2022-06-03News Desk నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 13 న తమ ఎదుట హాజరు కావాలని కోరింది. నిజానికి ఈ నెల 2 న హాజరు కావాలంటూ లోగడ నోటీసులు పంపినప్పటికీ తాను విదేశాల్లో ఉన్నందున హాజరు కాలేనని, మరో తేదీని ఏదైనా సూచించాలని రాహుల్ కోరారు. View more
2022-06-03Education Desk నీట్ పీజీ (NEET PG) 2022 ఫలితాలను వైద్య శాస్త్రాల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారు బుధవారం ప్రకటించారు. ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో డాక్టర్ షాగన్ బాత్రా టాపర్గా నిలిచారు. డా. జోసెఫ్, డాక్టర్ హర్షితలు తర్వాత స్థానాల్లో నిలిచారు. View more
2022-06-03News Desk కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. తనకు లభించిన బంపర్ ఆఫర్ ని తిరస్కరించారు. పార్టీలో తన తరువాత నెంబర్ టూ స్థానాన్ని ఇస్తానని అధ్యక్షురాలు సోనియా గాంధీ 'వరం' ఇచ్చినప్పటికీ.. వద్దు వద్దు మేడమ్ అని ఆయన నిష్కర్షగా చెప్పేశారట. అసలు ఆజాద్ ఎందుకు వద్దన్నారు..? View more
2022-06-02News Desk దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుందా? డైలీ కేసుల సంఖ్య పెరుగుతుందా? కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన తాజా సూచనలేంటి?వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్నా ముప్పు ఉందా?డాక్టర్లు ఏమంటున్నారు.. View more
2022-06-02News Desk మనీలాండరింగ్ ఫేక్ కేసులో తమ ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టు తరువాత ఇక తమ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా తనకీ సమాచారం తెలిసిందని ఆయన చెప్పారు. View more
2022-06-01News Desk కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎప్పుడో పాతకాలం నాటి నేషనల్ హెరాల్డ్ కేసులో వీరికి వీటిని జారీ చేశారు. జూన్ 8 న సోనియా, జూన్ 2 న రాహుల్ తమ ముందు హాజరు కావాలని వీటిలో పేర్కొన్నారు. అయితే తాను విదేశాల్లో ఉన్నందున తనకు మరికొంత వ్యవధి కావాలని రాహుల్ గాంధీ కోరారని పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా తెలిపారు. View more
2022-06-01News Desk ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి.. బిజెపి యేతర ప్రత్యామ్నాయ శక్తులను ఏకం చేసే పనిలో కేసీఆర్ చురుకు గా వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం దీనిని తేలికగా తీసుకున్నా, ఇప్పుడిప్పుడే భారతీయ జనతా పార్టీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే గత ఎనిమిది ఏళ్ళ కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. View more
2022-06-01News Desk దేశంలో త్వరలో జనాభా అదుపు చట్టం అమలు కానుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. ఇండియాలో జనాభా పెరిగిపోతోందని, దీన్ని కంట్రోల్ చేసేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఓ పాలసీని రూపొందిస్తోందని ఆయన చెప్పారు. ఈ పాలసీ మేరకు చట్టం రానుందన్నారు. View more
2022-05-31News Desk రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ నిప్పులు చెరిగారు. ఎగువసభ ఓ 'పార్కింగ్ లాట్' గా మారిపోయిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాల క్రితం రాజ్యాంగం ప్రవచించినట్టు ఈ సభ తన బాధ్యతలను నిర్వర్తించడం మానివేసిందని వ్యాఖ్యానించారు. View more
2022-05-31News Desk హవాలా మనీ లాండరింగ్ కేసులో ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ని ఈడీ అరెస్టు చేయడం వెనుక బీజేపీ హస్తముందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. ఇది ఎనిమిదేళ్ల కిందటి ఫేక్ కేసని, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఆయనను అరెస్టు చేయించిందని సిసోడియా అన్నారు. View more
2022-05-31News Desk రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది. . అయితే ఇది దాదాపు 'కలగూరగంప' లా ఉందన్నది విశ్లేషకుల భావనగా కనబడుతోంది. . ఒకవిధంగా దీన్ని 'రాజభవనం కుట్ర' గా వారు అభివర్ణిస్తున్నారు. పెద్దల సభలో స్థానాలకు వీరిని ఎంపిక చేయడంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. అసలు పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను పరిగణనలోకి తీసుకున్నారా అని వీరు సందేహిస్తున్నారు. View more
2022-05-30News Desk ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి తాను రిటైర్ కాగా ఆ వచ్చిన సొమ్మునంతా బాలికల విద్యకు విరాళంగా ఇచ్చాడని ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రజలంతా ఇలాంటి సేవాగుణాన్ని అలవరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం తన 'మన్ కీ బాత్' రేడియో ప్రసంగంలో ఆయన..రామ్ భూపాల్ రెడ్డి అనే ఈ వ్యక్తి .. సుకన్య సమృద్ధి యోజన పథకానికి 25 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడన్నారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy