collapse
...
క్రీడలు
  ఏషియా బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు హవా

  ఏషియా బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు హవా

  2022-04-30  Sports Desk
  బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత షట్లర్ పివి సింధు అదరహో అనిపిస్తోంది. ప్రత్యర్ధులను ఓడిస్తూ సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్ లో జరిగిన పోరులో చైనా ప్లేయర్ హీ బింగ్ జియావోతో హోరాహోరీగా తలపడింది. గంటా 16 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ పోరులో 21-9, 13-21, 21-19 తేడాతో సింధు విజయం సొంతం చేసుకుంది.
  టెన్నిస్ దిగ్గజానికి రెండున్నరేళ్ల జైలు శిక్ష

  టెన్నిస్ దిగ్గజానికి రెండున్నరేళ్ల జైలు శిక్ష

  2022-04-30  Sports Desk
  టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెక్కర్ చిక్కుల్లో పడ్డాడు. జైలు ఊచలు లెక్కపెట్టనున్నాడు. బెక్కర్.. బ్యాంకు మోసాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. రెండున్నరేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ నెల మొదట్లో బెక్కర్‌పై నాలుగు అభియోగాలు నమోదయ్యాయి.
  I.P.L 2022: పాత ఫ్రాంచైజీలకు చుక్కలు చూపిస్తున్న ప్లేయర్లు

  I.P.L 2022: పాత ఫ్రాంచైజీలకు చుక్కలు చూపిస్తున్న ప్లేయర్లు

  2022-04-29  Sports Desk
  ఐపీఎల్ టోర్నీ 2022లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొంత మంది ప్లేయర్లు కొన్ని జట్లపై రెచ్చిపోయిమరీ ఆడుతున్నారు. మిగతా జట్ల విషయంలో కాస్త తగ్గుతున్నప్పటికీ...తమ పాత ఫ్రాంచైజీలపై చెలరేగుతున్నారు. తమను తక్కువవుగా అంచనా వేసినందుకు కసి తీర్చుకుంటున్నారు.
  ఉమ్రాన్ మాలిక్ భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడా

  ఉమ్రాన్ మాలిక్ భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడా

  2022-04-29  Sports Desk
  పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ టోర్నీ 2022లో అదరగొడుతున్నాడు. కీలక సమయంలో జట్టును ఆదుకుంటున్నాడు. తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టు బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. దీంతో పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
  I.P.L 2020: కళ్లు చెదిరే క్యాచులు

  I.P.L 2020: కళ్లు చెదిరే క్యాచులు

  2022-04-29  Sports Desk
  అద్భుతమైన బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సులతో ప్లేయర్లు అలరిస్తున్నారు. బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. వికెట్లు పడగొడుతున్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఈ విన్యాసాలకు కొదవ లేదు. అద్భుతమైన క్యాచులు చూసే అవకాశం మాత్రం ఇప్పటి వరకు కలగలేదు. ఐపీఎల్ మ్యాచ్‌ 41లో ఆ అవకాశం ప్రేక్షకులకు కలిగింది.
  I.P.L Match 41 : ఢిల్లీ విజయం..కోల్‌కతా పరాజయం

  I.P.L Match 41 : ఢిల్లీ విజయం..కోల్‌కతా పరాజయం

  2022-04-29  Sports Desk
  కోల్‌కతా టీమ్ మరోసారి ఓటమి పాలయింది. ఢిల్లీ చేతిలో పరాజయం పాలయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానానికి దిగజారింది. ప్లే ఆఫ్ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయింది. కేపిటల్స్ జట్టు ముందు చతికిల పడింది.
  I.P.L. 2022: టాప్ పొజిషన్‌కు చేరిన గుజరాత్

  I.P.L. 2022: టాప్ పొజిషన్‌కు చేరిన గుజరాత్

  2022-04-28  Sports Desk
  ఐపీఎల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 40 మ్యాచులు పూర్తయ్యాయి. కొన్ని మ్యాచులు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. చివరి ఓవర్‌ వరకు ఫలితం తేలకుండా అభిమానులను అలరిస్తున్నాయి. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌ ఫలితం ద్వారా పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రభావం కనీసం 4 జట్లపై పడుతోంది.
  I.P.L 2022 : గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ

  I.P.L 2022 : గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ

  2022-04-28  Sports Desk
  I.P.L టోర్నీలో భాగంగా జరిగిన 40 వ మ్యాచ్‌ క్రికెట్ అభిమానులకు మంచి మజా అందించింది. చివరి ఓవర్‌ వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టును విజయం వరించింది. విజయం సాధించాలంటే చివరి ఓవర్‌లో 22 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో క్రీజులో ఉన్న రాహుల్ తెవాటియా,రషీద్ ఖాన్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జట్టును గెలిపించారు
  I.P.L 2022: టాప్ పొజిషన్‌కి చేరిన రాజస్థాన్ రాయల్స్

  I.P.L 2022: టాప్ పొజిషన్‌కి చేరిన రాజస్థాన్ రాయల్స్

  2022-04-27  Sports Desk
  ఐపీఎల్ 2022 టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలిచింది. పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కు చేరింది. ఇప్పటి వరకు 8 మ్యాచులాడిన ఆ జట్టు 6 విజయాలు సాధించి 12 పాయింట్లు దక్కించుకుంది.
  ఐపీఎల్ పోరులో ఏ ఏ జట్లు ముందున్నాయో తెలుసా ?

  ఐపీఎల్ పోరులో ఏ ఏ జట్లు ముందున్నాయో తెలుసా ?

  2022-04-26  Sports Desk
  I.P.L 2022 రసవత్తరంగా సాగుతోంది. సగానికిపైగా మ్యాచులు పూర్యయ్యాయి. ఛాంపియన్ జట్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాయి. కొత్త జట్లు ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నాయి. అనూహ్యంగా విజృంభిస్తున్నాయి. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఆ యా జట్లు ఏ విధంగా ఆడాయో ఓ సారి చూద్దాం. టాప్‌ 5లో నిలిచిన జట్ల గురించి తెలుసుకుందాం.
  చెన్నై ఓటమికి కారకులెవరు ?

  చెన్నై ఓటమికి కారకులెవరు ?

  2022-04-26  Sports Desk
  ఐపీఎల్ 38 వ మ్యాచ్‌లో C.S.K జట్టు తడబడింది.188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టు మొదటి నుంచే ఆపసోపాలు పడింది. జట్టు స్కోర్ 10 పరుగుల వద్ద ఓపెనర్ రాబిన్ ఊతప్ప ఔటయ్యాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. జట్టు స్కోర్ 30 పరుగులు ఉన్నప్పుడు సాంట్‌నర్ ఔటయ్యాడు. సాంట్‌నర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శివందుబే కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు.
  ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు విజయం

  ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు విజయం

  2022-04-26  Sports Desk
  IPL 38 వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఛేజింగ్ చేసింది చెన్నై జట్టు తడబడింది. 11 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. తొలిత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 188 పరుగులు టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై జట్టు విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.