collapse
...
అంతర్జాతీయం
   మోడీతో జపాన్ పిల్లలు.. అలరించిన హిందీ ముచ్చట్లు..

   మోడీతో జపాన్ పిల్లలు.. అలరించిన హిందీ ముచ్చట్లు..

   2022-05-23  News Desk
   మనదేశంలో, మన పౌరులతో తో హిందీ భాషలో మాట్లాడటం సహజం.. కానీ ఇక్కడ ఏ భాషతో సంబంధం లేని జపాన్ పిల్లలతో ప్రధాన మంత్రి మోడీ హిందీలో ముచ్చటించడం, దానికి చిన్నారులు అదే భాషలో స్పందించడం అలరించింది. క్వాడ్ సమ్మిట్ జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టోక్యోలో జపాన్ పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు.
   టొరంటోలో తుఫాన్ .. కార్ల మధ్య ఎగురుతున్న ట్రామ్పోలిన్ -| వీడియో

   టొరంటోలో తుఫాన్ .. కార్ల మధ్య ఎగురుతున్న ట్రామ్పోలిన్ -| వీడియో

   2022-05-23  News Desk
   కెనడాలోని టొరంటోలో శనివారం (మే 21) నాడు సంభ‌వించిన శక్తివంతమైన తుఫాన్ స‌మ‌యంలో ఓ విచిత్ర‌మైన స‌న్నివేశం క‌న‌బ‌డింది. కార్ల మధ్య ట్రామ్పోలిన్ ఎగురుతున్నప్పుడు ఓ ప్రత్యక్ష సాక్షి ఆ దృశ్యాన్ని వీడియో తీశారు.
   ఇండియాకు వెళ్ళకండి.. బ్యాన్ విధించిన సౌదీ అరేబియా

   ఇండియాకు వెళ్ళకండి.. బ్యాన్ విధించిన సౌదీ అరేబియా

   2022-05-23  News Desk
   గత కొన్ని వారాలుగా రోజువారీ కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఇండియాతో బాటు 16 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించింది సౌదీ అరేబియా... తమ దేశవాసులు ఈ దేశాలకు వెళ్లరాదని ఆంక్షలు విధించింది.ఇండియాతో బాటు లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్గనిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, వియత్నామ్, వెనెజులా వంటి దేశాలకు ప్రయాణించరాదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
   30 ఏళ్ల తర్వాత వైల్డ్ పోలియో వైరస్

   30 ఏళ్ల తర్వాత వైల్డ్ పోలియో వైరస్

   2022-05-23  News Desk
   పూర్తిగా అంతమైపోయింది అనుకున్న వైరస్ మళ్లీ కోరలు చాచింది.. ఒక చిన్నారి విషయంలో వెలుగుచూసిన ఈ వ్యాధి ఆఫ్రికన్ దేశం లో భయాందోళనలు సృష్టిస్తోంది. 30 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో తిరిగి ఈ వ్యాధి సోకినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు.
   తాలిబన్లకు అమ్మాయిల ఝలక్

   తాలిబన్లకు అమ్మాయిల ఝలక్

   2022-05-23  News Desk
   నివాస ప్రాంతాలకు దూరంగా ఉండటమే ఆప్ఘనిస్తాన్ కొత్త రహస్య పాఠశాలల రహస్యం. తాలిబన్లకు వ్యతిరేకంగా చిన్నదే కావచ్చు కానీ శక్తివంతమైన ధిక్కార స్వరానికి ఇవి నమూనాలుగా నిలుస్తున్నాయి. అక్కడ 12 మంది టీనేజ్ అమ్మాయిలు మ్యాథ్స్ క్లాసుకు హాజరవుతున్నారు. ఈ ధిక్కారానికి గాను మాకు ఎదురయ్యే ప్రమాదాల గురించి మాకు తెలుసు.
   10 లక్షల మంది ఆశా వాలంటీర్లకు అరుదైన గౌరవం..

   10 లక్షల మంది ఆశా వాలంటీర్లకు అరుదైన గౌరవం..

   2022-05-23  News Desk
   కరోనాపై పోరులో భాగంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొన్ని డిపార్ట్‌మెంట్లకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహించారు. మెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియా అలుపెరగక తమ విధులను నిర్వహించింది. చిన్న చిన్న ఉద్యోగులు సైతం ఫ్రంట్‌లైన్‌లో నిలబడి సేవలు అందించారు. వారిలో ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. చిన్న ఉద్యోగులైనా వారి కర్తవ్యం మాత్రం మాటల్లో చెప్పలేనిది.
   మంకీపాక్స్ సోకితే క్వారంటైన్ మస్ట్..!

   మంకీపాక్స్ సోకితే క్వారంటైన్ మస్ట్..!

   2022-05-23  News Desk
   ప్రపంచ దేశాల్లో మంకీ పాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ వ్యాధి మెల్లగా ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ ఈ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దృష్టి సారించింది. బెల్జియంలో మంకీపాక్స్ కేసులు నాలుగు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం..
   మోదీ జపాన్ పర్యటన వెనుక...

   మోదీ జపాన్ పర్యటన వెనుక...

   2022-05-23  News Desk
   ప్రధాని మోడీ జపాన్ లో పర్యటిస్తున్నారు. క్వాడ్ సదస్సుకు ప్రధాని వ్యక్తిగతంగా హాజరు కావడం ఇది రెండోసారి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేది భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భద్రతా సంభాషణకు సంబంధించింది.
   ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా అంథొనీ అల్బనీస్..

   ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా అంథొనీ అల్బనీస్..

   2022-05-22  News Desk
   ఆస్ట్రేలియాలో మితవాద ప్రతిపక్ష ‘ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ(ఏఎల్‌పీ)’ అధికారంలోకి వచ్చింది. దాదాపు దశాబ్దకాలంపాటు ప్రభుత్వాన్ని నడిపిన స్కాట్ మోరిస్ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా ఓటమిపాలైంది.
   జపాన్ లో ప్రధాని మోడీని కలుస్తా.. ఆస్ట్రేలియా కొత్త పీఎం ఆంథోనీ అల్బనీస్

   జపాన్ లో ప్రధాని మోడీని కలుస్తా.. ఆస్ట్రేలియా కొత్త పీఎం ఆంథోనీ అల్బనీస్

   2022-05-22  News Desk
   క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ .. ఈ నెల 23-24 తేదీల్లో జపాన్ వెళ్లనున్నారు. జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా ఆహ్వానంపై ఆయన ఆ దేశానికి వెళ్తున్నారని, అక్కడ ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ను కలుసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా- టోక్యోలో తాను ఈ నెల 24 న మోడీతోను, ఇతర నాయకులతోనూ సమావేశమవుతానని ఆంథోనీ అల్బనీస్ వెల్లడించారు.
   మంకీపాక్స్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుందా?

   మంకీపాక్స్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుందా?

   2022-05-21  News Desk
   ఐరోపా దేశాల‌లో మంకీపాక్స్ వ్యాప్తి చెందడం వెనుక లైంగిక కార‌ణాల‌తో సంక్రమించే వ్యాధిగా ఊహాగానాలు చెల‌రేగుతున్నాయి.. దీంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ పురుషులలో ఈ కేసులు ఎక్కువ‌గా నమోదవడం వ‌ల్లే ఇలాంటి అనుమానాల‌కు తావిచ్చిన‌ట్టుక‌నిపిస్తోంద‌ని ప‌లువురు ఈ స‌మావేశంలో అభిప్రాయ ప‌డ్డారు.
   స‌రిహ‌ద్దుల్లో చైనా అక్ర‌మ నిర్మాణాలు : అంగీకరించేది లేదన్న భారత్

   స‌రిహ‌ద్దుల్లో చైనా అక్ర‌మ నిర్మాణాలు : అంగీకరించేది లేదన్న భారత్

   2022-05-21  News Desk
   తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ త్సో పై చైనా రెండో వంతెన నిర్మిస్తోంద‌న్న‌వార్త‌ల‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ధృవీకరించింది .1960ల నుంచి చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లోనే ఈ రెండు వంతెనలు ఉన్నాయని పేర్కొంది.త‌న భూభాగంలో ఎటువంటి అక్ర‌మ నిర్మాణాల‌ను భార‌త్ ఎన్న‌డూ అంగీక‌రించ‌బోద‌ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఉద్ఘాటించారు.