టిల్లు సినిమా తో సిద్దు జొన్నలగడ్డకి(Siddu Jonnalagadda) స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ సినిమాకి ముందు సిద్దు హీరోగా లేదంటే సైడ్ హీరోగా సుమారు ఒక అరడజను సినిమాలు చేసి ఉంటాడు. 

ఆ సినిమాలు తనకి పెద్ద స్టార్ స్టేటస్ ను తెచ్చి పెట్టలేదు. ఆయా సినిమాల్లో నటనకి మంచి గుర్తింపు మాత్రమే లభించింది. 

ఇక టిల్లు సినిమా ఆ రేంజ్ లో పేలడానికి కే ఒక కారణం అందులో నటించిన హీరోయిన్ అని కూడా చెప్పొచ్చు. 

నేహా శెట్టి(Neha Setty) చేసిన బోల్డ్ యాక్టింగ్,  అలాగే సిద్ధుతో చేసిన ముద్దు సీన్లు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. 

అనుపమ పరమేశ్వరన్, ఈ అమ్మడు మొన్నటివరకు ఎంతో పద్డతిగా ఒద్దికగా ఉండేది. కానీ రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ కి పెదాలు అందించి టాలీవుడ్ ను షాక్ కి గురిచేసింది.

రౌడీ బాయ్స్ లో(Rowdy Boys) ఆశిష్(Asish) తోనే ఆ రేంజ్ లో చేసిందంటే, ఇక టిల్లు  స్క్వేర్ లో సిద్దు తో ఏ రేంజ్ లో ఉంటాయో 

 ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లను బట్టి చుస్తే అది నిజమే అనిపిస్తోంది.

ఆ పోస్టర్ లో ఈ మలయాళ భామ అనుపమ ఏకంగా సిద్దు ఒడిలో సెటిలైపోయింది. 

పోస్ట్ లో ఉన్న ఫోటో చుసిన ఆమె ఫాన్స్ విపరీతంగా విచిత్రంగా రెస్పాండ్ అవుతున్నారు. 

 ఈ సీన్ చూసి మా మనస్సు ముక్కలైపోతోంది అంటూ కామెంట్ పెడుతున్నారు.