6tvnews

collapse
...
Home / ఆధ్యాత్మికం / ఆలయాలు / Temples: విముక్తి కోసం పోరాటం

Temples: విముక్తి కోసం పోరాటం

2022-01-13  Spiritual Desk

venkateshwara (2)
 

భారతదేశంలో ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం చాలా కాలంగా కొనసాగుతోంది. కానీ కొన్ని విభిన్న   బృందాలు పదే పదే దేశంలో ఆలయాల స్వేచ్ఛను కోరుతూ ముందుకొస్తున్నాయి. చివరకి బీజేపీ పాలనలోని కర్నాటకలో వీరి డిమాండ్ కాస్త ఫలించినట్లే కనబడుతోంది. ప్రభుత్వ   నియంత్రణ నుంచి ఆలయాలకు స్వేచ్ఛ కల్పించే కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కర్నాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు.

ప్రభుత్వ బంధనాల్లో హిందూ ఆలయాలు
దేశంలోని హిందూ దేవాలయాలు చాలాకాలంగా ఏకకాలంలో వివిధ శాసనాల ద్వారా ఏలుబడిలో ఉంటూ వస్తు న్నాయి.  ఉదాహరణకు కర్నాటకలో అయిదు విభిన్న చట్టాలు హిందూ ఆలయాల నిర్వహణను చేపడుతున్నా యి. వీటిలో మద్రాస్ హిందూ రిలిజయస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ 1951 పేరుమోసింది. కాగా, 1971లో రాష్ట్రంలోని అని ఆలయాలను ఒకే చట్టం నిర్వహించేలా కర్నాటక హిందూ రిలిజయస్ ఇన్‌సిస్ట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ (హెచ్ఆర్‌సీఈ యాక్ట్)ని ప్రవేశపెట్టారు. ఆలయాలకు సత్పరిపాలన అవసరమనే పేరిట ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం బహుముఖ పాలనా వ్యవస్థను తీసుకొచ్చింది.

కర్నాటకలోని ఆలయాల వ్యవస్థను రాష్ట్రం, జిల్లా స్థాయిల్లోని ధార్మిక పరిషత్‌లు నిర్వహిస్తున్నాయి. ప్రతి ఆల యాన్ని చాలావరకు ప్రభుత్వ పాలనా యంత్రాంగం రూపొందించిన ఆలయ స్థాయి కమిటీల ద్వారా నిర్వహిస్తూ వస్తున్నారు. కర్నాటకలోని లక్షా 80 వేల ఆలయాల్లో 34,500 ఆలయాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ఏ ఆలయాన్నయినా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చేలా ఏకపక్ష అధికారాన్ని హెచ్ఆర్‌సీఈ చట్టంలోని సెక్షన్ 23 కల్పించింది. ఇక సెక్షన్ 25 అయితే ఆలయనిర్వహణను యాజమాన్య కమిటీ చేపట్టే అధికారాన్ని కల్పిస్తోంది. ఆలయ వ్యవస్థ నిర్వహణలో మితిమీరిన నిరంకుశోద్యోగ ప్రభావానికి తోడుగా నిధుల దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో  ఆలయాల స్వేచ్చ అనే భావనను విస్తృతార్థంలో పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.

మఠాలు, మఠాధిపతులు
కొన్ని అతిపెద్ద హిందూ సంస్థలు ప్రభుత్వ నియంత్రణనుంచి స్వేచ్ఛను పొందాయి. దీంతో ఆలయాలకు స్వేచ్చ కల్పించడం వల్ల కలిగే ప్రభావాలను అంచనా వేయటం కష్టమవుతోంది. అదృష్టవశాత్తూ పైన పేర్కొన్న నిరంకుస చట్టం రాష్ట్రంలోని మఠాలకు ఎంతో కొంత స్వేచ్ఛ కల్పించింది. హెచ్ఆర్సీఈ చట్టం నిర్వచనం ప్రకారం మఠాలు మతధార్మిక సంస్థలు. హిందూ మతం, దాని తాత్వికత గురించి బోధిస్తూ, ప్రచారం చేయడమే ఈ మఠాధిపతుల ప్రధాన కర్తవ్యం. మత ధార్మిక సంస్థలుగా పనిచేస్తున్న వాటిలో సమరూపత కారణంగా, క్రమబద్ధీకరణలో లేని మఠాలు కలిగిస్తున్న ప్రభావం నుంచే ఆలయాల స్వేచ్ఛకు చెందిన ప్రాథమిక ప్రభావం వెలుగులోకి వచ్చింది. నిజానికి కొన్ని మఠాలు భారీ స్థాయిలో విద్యా సంస్థలను, ఆరోగ్య సౌకర్యాలను, అత్యవసర సేవలను, నాణ్యమైన పరిశోధనా కేంద్రాలను నిర్వహిస్తూ పేరు పొందుతున్నాయి. ఇవి కల్పిస్తున్న సౌకర్యాలు లక్షలాది మంది ప్రజలపై సానుకూల ప్రభావం కలిగిస్తున్నాయి.

మార్కెట్ వ్యవస్థలు అనేక సందర్భాల్లో సమర్థ ఫలితాలను తీసుకురావడం తెలిసిందే. భారతీయ సమాజంలో ఇప్పటికీ శైశవదశలోనే ఉంటున్న మార్కెట్ వ్యవస్థలకు కుల యంత్రాంగాలు చక్కటి ప్రత్యామ్నాయంగా పని చేస్తున్నాయని ఆర్థిక పరిశోధనా రంగంలో కృషి వెల్లడిస్తోంది. ఉద్యోగాలు పొందడంలో, వలసపోవడంలో, అ త్యంత ప్రతికూల పరిస్థితుల్లో సహాయం అందించడంలో ఈ కులపరమైన నెట్‌వర్క్‌లు వ్యక్తులకు తోడ్పడుతు న్నాయి. మఠాలు కుల యంత్రాంగాలకు సంబంధించి మరింత సమర్థ వ్యక్తీకరణతో పనిచే్స్తూ భక్తులపై సాను కూల ప్రభావం కలిగిస్తున్నాయి.

వీటితో పోలిస్తే ఆలయాలు చాలావరకు సార్వత్రికమైనవి, సమగ్రమైనవి. ఇవి అనేక కులపరమైన యంత్రాం గాలకు అందుబాటులో ఉంటాయి. ఆలయాల ఆధారిత సంస్థలు సూడో-మార్కెట్ నిర్మాణాలను సృష్టించి సమర్థ ఫలితాలను అందిస్తాయి. ఆలయాల నిర్వహణ, ఆలయ వ్యవస్థను మాత్రమే పట్టించుకునేలా హెచ్ఆర్‌సీఈ చట్టం ప్రభుత్వ అంగాలకు అనుమతిస్తోంది. అడ్డూ అదుపూ లేని బ్యూరాక్రాట్లు, అసమర్థ ప్రభుత్వాలు ఆలయా లను నిర్వహిస్తున్నాయి. దీనివల్ల అత్యంత నిరంకుశ చట్టాలు ఉనికిలోకి వస్తూ హైకోర్టులు వాటిని కొట్టిపారే యాల్సిన పరిస్థితులను కల్పిస్తున్నాయి. దీంతో, హిందూ సమాజానికి విస్తృతంగా ఉపయోగపడగలిగే నిధులను సృజనాత్మకంగా ఉపయోగించే స్వేచ్ఛను కానీ, ప్రోత్సాహకాలను కానీ ఆలయ యాజమాన్యం పొందలేకపోతోంది. అయితే మఠాలు మాత్రం కమ్యూనిటీ పరమైన విచక్షణాధికారంతో నిధులను వినియోగించడంలో ఆరోగ్యకరమైన స్వయం ప్రతిపత్తిని చలాయిస్తున్నాయి. యాజమాన్య లోపాలను భక్తులు, మతపరమైన సంప్రదాయాలు సవరిం చేలా, అదుపులో పెట్టేలా మఠాల పనితీరు ఉంటున్నట్లు తెలుస్తుంది.

ప్రభుత్వ యాజమాన్యం వద్దు.. క్రమబద్ధీకరణే ముద్దు
ప్రభుత్వాలు వ్యవస్థల క్రమబద్ధీకరణకు హామీ ఇవ్వాలి తప్ప యాజమాన్య బాధ్యతలు చేపట్టరాదని మఠాల యాజమాన్య వ్యవస్థ నుంచి గ్రహించవచ్చు. ఆలయాలకు స్వేచ్చ భావనను వ్యతిరేకించే వారి భయాలను ఈ మఠాల యాజమాన్య వ్యవస్థ పొగొడతాయి కూడా. స్వల్పకాలిక దృష్టితో చూస్తే స్వయం ప్రతిపత్తి అనేది వ్యతిరేక ఫలితాలను తీసుకురావచ్చు కానీ దీర్ఘ కాలిక దృష్టితో చూస్తే ఆలయాల నిర్వహణకు ఇది మాత్రమే సరైన మార్గం. అయితే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషలిస్టు ధోరణులు స్వేచ్ఛకు సంబంధించిన అనేక రూపాలను విశ్వసించడం లేదు. గతంలో ఆర్థిక, మార్కెట్ స్వేచ్ఛపై ఈ పార్టీ తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించేది. ఇప్పుడు ఆలయాల స్వేచ్ఛపై కూడా ఇది భయాందోళనలను ప్రేరేపిస్తోంది. దీనికి భిన్నంగా హెచ్ఆర్‌సీఈ చట్టం నుంచి విముక్తి కలిగితే ఆలయాలు, కమ్యూనిటీలు సమాజానికి మరింత మేలు కలిగిస్తాయనడంలో సందేహమే లేదు.

హిందూ ఆలయాలకు స్వేచ్ఛ తప్పనిసరి
క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలు మతపరమైన నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉండగా హిందువులకు అలాంటి అవకాశం ఎందుకు ఉండకూడదు. ఆలయాలకు స్వేచ్ఛ కలిగిస్తే అవి ప్రపంచ స్థాయి సంస్థలను నిర్మించగలవు. ఇలాంటి భారీస్థాయి విద్యా సంస్థలే ఆధునిక భారత్‌ని నిర్మించగలవని కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థిగా నా నమ్మకం. కేంబ్రిడ్జికి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన పలు కళాశాలలు మత సంస్థలు నిర్వహిస్తూ వచ్చిన చర్చీలు, సన్యాసాశ్రమాలుగానే ప్రారంభంలో మొదలయ్యాయి. క్రిస్టియన్ మత సంస్థల మద్దతుతోనే ఇవి తర్వాత్తర్వాత శాస్త్రవిజ్ఞాన కేంద్రాలుగా పెరుగుతూ వచ్చాయి.

ఇతర మతాలకు మాత్రమే స్వేచ్ఛ

హిందూ మఠాలకు కూడా ఇదే అవకాశాన్ని కల్పించాలి. ప్రస్తుతం ఉన్న ఎండోమెంట్లు, ఆలయాల భవిష్తత్ తో డ్పాటు అనేవి సమాజంపై బహుముఖ ప్రభావాన్ని కలిగించే సంస్థల నిర్మాణానికి ఉత్తమంగా ఉపయోగపడతాయి. భారతదేశంలోని ఇతర మతాలు ఎప్పటినుంచో ప్రభుత్వం నుంచి స్వేచ్చ పొందాయి. అందుకే దేశంలో క్రిస్టియన్, జైన విద్యా సంస్థలు సమర్థంగా తమను తాము నిర్వహించుకుంటున్నాయి. ముస్లింలకు కూడా మదరసాలు ఉంటూండగా, సిక్కులు కూడా స్వయంప్రతిపత్తితో తమ మత సంస్థలను నిర్వహించుకుంటూ వస్తున్నాయి. ఇతర మతాలు ఇలాంటి స్వయం ప్రతిపత్తితో నడుస్తుండగా హిందూ మతం మాత్రమే ఎందుకు క్రమబద్ధీకరణలో నలుగుతోందన్నది ప్రశ్న. ఆలయాలకు స్వేచ్ఛ కల్పిస్తే హిందూ మతం సమాజానికి మరింత మంచిని అందించే నిర్మాణాలను అభివృద్ధి చేసుకుంటుందనడంలో సందేహమే లేదు.

పెద్ద ఆలయాలకు విముక్తి కల్పించాలి

వీటన్నిటి దృష్ట్యా, ప్రభుత్వం ఆలయాలకు స్వేచ్ఛ కల్పించడాన్న దశలవారీగా అమలు చేయడ గురించి తప్పక ఆలోచించాలి. కర్నాటకలోని ఆలయాలు ఆదాయ రీత్యా గ్రేడ్ ఏ, బీ, సీ లుగా వర్గీకరించబడి ఉన్నా, మెజారిటీ ఆలయాలు (34,500 ఆలయాల్లో 34 వేలు) గ్రేడ్ సి ఆలయాలుగా ఉంటూ సంవత్సరానికి అయిదు లక్షల రూపాయలకంటే తక్కువ ఆదాయన్ని పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత మెరుగైన నిర్వహణ కోసం శక్తివంతమైన, పెద్దవైన గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ ఆలయాలకు స్వేచ్చ కల్పించడమే ఉత్తమం. ఇక గ్రేడ్ సీ ఆలయాలకు సంబంధించిన ఆస్తులను అంచనా వేసినట్లయితే వాటి వార్షిక ఆదాయంతో పనిలేకుండా కొత్త పరామితులతో అవి శక్తి పుంజుకుంటాయి. చిన్న ఆలయాల వైఫల్యం, మూసివేతలను అరికట్టాలంటే వీటికి కూడా దశలవారీగా స్వేచ్ఛ కల్పించాలి. హెచ్ఆర్సీఈ చట్టం అసలు లక్ష్యం ఇదే మరి.

ఆర్థిక దృక్పథంనుంచి చూసినట్లయితే ఆలయాలకు స్వాతంత్ర్యాన్ని కల్పించడం వల్ల సమాజంపై భారీగా సానుకూల ప్రభావం ఉంటుంది. ఈ మార్గంలో ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని తీసుకురావడం లేదా హెచ్ఆర్‌సీఈ చట్టాన్ని సవరించడం అవసరం.


2022-01-13  Spiritual Desk