collapse
...
Home / బిజినెస్ / మౌలికవసతులు / Super Highway: భారీ రోడ్డు ప్రాజెక్టు భారత్‌మాల - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News fo...

Super Highway: భారీ రోడ్డు ప్రాజెక్టు భారత్‌మాల

2021-12-23  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

nitin g (2)
కేంద్రప్రభుత్వం భారత్ మాల పరియోజన స్కీం ఫేజ్‌- 1 ద్వారా దేశంలో 19,265 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తుంది. ఈ స్కీం ద్వారా 14.2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం రూ.5,60,216 కోట్లు పెట్టుబడులు పెట్టి  19,265 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తుంది. ప్రతి ఏడాది 5.37 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. ఇప్పటికే  6,750 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించారు. మరో 612 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను రూ.13,720 కోట్ల పెట్టుబడులతో నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు బీహార్‌, లో భారత్‌మాల పరియోజన ఫేజ్‌-1 కింద నిర్మిస్తామన్నారు గడ్కరీ. 
జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యాన్ని ఏడాది ప్రాతిపదికన నిర్ణయిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రబుత్వం 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ పేర్కొన్నారు.

భారత్‌ మాల ప్రాజెక్టు అంటే ఏమిటి?     

భారత్ మాల పరియోజన ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం పెట్టుబడులు పెట్టి మెగా రోడ్డు జాతీయ రహదారుల ప్రాజెక్టును దేశంలో నిర్మిస్తుంది. భారత్‌మాల ప్రాజెక్టు ద్వారా కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను వేగవంతంగా పూర్తి దేశవ్యాప్తంగా కనెక్టివిటిని పెంచాలనేది ప్రధాన ఉద్దేశం.

ప్రాజెక్టు వివరాలు     

భారత్‌మాల పరియోజనా ప్రాజెక్టు నేషనల్‌ హైవే డెవలెప్‌మెంట్‌ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డీపీ) ప్రాజెక్టు తర్వాత అతి పెద్ద రెండో ప్రాజెక్టు. భారత్‌మాలా ప్రాజెక్టు కింద నిర్మించే రోడ్డు ప్రాజెక్టు ద్వారా  సరకు రవాణా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శరవేగంగా చేర్చవచ్చు. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం తో పాటు ఇతర విధాలుగా లబ్ది పొందవచ్చు.

భారత్‌మాల అందుబాటులోకి వస్తే సరకు రవాణా వ్యయం బాగా తగ్గుతుంది. దీంతో ఎగుమతులు పెంచుకోవచ్చు.. పెట్టుబడులు పెద్ద ఎత్తున రాబట్టవచ్చునని నితిన్‌ గడ్కరీ చెబుతున్నారు.  ఈ ప్రాజెక్టును అక్టోబర్‌ 25, 2017లో కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్‌మాల ప్రాజెక్టు ద్వారా సరకు రవాణా చార్జీలు సరాసరి 18 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గుతాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా సరకు రవాణాతో పాటు ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి త్వరగా చేరుకోవచ్చు. దీంతో పాటు దేశ ఆర్థికాభివృద్దికి కీలకమైన జాతీయ రహదారులతో పాటు.. ప్రాంతీయ రహదారులను కలుపుతుంది. దేశ సరిహద్దులతో పాటు అంతర్జాతీయ కనెక్టివిటి రోడ్లను నిర్మిస్తుంది. తీర ప్రాంతాలతో పాటు ఓడ రేవులను కలుపుతూ రోడ్లు నిర్మిస్తారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలను కూడా అభివృద్ది చేస్తామని చెప్పారు రోడ్డు రవాణాశాఖమంత్రి నితిన్‌ గడ్కరీ.

భారత్‌మాల ప్రాజెక్టు గుజరాత్‌ నుంచి ప్రారంభమై రాజస్థాన్‌,  అటు నుంచి పంజాబ్‌, జమ్ము-కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌,  దాని కంటే ముందు సిక్కిం, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మిజోరాంలను కలుపుతూ రోడ్డు ప్రాజెక్టులు నిర్మిస్తారు. ఈశాన్య ప్రాంతాల కనెక్టివిటిపై ప్రధాని మోదీ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  విషయానికి వస్తే రాయ్‌పూర్‌ - విశాఖపట్నం కారిడార్‌, ఇండోర్‌- హైదరాబాద్‌ కారిడార్‌, హైదరాబాద్‌ (సూర్యాపేట) -విశాఖపట్టణం  (దేవర్‌పల్లి) కారిడార్‌, నాగ్‌పూర్‌ - విజయవాడ కారిడార్‌. రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రకారం ఫేజ్‌-1 2026 ఆర్థిక సంవత్సరానికి పూర్తి కావచ్చునని అంచనా వేసింది.  అదీ కూడా 2023 ఆర్థిక సంవత్సరానికి ఈ రోడ్డు ప్రాజెక్టులు కాంట్రాక్టుకు ఇస్తేనే అని తేల్చింది.  ఫేజ్‌-1 నిర్మాణానికి రూ.5.35 లక్షల కోట్లు అంచనా వేస్తే ప్రస్తుతం అది కాస్తా రూ.8.5 లక్షల కోట్లకు పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం భూసేకరణలో భారీ జాప్యం కావడమేనని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. 
 



2021-12-23  Business Desk