కాజల్ అగర్వాల్ తన అందంతో, నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)తాజాగా నటించిన మూవీ భీమా (Bhimaa). ఈ మూవీతో కన్నడ డైరెక్టర్ ఎన్ హర్ష (N Harsha) తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. 

 భీమాను ఫిబ్రవరి 16 విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ మూవీకి సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో తాజాగా భీమా టీజర్ (Bhimaa Teaser)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ తెలుగు ప్రేక్షకులకు గూస్‎బంప్స్  తెప్పిస్తోంది. 

చాలా రోజుల తర్వాత గోపీచంద్ పోలీస్ గెటప్‎లో పవర్‎ఫుల్ లుక్‎లో  కనిపించి ప్రేక్షకులను అలరించాడు. 

టీజర్‎లో గోపిచంద్ ఎద్దుపై కూర్చుని కనిపించిన తీరు ఆయన ఫ్యాన్స్‎ను అమితంగా ఆకట్టుకుంటోంది.  ఈ టీజర్ తో మేకర్స్ భీమా ప్రమోషన్స్‎కి కిక్ స్టార్ట్ ఇచ్చారు. 

సుమారు ఒక నిమిషం డ్యూరేషన్ ఉన్న భీమా టీజర్ (Bhimaa Teaser) వేరే  లెవెల్‎లో ఉంది. 'యధా యధా ధర్మస్య' అనే భగవద్గీత శ్లోకాల పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో భీమా టీజర్ స్టార్ట్ అయ్యింది. 

రాక్షసుల్లాంటి కొంత మంది మనుషులు వారిని హింసిస్తున్నట్లు చూపించారు. ఈ క్రమంలో పోలీస్ గెటప్ లో గోపీచంద్ (Gopichand) ఎంట్రీ ఇచ్చాడు. 

ఈ టీజర్ ఆధ్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆధ్యాత్మిక అంశాలతో నిండివుంది. 

ఈ మ్యూజిక్ మాత్రం అందరిని మెస్మరైజ్ చేస్తోంది.  ఇక స్వామి జె గౌడ (Swamy J Gouda)కెమెరా పనితనం అత్యద్భుతంగా ఉంది.