కాజల్ అగర్వాల్ తన అందంతో, నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

లైగర్(Liger) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pande). 

ఈ నాజూకు అందాల చిన్నది సినిమా నేపధ్యం ఉన్న కుటుంబం నుండే వచ్చింది. ఈమె తండ్రి చుంకి పాండే(Chunki pande). హిందీ సినిమా నటుడు.

దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్(Student Of The year) సినిమాతో 2019 లో ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఇప్పటివరకు 8 సినిమాల్లో నటించింది.

మొదటి సినిమాతోనే బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ గా ఫిలిం ఫేర్ అవార్డు(Filim Fare Award)ను సొంతం చేసుకుంది. 

మరేం లేదండి, ఈ బేబీ నెటిజన్లపై తెగ ఫయిర్ అవుతోంది. సోషల్ మీడియా లో ట్రోలింగ్ చేసేవాళ్లపై చిర్రుబుర్రులాడుతోంది ఈ సొగసరి. 

సామజిక మాధ్యమాలలో కొంతమంది పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తూ ఉంటారని, అలాంటివారిని బ్లాక్ చేసి పడేయాలని అంటోంది. 

తమది సినిమా నేపధ్యం ఉన్న కుటుంబం కాబట్టి అందుకే ట్రోలర్స్ తనని టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తుంటారని అంటోంది. 

పాపం ట్రోలర్స్ ఎంతలా విజృంభించి ఉండకపోతే ఈ అమ్మడు ఇలా ఫైర్ అయి ఉంటుంది. 

ఈమె నటించిన తాజా చిత్రం కూడా ఈమధ్యనే విడుదలైంది. ఖో గయే హం కహాన్(Kho Gaya Ham Kaha) అనే సినిమా చేసింది.