collapse
...
Home / తెలంగాణ / TSPSC: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు - 6TV News : Telugu in News | Telugu News | Latest...

TSPSC: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

TSPSC
గ్రూప్-1 విషయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.  గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు  గడువును పెంచింది. గ్రూప్‌-1 దరఖాస్తుల గడువును జూన్‌ 4 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తు చేయడానికి మే 31కి చివరి రోజు. అయితే అభ్యర్థుల విన్నపం మేరకు మరో నాలుగు రోజులపాటు గడువును పెంచుతూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

*ఇప్పటికే  3 లక్షల దరఖాస్తులు 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 503 పోస్టులతో కూడిన గ్రూప్‌-1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ ఇచ్చింది. ఈ పోస్టుల కోసం  3 లక్షల 48 వేల 95 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు గడువును పొడిగిండంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంఖ్య సుమారు 4 లక్షల వరకు చేరే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

*గడువు పెంపు ఎందుకంటే? 
ఓటీఆర్‌ సవరణ, స్థానికతకు సంబంధించి బోనఫైడ్‌ అప్‌లోడ్‌ తదితర అంశాల నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదిగా సాగింది. స్థానికత ధృవీకరణకు కీలకమైన బోనఫైడ్‌లు అందుబాటులో లేని పలువురు అభ్యర్థులు పాఠశాలల చుట్టూ తిరుగుతుండడంతో పాటు పరీక్షకు  ప్రిపేర్ కావాలనే తాపత్రయంతో కొందరు అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈక్రమంలో బోనఫైడ్‌ అప్‌లోడ్‌ నిబంధనకు బ్రేక్‌ ఇచ్చింది టీఎస్‌పీఎస్సీ.  చదువుకున్న వివరాలను సరిగ్గా ఎంట్రీ చేస్తే చాలని సూచించింది. దీంతో దరఖాస్తు నమోదు వేగం పుంజుకుంది. చివరి రెండు రోజుల్లో ఏకంగా 60 వేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో గడువు పెంపుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  గ్రూప్‌1 దరఖాస్తుకు ముందు టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో నమోదు చేసుకున్నవారు కూడా తమ స్థానికత వివరాలను పొందుపర్చాలని అధికారులు వెల్లడించారు.



2022-06-01  News Desk