collapse
...
క్రీడలు
  చెన్నై ఓటమికి కారకులెవరు ?

  చెన్నై ఓటమికి కారకులెవరు ?

  2022-04-26  Sports Desk
  ఐపీఎల్ 38 వ మ్యాచ్‌లో C.S.K జట్టు తడబడింది.188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టు మొదటి నుంచే ఆపసోపాలు పడింది. జట్టు స్కోర్ 10 పరుగుల వద్ద ఓపెనర్ రాబిన్ ఊతప్ప ఔటయ్యాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. జట్టు స్కోర్ 30 పరుగులు ఉన్నప్పుడు సాంట్‌నర్ ఔటయ్యాడు. సాంట్‌నర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శివందుబే కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు.
  ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు విజయం

  ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు విజయం

  2022-04-26  Sports Desk
  IPL 38 వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఛేజింగ్ చేసింది చెన్నై జట్టు తడబడింది. 11 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. తొలిత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 188 పరుగులు టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై జట్టు విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.
  సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ

  సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ

  2022-04-25  Sports Desk
  లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విజయం సాధించింది. ముంబై జట్టుపై 36 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానానికి చేరింది. వరుసగా 8వ ఓటమిని మూటగట్టుకున్న ముంబై జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు ముగిసినట్టే కనిపిస్తున్నాయి.
  బోరియా ముజుందార్‌పై రెండేళ్ల నిషేధం

  బోరియా ముజుందార్‌పై రెండేళ్ల నిషేధం

  2022-04-24  Sports Desk
  తొలుత వృద్ధిమాన్ సాహా సంఘటనకీ తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించిన బొరియా మంజుదర్, ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ మెసేజ్‌లు పంపింది... తానేనని అయితే తన మెసేజ్‌లను ఎడిట్ చేసి మార్చేశారని ఆరోపించాడు... అయితే ఈ బీసీసీఐ విచారణ అనంతరం మంజుదర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తేల్చారు అధికారులు.
  సెంచరీతో కదం తొక్కిన కేఎల్ రాహుల్

  సెంచరీతో కదం తొక్కిన కేఎల్ రాహుల్

  2022-04-24  Sports Desk
  లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ మరోసారి తన సత్తా చాటాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. 62 బంతుల్లో 103 పరుగులు చేశాడు. 12 బౌండరీలు, నాలుగు భారీ సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహకరించాడు
  క్రికెట్ గాడ్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

  క్రికెట్ గాడ్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

  2022-04-24  International Desk
  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు 49వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేశం తరపున సుదీర్ఘంగా ఆడిన సచిన్ రికార్డులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
  ఘనంగా ప్రారంభమైన ఖేలో ఇండియా క్రీడాపోటీలు

  ఘనంగా ప్రారంభమైన ఖేలో ఇండియా క్రీడాపోటీలు

  2022-04-24  Sports Desk
  ఖేలో ఇండియా యూనివర్సిరటీ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బెంగళూర్లోని కంఠీరవ స్టేడియంలో ఈ క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడోత్సవంతో దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు.
  హ్యాట్రిక్ సాధించిన రవికుమార్ దహియా

  హ్యాట్రిక్ సాధించిన రవికుమార్ దహియా

  2022-04-24  Sports Desk
  ఆసియా ఛాంపియన్‌షిప్‌ రెజ్లింగ్ పోటీల్లో రవికుమార్‌ దహియా మరోసారి తన సత్తా చాటాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో వరుసగా ఈ పోటీల్లో మూడోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు
  సెర్బియా ఓపెన్ టోర్నమెంట్‌ ఫైనల్స్ లో జకోవిచ్

  సెర్బియా ఓపెన్ టోర్నమెంట్‌ ఫైనల్స్ లో జకోవిచ్

  2022-04-24  Sports Desk
  టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్‌ సెర్బియా ఓపెన్ టెన్నిస్ ఫైనల్స్‌ లో ప్రవేశించాడు. సెమీస్‌లో తన ప్రత్యర్ధిని మట్టి కరిపించి తుదిపోరుకు సిద్ధమయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన ఆండ్రూ రుబ్‌లెవ్‌తో తలపడనున్నాడు.
  వరుస విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్

  వరుస విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్

  2022-04-24  Sports Desk
  బెంగళూర్ జట్టు వెన్ను విరిచి కీలకమైన ముగ్గురు బ్యాటర్లను తక్కువ పరుగులకే పెవిలియన్‌కు పంపిన మార్కో జాన్‌సెన్‌కు ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. మార్కో జాన్‌సెన్‌ బెంగళూర్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఓపెనర్లు డ్యూప్లెసిస్, అనుజ్ రావత్‌తో పాటు ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీను కూడా వరుసగా పెవిలియన్‌కు పంపాడు
  ఉత్కంఠ పోరులో కోల్‌కతా పరాజయం

  ఉత్కంఠ పోరులో కోల్‌కతా పరాజయం

  2022-04-24  Sports Desk
  I.P.L టోర్నీ 2022లో భాగంగా శనివారం రెండు మ్యాచులు జరిగాయి. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ జట్టు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టుపై గెలుపొందింది. రెండవ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌..బెంగళూర్‌ జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
  టాప్ పొజిషన్‌లో రాజస్థాన్ రాయల్స్

  టాప్ పొజిషన్‌లో రాజస్థాన్ రాయల్స్

  2022-04-23  Sports Desk
  ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. 10 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో నిలిచింది.