collapse
...
క్రీడలు
  I.P.L 2022: ముంబై చేతిలో బెంగళూర్ ప్లే ఆఫ్ అవకాశాలు

  I.P.L 2022: ముంబై చేతిలో బెంగళూర్ ప్లే ఆఫ్ అవకాశాలు

  2022-05-21  Spiritual Desk
  ఐపీఎల్ 2022 చివరి దశకు చేరుకుంది. లీగ్‌ మ్యాచులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్లే ఆఫ్ చేరిన మూడు జట్లపై క్లారిటీ వచ్చేసింది. నాల్గవ స్థానంలో ఎవరు ఉంటారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ప్రస్తుతం విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటోంది. అన్ని లీగ్‌ మ్యాచులు ఆడినప్పటికీ ఇంకా ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
  Chessable Masters:ప్రపంచ చెస్ ఛాంపియన్ కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు..

  Chessable Masters:ప్రపంచ చెస్ ఛాంపియన్ కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు..

  2022-05-21  News Desk
  చెస్బుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో భారత కుర్రాడు సత్తా చాటాడు. మూడు నెలల వ్యవధిలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రగ్నానంద.. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌పై రెండోసారి విజయాన్ని సాధించాడు.
  I.P.L 2022: చెన్నైను చిత్తుచేసిన రాజస్థాన్

  I.P.L 2022: చెన్నైను చిత్తుచేసిన రాజస్థాన్

  2022-05-21  Sports Desk
  చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై జట్టు చేతులెత్తేసింది. రాజస్థాన్ చేతిలో ఓటమి పాలయింది. యశస్వి జైస్వాల్‌, రవిచంద్రన్ అశ్విన్‌లు చెలరేగి ఆడి..తమ జట్టుకు విజయం అందించారు. 5 వికెట్ల తేడాతో చెన్నై జట్టుపై విజయకేతనం ఎగురవేశారు. CSK జట్టు నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే చేరుకున్నారు
  I.P.L Updates: వచ్చే ఐపీఎల్‌లోనూ ఆడ‌తా : మహేంద్ర సింగ్ ధోనీ

  I.P.L Updates: వచ్చే ఐపీఎల్‌లోనూ ఆడ‌తా : మహేంద్ర సింగ్ ధోనీ

  2022-05-21  Sports Desk
  C.S.K చివరి లీగ్‌ మ్యాచ్‌ ముందు ధోనీ రిటైర్‌మెంట్‌పై అనేక ఊహాగానాలు వినిపించాయి. తలైవాకు ఇదే చివరి మ్యాచ్‌ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడిచింది. వీటన్నింటికీ ధోనీ ఫుల్‌స్టాప్ పెట్టాడు. చెన్నై అభిమానుల కోసమైనా గ్రౌండ్‌లో ఆడాలి...లేకుంటే వారికి అన్యాయం చేసినవాడినవుతానని ధోనీ అన్నాడు. 
  Thailand Open: థాయిలాండ్‌ ఓపెన్‌లో దూసుకుపోతున్న సింధు

  Thailand Open: థాయిలాండ్‌ ఓపెన్‌లో దూసుకుపోతున్న సింధు

  2022-05-20  Sports Desk
  భారత బ్యాడ్మింటన్ సెన్సేషన్‌ పివి సింధు థాయిలాండ్‌ ఓపెన్‌లో దూసుకుపోతోంది. క్వార్టర్స్ లో తన చిరకాల ప్రత్యర్ది యమగుచిపై విజయం సాధించింది. సెమీస్‌లోకి దూసుకుపోయింది. వరల్డ్ నెంబర్‌ వన్ ప్లేయర్ యమగుచిపై 21-15, 20-22, 21-13 తేడాతో విజయం సాధించింది
  బాక్స‌ర్ నిఖత్ జరీన్ కు అభినంద‌న‌ల వెల్లువ‌

  బాక్స‌ర్ నిఖత్ జరీన్ కు అభినంద‌న‌ల వెల్లువ‌

  2022-05-20  Sports Desk
  మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక స్వర్ణం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ను యావ‌త్ భార‌తం ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతోంది
  ఆదాయంలో టాప్ 10 క్రీడాకారిణులు వీళ్లే

  ఆదాయంలో టాప్ 10 క్రీడాకారిణులు వీళ్లే

  2022-05-20  News Desk
  ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే టాప్‌ పది మంది మహిళా అథ్లెట్లలో జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు. ఆమె ఆదాయం 57 మిలియన్‌ డాలర్లు. కాగా టాప్‌ పది మంది మహిళా అథ్లెట్ల ఆదాయం మొత్తం కలిపితే పన్ను చెల్లించడానికి ముందు 2021లో 167 మిలియన్‌ డాలర్లుగా తేలింది.
  I.P.L 2022 గుజరాత్‌ను మట్టికరిపించిన బెంగళూర్

  I.P.L 2022 గుజరాత్‌ను మట్టికరిపించిన బెంగళూర్

  2022-05-20  Sports Desk
  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కీలక సమయంలో తమ సత్తా చాటింది. గుజరాత్ జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలిత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన బెంగళూర్ ..లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 73 పరుగులు చేశాడు. కెప్టెన్ డ్యూప్లెసిస్, గ్లెన్ మాక్స్ వెల్‌ కూడా పరుగుల వరద పారించారు
  Boxing World Champion: వరల్డ్ ఛాంపియన్‌కు అభినందనల వెల్లువ

  Boxing World Champion: వరల్డ్ ఛాంపియన్‌కు అభినందనల వెల్లువ

  2022-05-20  Sports Desk
  బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించిన నిఖత్ జరీన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు ఈ యంగ్‌ బాక్సింగ్ సెన్సేషన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అభిమానులు సైతం నిఖత్ జరీన్ విజయాన్ని ఆశ్వాదిస్తున్నారు. భారత దేశానికి గర్వకారణమంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
  ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్ గా తెలంగాణ బిడ్డ నిఖత్ జ‌రీన్‌

  ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్ గా తెలంగాణ బిడ్డ నిఖత్ జ‌రీన్‌

  2022-05-20  Sports Desk
  భారత్ తరుపున ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో స్వ‌ర్ణం అందుకున్న తెలంగాణ బిడ్డ నిఖత్‌ జరీన్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.
  Boxing:నిఖత్ జరీన్‌కు బంగారు పతకం

  Boxing:నిఖత్ జరీన్‌కు బంగారు పతకం

  2022-05-19  Sports Desk
  భారత బాక్సర్ నిఖత్ జరీన్ వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. ఇస్తాంబుల్‌లో జరిగిన పోటీల్లో థాయిలాండ్‌కి చెందిన జిట్‌పోంగ్ జుటామాస్‌ను 5-0 తేడాతో ఓడించింది. 52 కిలోల విభాగంలో సంచలన విజయం సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన ఐదవ భారత బాక్సర్‌గా అవతరించింది. 
  Sports Updates: గోపీచంద్‌ వల్లే ఛాంపియన్ షట్లర్లు తయారయ్యారు

  Sports Updates: గోపీచంద్‌ వల్లే ఛాంపియన్ షట్లర్లు తయారయ్యారు

  2022-05-19  Sports Desk
  థామస్ కప్ హీరో హెచ్‌.ఎస్. ప్రణయ్ తన బ్యాడ్మింటన్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఓ సుదీర్ఘమైన లేఖ రాసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. థామస్ కప్‌లో విజయం సాధించడం ద్వారా తన చిన్ననాటి కల సాకారమయిందని తెలిపాడు. బ్యాడ్మింటన్‌ కోచ్‌గా గోపిచంద్‌ వచ్చిన నాటి నుంచి భారతదేశంలో పరిస్థితులు మారాయని గుర్తుచేసుకున్నాడు