతో పరిస్థితులు తలకిందులు అయ్యాయి.
కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక సూచనలు
దేశంలో ఉన్న జాతీయ క్రీడా సమాఖ్యలకు ఆర్ధిక సాయం తాత్కాలికంగా ఆపివేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ స్పోర్డ్స్ కోడ్‌ను పునరుద్ధరించే వరకు సమాఖ్యలకు ఆర్ధిక సాయంతో మరే ఇతర సాయం అందించవద్దని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు సంయమనం పాటించాలని కోరింది.
నాదల్‌తో తలపడనున్న కాస్పర్ రుడ్
రెండో సెమీస్‌లో కాస్పర్ రుడ్, మారిన్ సిలిక్లు హోరాహోరీగా తలపడ్డారు. చివరకు కాస్పర్ రుడ్ పైచేయి సాధించాడు. 3-6, 6-4,6-2,6-2 తేడాతో గెలిచి ఫైనల్ చేరుకున్నాడు.
✨ First-ever Grand Slam final ✨
Man of the day, @CasperRuud98 🇳🇴 pic.twitter.com/aKSM64PSAk— Roland-Garros (@rolandgarros) June 3, 2022