collapse
...
తెలంగాణ
  కాంగ్రెస్ టీ.. రాహుల్ తో భేటీ..

  కాంగ్రెస్ టీ.. రాహుల్ తో భేటీ..

  2022-03-30  News Desk
  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లతో పాటు, అజారుద్దీన్, మధుయాష్కి, దామోదర రాజనర్సింహ తదితర నాయకులు రేవంత్ రెడ్డి ని కలవనున్నారు.
  KTR: అమెరికా టూర్‌ సక్సెస్‌...రూ.7,500 కోట్ల మేరకు పెట్టుబడులు

  KTR: అమెరికా టూర్‌ సక్సెస్‌...రూ.7,500 కోట్ల మేరకు పెట్టుబడులు

  2022-03-29  News Desk
  తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కెటీ రామారావు వారం రోజుల అమెరికా పర్యటన విజయవంతం అయ్యింది. రాష్ట్రానికి రూ.7,500 కోట్లు రాబట్టారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యాప్‌లో తెలంగాణను పరిచయం చేశారు. దీంతో పాటు అమెరికాలోని భారత సంతతికి చెందిన వారికి యూనికార్న్‌ స్టార్టప్‌లకు కేరాఫ్‌ తెలంగాణ అని గుర్తు చేసి వచ్చారు.
  మక్కజొన్నకు మంచి రోజులు...ఘనంగా జన్యు వైవిధ్య దినోత్సవం

  మక్కజొన్నకు మంచి రోజులు...ఘనంగా జన్యు వైవిధ్య దినోత్సవం

  2022-03-28  News Desk
  మక్కజొన్న సాగు లాభదాయకంగా ఉండేలా పురుగులు, తెగుళ్ళు తట్టుకుని అధిక దిగుబడులు సాధించగల వంగడాలను రూపొందించాలని పలువురు శాస్త్రవేత్లలు సూచించారు. మక్క జొన్న జన్యు వైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
  అంతర కళాశాల పోటీలు ప్రారంభం

  అంతర కళాశాల పోటీలు ప్రారంభం

  2022-03-28  Education Desk
  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర కళాశాలల క్రీడలు, లలిత కళలు, సాంస్కృతిక పోటీలు ఈ రోజు అట్టహాసం గా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్.సాగి సుధీర్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని వీటిని ప్రారంభించారు.
  సేవలు ఆపారు.. చుక్కలు చూపారు..

  సేవలు ఆపారు.. చుక్కలు చూపారు..

  2022-03-24  News Desk
  ప్రభుత్వ పరంగా అందాల్సిన కీలక సేవలు ఒక్కో సందర్భంలో అందకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. తమ హక్కులకు అవాంతరాలు సృష్టించేలా ఎదురవుతున్న ఇబ్బందులు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
  బిజెపి.. ఆట మొదలు పెట్టిందా..

  బిజెపి.. ఆట మొదలు పెట్టిందా..

  2022-03-23  News Desk
  తెలంగాణలో అధికారాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ సామ,వేద ,దండోపాయాలు ఉపయోగిస్తుంది.. మిషన్ 70 పేరుతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. గత ఎన్నికల చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి కెసిఆర్ హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తోంది. ఇందుకు తగిన ప్రయత్నాలను ఇటీవల ముమ్మరం చేసింది.
  నా సమస్య కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి : జగ్గారెడ్డి

  నా సమస్య కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి : జగ్గారెడ్డి

  2022-03-22  News Desk
  కాంగ్రెస్ పార్టీతో నాకు ఇలాంటి విభేదాలు, కష్టాలు లేవని, నా సమస్య కేవలం రేవంత్ రెడ్డి మాత్రమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఆయన అన్నప్పటికీ....ఆయన మాటలు మరెన్నో అర్థాలను ఇచ్చేలా ఉండడం విశేషం.
  జగ్గారెడ్డి.. మీ సేవలు ఇక చాలు..

  జగ్గారెడ్డి.. మీ సేవలు ఇక చాలు..

  2022-03-21  News Desk
  ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి కాలికి ముల్లు లా మారిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సేవలు ఇక చాలు అని అధిష్టానం తీర్మానించింది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు సాగుతున్న జగ్గారెడ్డి ని టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి నిర్ణయం తీసుకుంది.
  ఇక పంజాబ్ తరహా రైతుఉద్యమం: కేసిఆర్

  ఇక పంజాబ్ తరహా రైతుఉద్యమం: కేసిఆర్

  2022-03-21  News Desk
  కేంద్రం మెడలు వంచి వరి ధాన్యం కొనుగోలు చేసేలా పంజాబ్ తరహాలో రైతు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశం లో ఆయన మాట్లాడుతూ రైతు ఉద్యమానికి పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
  నన్ను సస్పెండ్ చేసే దమ్ముందా: అధిష్టానానికి జగ్గారెడ్డి సవాల్..

  నన్ను సస్పెండ్ చేసే దమ్ముందా: అధిష్టానానికి జగ్గారెడ్డి సవాల్..

  2022-03-20  News Desk
  కాంగ్రెస్ అధిష్టానానికి తనను సస్పెండ్ చేసే దమ్ము లేదని.. వేల సస్పెండ్ చేస్తే రోజుకు ఒక నాయకుడు చొప్పున బండారం బయటపెడతానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా జగ్గారెడ్డి, హనుమంతరావు లతో కూడిన  సీనియర్ నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే.
  కాంగ్రెస్ లో మళ్లీ..సీనియర్ల లొల్లి..

  కాంగ్రెస్ లో మళ్లీ..సీనియర్ల లొల్లి..

  2022-03-20  News Desk
  సొంత ఇంట్లో కుంపటి కాంగ్రెస్ కు కొత్త కాదు.. నేతల మధ్య వివాదం పాత విషయమే.. అయితే మరోసారి సీనియర్ల సమావేశం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది. అధిష్టానం వద్దన్నా వినకుండా సీనియర్లు భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ల నేతృత్వంలో లక్డీకాపూల్ లోని అశోక్ హోటల్ లో సీనియర్లు సమావేశమయ్యారు.
  నవ్య కాంతుల మధ్య నరసింహుని దివ్య రూపం..

  నవ్య కాంతుల మధ్య నరసింహుని దివ్య రూపం..

  2022-03-20  News Desk
  కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా నరసింహుని భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తుల కోసం యాదాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.. నవ్య కాంతులను దిద్దుకొని ఆధ్యాత్మిక వేడుకలతో సరికొత్తగా ఆవిష్కరించనుంది. తెలంగాణలోని ప్రాధాన్యత కలిగిన యాదాద్రి క్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పానికి తగిన విధంగా హంగులను అందుకని ఈ ఆలయం ముస్తాబైంది.