collapse
...
అంతర్జాతీయం
   జపాన్ లో ప్రధాని మోడీని కలుస్తా.. ఆస్ట్రేలియా కొత్త పీఎం ఆంథోనీ అల్బనీస్

   జపాన్ లో ప్రధాని మోడీని కలుస్తా.. ఆస్ట్రేలియా కొత్త పీఎం ఆంథోనీ అల్బనీస్

   2022-05-22  News Desk
   క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ .. ఈ నెల 23-24 తేదీల్లో జపాన్ వెళ్లనున్నారు. జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా ఆహ్వానంపై ఆయన ఆ దేశానికి వెళ్తున్నారని, అక్కడ ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ను కలుసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా- టోక్యోలో తాను ఈ నెల 24 న మోడీతోను, ఇతర నాయకులతోనూ సమావేశమవుతానని ఆంథోనీ అల్బనీస్ వెల్లడించారు.
   మంకీపాక్స్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుందా?

   మంకీపాక్స్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుందా?

   2022-05-21  News Desk
   ఐరోపా దేశాల‌లో మంకీపాక్స్ వ్యాప్తి చెందడం వెనుక లైంగిక కార‌ణాల‌తో సంక్రమించే వ్యాధిగా ఊహాగానాలు చెల‌రేగుతున్నాయి.. దీంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ పురుషులలో ఈ కేసులు ఎక్కువ‌గా నమోదవడం వ‌ల్లే ఇలాంటి అనుమానాల‌కు తావిచ్చిన‌ట్టుక‌నిపిస్తోంద‌ని ప‌లువురు ఈ స‌మావేశంలో అభిప్రాయ ప‌డ్డారు.
   స‌రిహ‌ద్దుల్లో చైనా అక్ర‌మ నిర్మాణాలు : అంగీకరించేది లేదన్న భారత్

   స‌రిహ‌ద్దుల్లో చైనా అక్ర‌మ నిర్మాణాలు : అంగీకరించేది లేదన్న భారత్

   2022-05-21  News Desk
   తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ త్సో పై చైనా రెండో వంతెన నిర్మిస్తోంద‌న్న‌వార్త‌ల‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ధృవీకరించింది .1960ల నుంచి చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లోనే ఈ రెండు వంతెనలు ఉన్నాయని పేర్కొంది.త‌న భూభాగంలో ఎటువంటి అక్ర‌మ నిర్మాణాల‌ను భార‌త్ ఎన్న‌డూ అంగీక‌రించ‌బోద‌ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఉద్ఘాటించారు.
   మరీ ఘోరం ! నెగిటివ్ వచ్చినా సరే క్వారంటైన్ లోకే..!

   మరీ ఘోరం ! నెగిటివ్ వచ్చినా సరే క్వారంటైన్ లోకే..!

   2022-05-21  News Desk
   చైనాలో కోవిడ్ మహమ్మారి లక్షలాది ప్రజలకు నానా పాట్లు తెచ్చిపెడుతోంది. కోవిడ్ అదుపు పేరిట కఠినమైన లాక్ డౌన్లు అమలవుతుండగా .. చివరకు కోవిడ్ నెగేటివ్ రిపోర్టులు వచ్చినవారిని కూడా బలవంతంగా క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు.
   ఉక్రెయిన్‌లో ‘థర్మోబారిక్‌’ కలకలం.. వీడియో వైరల్.. అసలేంటీ బాంబులు? ఎలా పనిచేస్తాయి?

   ఉక్రెయిన్‌లో ‘థర్మోబారిక్‌’ కలకలం.. వీడియో వైరల్.. అసలేంటీ బాంబులు? ఎలా పనిచేస్తాయి?

   2022-05-21  News Desk
   రష్యా వద్ద ఉన్న భయంకరమైన ఆయుధం అణు బాంబు ఉన్నాయంటూ పెను సంచలనమే రేగింది. అయితే రష్యా వద్ద శక్తివంతమైన ఆయుధాలు మరికొన్ని ఉన్నాయి. అణ్వాయుధాల తర్వాత అంతటి విధ్వంసాన్ని, ప్రాణనష్టాన్ని సృష్టించగల ఆయుధాలు.. థర్మోబారిక్‌ బాంబులు. అటు భారీ ఆస్తి నష్టంతో పాటు, ఇటు పెద్ద ఎత్తున జనహననానికి కారణమయ్యే ఈ బాంబులను తమ నగరాలపై రష్యా ప్రయోగిస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది.
   కేన్స్‌లో షాకింగ్ ఘటన.. తమపై అత్యాచారాలను ఆపాలంటూ మహిళ అర్ధనగ్న నిరసన

   కేన్స్‌లో షాకింగ్ ఘటన.. తమపై అత్యాచారాలను ఆపాలంటూ మహిళ అర్ధనగ్న నిరసన

   2022-05-21  News Desk
   ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2022 వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. పలువురు విదేశీ తారలు పాల్గొని.. వైవిధ్యమైన డ్రెస్‌లు ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలు పోయారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
   ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కడ దాటుతుందో తెలుసా? ప్రపంచంలోని 7 హాటెస్ట్ ప్రదేశాలివే..

   ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కడ దాటుతుందో తెలుసా? ప్రపంచంలోని 7 హాటెస్ట్ ప్రదేశాలివే..

   2022-05-21  News Desk
   ప్రకృతి చాలా విచిత్రమైనది.. వర్షాకాలం వస్తే.. ఈ వర్షాలేంటిరా బాబోయ్.. ఎంత ఎండైనా భరించగలం కానీ ఈ వర్షాలను భరించలేం అనిపిస్తుంది. శీతాకాలం వస్తే.. ఈ చలి ఎప్పుడు పోతుందా? అనిపిస్తుంది. ఇక ఎండాకాలం వస్తే.. ఈ ఎండలను భరించలేం అనిపిస్తుంది.. ఎప్పుడు వర్షం పడుతుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తాం. అయితే మనం ఒక 40 డిగ్రీల వేడిమిని ఎండాకాలంలో భరిస్తాం.
   ఉగ్రవాదం అందరికీ ముప్పే..... దేశంలో శాంతిని నెలకొల్పుతామన్న పాకిస్తాన్

   ఉగ్రవాదం అందరికీ ముప్పే..... దేశంలో శాంతిని నెలకొల్పుతామన్న పాకిస్తాన్

   2022-05-21  News Desk
   టెర్రరిజం అందరికీ (ఉమ్మడి) ముప్పేనని పాకిస్తాన్ ప్రకటించింది. దీనికి అంతం పలికి దేశంలో పూర్తిగా శాంతిని నెలకొల్పుతామని వెల్లడించింది. మొత్తం ఈ ఉపఖండానికే ఇది ప్రమాదకరమని, అందువల్ల అన్ని పెద్ద దేశాలతో సంబంధాలను కొనసాగించాలన్నదే తమ దేశ విదేశాంగ విధానమని ఈ శాఖ అధికార ప్రతినిధి ఆసిఫ్ ఇఫ్తిఖార్ తెలిపారు.
   తీవ్ర ఆహార సంక్షోభంలో శ్రీలంక ..!

   తీవ్ర ఆహార సంక్షోభంలో శ్రీలంక ..!

   2022-05-20  News Desk
   తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఆహార సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. తినడానికి ఆహారం లేక జనం అల్లాడుతున్నారు. శ్రీలంక పెను ఆహార సంక్షోభం అంచున ఉందని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది రసాయనిక ఎరువుల వాడకంపై విధించిన నిషేధాన్ని ఆయన ఎత్తివేశారు.
   నేడు ఆల్-టైమ్ హై నుంచి రూ.5,600 తగ్గిన బంగారం ధర.. మరి కొనవచ్చా?

   నేడు ఆల్-టైమ్ హై నుంచి రూ.5,600 తగ్గిన బంగారం ధర.. మరి కొనవచ్చా?

   2022-05-20  News Desk
   బంగారం.. ఇది భారతీయ సంప్రదాయంలో భాగం అయింది. ప్రతి శుభకార్యంలోనూ దీనికి చోటు ఉంటుంది. మొదట్లో ఇది అవసరమే అయినా ఈ కాలంలో ఇదో పెట్టుబడి సాధనంగా కూడా మారింది.సందర్భాలు వెతికి మరీ ఇండియన్స్ పుత్తడి కొనడం సహజం. ప్రపంచంలో వాడుతున్న బంగారంలో 11శాతం నగలు రూపంలో మన ఇండియన్స్ దగ్గరే ఉంది.
   కెన‌డా పార్ల‌మెంట్‌లో క‌న్న‌డ గ‌ళం... స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు

   కెన‌డా పార్ల‌మెంట్‌లో క‌న్న‌డ గ‌ళం... స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు

   2022-05-20  News Desk
   కర్ణాటకలోని తుమకూరు జిల్లా సిరా తాలూకాకు చెందిన జ‌న్మించి కెన‌డాలో స్థిర‌ప‌డ్డ చంద్ర ఆర్య 2015లో తొలిసారిగా, 2019లో రెండోసారి కెనడా పార్లమెంటుకు ఎన్నిక‌య్యారు. ఈ క్ర‌మంలో చంద్ర ఆర్య పార్లమెంట్‌లో త‌న మాతృభాష కన్నడలో మాట్లాడుతున్న వీడియోను ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు.
   దావోస్ కు ఏపీ సీఎం జ‌గ‌న్.. పెట్టుబ‌డులే ల‌క్ష్యం

   దావోస్ కు ఏపీ సీఎం జ‌గ‌న్.. పెట్టుబ‌డులే ల‌క్ష్యం

   2022-05-20  News Desk
   దావోస్ లో జ‌రిగే స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఆయ‌న బ‌య‌లు దేరారు. దాదాపు ప‌ది రోజుల పాటు ఈ ప‌ర్య‌ట‌న సాగ‌నుంది. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ నిమిత్తం ఆయ‌న ఆ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కు హాజరుకానున్నారు.