collapse
...
Home / బిజినెస్ / ఆటోమొబైల్ / Tata Motors: నాలుగో త్రైమాసికంలో తగ్గిన నష్టాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News fo...

Tata Motors: నాలుగో త్రైమాసికంలో తగ్గిన నష్టాలు

2022-05-13  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

tata motors(1)
దేశీయ ఆటో మోబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. నష్టాలను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. క్రమంగా నష్టాలను తగ్గించుకుంటుంది. మార్చి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నష్టం రూ.992.05 కోట్లకు పరిమితమైంది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.7,585.34 కోట్లుగా ఉంది.   మొత్తం కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.88,627.90 కోట్ల నుంచి రూ.78,439.06 కోట్లకు తగ్గింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం రూ.1645.68 కోట్ల నుంచి రూ.413.35 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.13,480.42 కోట్ల నుంచి రూ.17,338.27 కోట్లకు పెరిగింది. తన అనుబంధ సంస్థ అయిన   బ్రిటన్‌ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) 4.8 బిలియన్‌ పౌండ్ల ఆదాయాన్ని అందుకుంది.   అంతర్జాతీయంగా చిప్‌ల కొరత ఏర్పడటంతో 2021-22లో జేఎల్‌ఆర్‌ ఉత్పత్తి భారీగా పడిపోయింది. అయినప్పటికీ కస్టమర్ల డిమాండ్‌ ఉండటంతో భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు ఉన్నాయని జేఎల్‌ఆర్‌ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి బి బాలాజీ వెల్లడించారు.  

*మూలధన వ్యయం అంచనా రూ.6,000 కోట్లు
2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.11,308.76 కోట్లకు తగ్గింది. 2020-21లో నష్టం రూ.13,395.10 కోట్లుగా ఉంది. అదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2,49,794.75 కోట్ల నుంచి రూ.2,78,453.62 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు రూ.5,500 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు ఉంటాయని బాలాజీ తెలిపారు.

*ప్యాసింజర్ వెహికల్స్ లో రాణింపు
ఇండియన్ ప్యాసింజర్ వెహికల్స్  విక్రయాలు మార్చి త్రైమాసికంలో లక్షా 23 వేలుగాఉన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల 7 వేలుగా నమోదయ్యాయి. విద్యుత్‌ వాహనాలు నాలుగో త్రైమాసికంలో  9,100 అమ్ముడు కాగా, పూర్తి ఏడాదిలో 19 వేల 100 అమ్ముడుపోయాయి. ప్యాసింజర్  వెహికల్స్ వ్యాపారంలో మంచి ప్రగతి కనబరచడంతో అత్యధిక త్రైమాసిక, వార్షిక విక్రయాలను నమోదు చేయగలిగినట్లు టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఎండీ శైలేశ్‌ చంద్ర తెలిపారు.  చిప్‌ కొరత, సరఫరా సవాళ్లున్నా..  తమ వాహనాలకు మంచి డిమాండ్ పెరిగుతుందని  ఆయన అభిప్రాయపడ్డారు.  

*జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఆదాయం 4.8 బిలియన్‌ పౌండ్లు
టాటా మోటార్స్ సంస్థకు  చెందిన బ్రిటిష్‌ విభాగమైన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) నాలుగో త్రైమాసికంలో 4.8 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఏడాది కాలంలో 79 వేలకు పైగా వాహనాలను విక్రయించింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జేఎల్‌ఆర్‌ ఆదాయం 7% తగ్గి 18.3 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. మొత్తం రిటైల్‌ అమ్మకాలు 14% తగ్గి 3 లక్షల 76 వేల 381కి చేరాయని కంపెనీ తెలిపింది.

*కరోనా ఎఫెక్ట్ తో ఇబ్బందులు
కరోనా కేసుల నేపథ్యంలో కి చైనాలో లాక్ డౌన్ పెట్టడం మూలంగా కార్ల తయారీ సంస్థలకు ఇబ్బంది కలుగుతున్నట్లు బాలాజీ తెలిపారు. ద్రవ్యోల్బణం, సెమీ కండక్టర్ల కొరత పెద్ద సమస్యగా మారిందన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం పరిస్థితి సైతం సమస్యను తీవ్రతరం చేసిందన్నారు. టాటా మోటార్స్ మరింత ప్రగతి సాధించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎక్కువ డిమాండ్ కారణంగా JLRకు సంబంధించి  దాదాపు లక్షా  68 వేల వాహనాల ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ముడిసరుకు, షిప్పింగ్ ఖర్చుల మూలంగా తమ ఉత్పత్తుల ధర పెంచక తప్పలేదన్నారు.  టాటా మోటార్స్  2022 ఆర్థిక సంవత్సరంలో కనీసం నాలుగు సార్లు ధరలను పెంచాల్సి వచ్చిందన్నారు. ఎలక్ట్రిక్ రంగంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నట్లు బాలాజీ తెలిపారు. 



2022-05-13  News Desk