చిన్నప్పటి నుండే ఆకలి బాధలు చవిచూసింది. అయినా ఆమెకు ఉన్న లక్ష్యం ఒక్కటే ఫ్యూచర్ లో మంచి మోడల్ అవ్వాలని, 

మనసుంటే మార్గముంటుంది, కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు అనే మాటలు మాలీషా ఖార్వా ను చూసి పుట్టుకొచ్చాయేమో.

ఎందుకంటే మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం ముమ్మాటికీ మన తప్పే. 

మన లో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి చూపించి అవకాశాలను కొల్లగొట్టి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందని మరో సారి రుజువు చేసింది మాలీషా, పద్నాలుగేళ్ల ఈ చిన్నది,

ఎప్పటికైనా మోడల్ అవ్వాలన్నది ఈ అమ్మాయి కల, తన కృషి, పట్టుదలతో తన కలను సాకారం చేసుకుంది. 

ప్రియాంక చోప్రాను(Priyanka Chopra) ఆదర్శంగా తీసుకున్న ఈ సిసింద్రీ ఆమెకు మాదిరిగానే ఏకంగా హాలీవుడ్ సినిమాలో అవకాశం కూడా కొట్టేసింది. 

ప్రతిభకు కొలమానం లేదని ఓ పెద్ద మనిషి చెప్పినట్టు టాలెంట్ ఉన్నోడిని ఎవ్వడు ఆపలేదు, దానికి డబ్బుతో అస్సలు పనిలేదు. 

టాలెంట్ లేకపోతే ఆగర్భశ్రీమంతులైనా వారు వారి ఇంటికి మాత్రమే పరిమితం అవుతారు.

మాలీషా పుట్టింది ఓ పూరి గుడిసె లో, నిరుపేద కుటుంబం, చిన్నప్పటి నుండే ఆకలి బాధలు చవిచూసింది. అయినా ఆమెకు ఉన్న లక్ష్యం ఒక్కటే ఫ్యూచర్ లో మంచి మోడల్ అవ్వాలని,

ఆమె సాధించిన విజయం పేదరికాన్ని వెక్కిరించేలా చేసింది. అసలు మాలీషా ఖార్వ (Malisha Kharva)కి ఇంతటి పాపులారిటీ రావడానికి బీజం ఎక్కడ పడింది, ఆమె లైఫ్ ను టర్న్ చేసిన అంశం ఏది అని డౌట్ రావచ్చు.