6tvnews

collapse
...
Home / లైఫ్ స్టైల్ / పర్యాటకం / Tourism: పక్షం రోజుల్లోనే పరిస్థితి తలకిందులు

Tourism: పక్షం రోజుల్లోనే పరిస్థితి తలకిందులు

2022-01-09  Lifestyle Desk

tourism-1
 

పక్షం రోజుల కిందటి దాకా...ఒమిక్రాన్ కు తలవంచబోమన్నపర్యాటకులు ఇప్పుడు....తమ పర్యటనలను రద్దు చేసుకోవడంలో బిజీ అయిపోయారు. ట్రావెల్ బీమా లేకున్నా సరే....బతికుంటే బలుసాకు తినవచ్చు అనుకుం టూ ఎక్కడి వాళ్లక్కడే ఉండిపోతున్నారు....జనవరిలో పలు ప్రాంతాలకు పర్యటనలు బుక్ చేసుకున్న వారంతా ఇప్పుడు టూర్ కు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ లెక్కన చూస్తే….30 నుంచి 50 శాతం మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నట్లుగా తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఒమిక్రాన్ గత నెల రోజుల నుంచి ఉంటున్నప్పటికీ….ఓ పక్షం రోజుల క్రితం దాకా దానికెవరూ పెద్దగా భయపడలేదు…ఇప్పుడు మాత్రం భయం ప్రారంభమైంది. 

కోవిడ్...యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతోపలు దేశాలు ఆంక్షలు విధిస్తునే ఉన్నాయి. భారత్ లో కూడా  ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. కానీ కొంతమంది మాత్రం, తమకేమీ పట్టనట్లు ఏం కాదని అనుకుంటున్నారు. బయటకు వచ్చినప్పుడు కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. రాబోయే రోజుల్లో ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం కూడా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తు న్నారు.

పక్షం క్రితం  జరిగిన సర్వే ప్రకారం….

కేసులు భారీగా పెరుగుతున్నా...కొంతమందికి చీమ కుట్టినట్లుకూడా లేదు. పెళ్లిళ్లు, పేరంటాలు అంటూ సందడి చేస్తున్నారు. పండగలకు అందరినీ పిలుచుకుని వేడుకలు చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఎంజాయ్ చేసుందుకు టూర్లకు కూడా రెడీ అవుతున్నారు. సెలవుల్లో పర్యాటక ప్రాంతాలకు, సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లోకల్ సర్కిల్స్ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలన్నీ కూడా వెల్లడయ్యాయి. రానున్న మూడు నెలల్లో 58శాతం మంది భారతీయులు యాత్రలు, ఇతర ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సర్వే తెలిపింది. ఈ ప్రయాలన్నీ కూడా మార్చిలోపే ఉన్నాయని పేర్కొంది.

సర్వే కోసం దేశంలో 320 జిల్లాల్లో దాదాపు 19వేల 500మంది అభిప్రాయం తీసుకుంది. రైలు, రోడ్డు, విమానా ప్రయాణాల కోసం టికెట్ల బుకింగ్ ను పరిశీలించారు. రెండవ దశకు ముందు కూడా ఇలాగే జరిపిన సర్వలో 50శాతం మంది ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్నారు. రెండవ దశ విధ్వంసాన్ని కళ్లారా చూసిన తర్వాత కూడా ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదన్న టాక్ వినిపిస్తోంది.

ఇక కొంతమంది ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్ చేసుకోగా...మరికొంత మంది ఎక్కడికి వెళ్లాల్లో నిర్ణయించుకుని టికెట్లు బుక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారని సర్వే వెల్లడించింది. ఇంకొంతమంది ఎక్కడికి వెళ్లాలి అనేది ఇంకా డిసైడ్ కాలేదట. మరికొంత మంది మాత్రం పండుగల సమయంలో తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను , స్నేహితులను , బంధువులను కలిసేందుకు వెళ్తున్నారట. 18శాతం మంది ప్రజలు ఎక్కడికి వెళ్లాలి అనేదాన్ని నిర్ణయించుకున్న తర్వాతే టికెట్లు బుక్ చేసుకున్నారని...మరో 15శాతం మంది ప్రజలు ఎక్కడికి వెళ్లాలనే నిర్ణయించుకున్నారని కానీ...ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదని సర్వే తెలిపింది.

ఇక 14 శాతం మంది సినిమా హాళ్లు లేదా మల్టీ ఫ్లెక్సులలో సినిమాలు చూడాలని భావిస్తున్నారట. జూలైలో ఇదే అంశంపై సర్వే చేసినప్పుడు కూడా 40శాతం మందికి పైగా సినిమాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు సర్వేలో తెలిపారు. 138కోట్ల మంది భారతీయుల్లో 19కోట్ల మంది సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులలో సినిమాలు చూడాలని ఆశిస్తున్నారు.

కాగా 22శాతం ప్రజలు తాము అనుకున్న తేదీ సమీపించాకే...దగ్గరలో ఉన్న ఏ ప్రదేశాలకు వెళ్లాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటారని సర్వే వెల్లడించిది. దీని బట్టి చూస్తే...చాలా మంది ప్రజలు ప్రయాణాలు, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. 

వాయిదా వేసుకోవడమే ఉత్తమం….

డెల్టా వైరస్ కన్నా మూడు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోందని తెలిసి కూడా మన దాకా రాదనే...నిర్లక్ష్యం వీడటం లేదు. ఈ ఆలోచనలే ప్రమాదకర పరిస్థితులకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పర్యటనలను మానుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.


2022-01-09  Lifestyle Desk