‘విక్రమ్'(Vikram) బ్లాక్ బస్టర్ హిట్ తో లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan)వరుసగా భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. పాన్ ఇండియన స్టార్ ప్రభాస్ (prabhas)హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)రూపొందిస్తున్న కల్కి(Kalki) మూవీలో కీలక పాత్రలో కమల్ హాసన్ కనిపించనున్నారు. దీనితో పాటే అప్పట్లో భారీ హిట్ సాధించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2 తో అలరించేందుకు కమల్ రెడీ అవుతున్నారు.
ఈ రెండు భారీ ప్రాజెక్టులతో పాటు ఎన్నో దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ ,మణిరత్నం (Maniratnam)డైరెక్షన్ లో వస్తున్న థగ్ లైఫ్ (Thug Life)అనే సినిమాలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి కమల్ హాసన్ ఫ్యాన్స్, సనీ లవర్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer salman)నటించాల్సి ఉంది. అయితే తాజాగా దుల్కర్ ఈ ఆఫర్ కు నో చెప్పినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు దుల్కర్ స్థానంలో తమిళ స్టార్ హీరోను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
35 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్ :
మణిరత్నం (Maniratnam)డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ థగ్ లైఫ్ (Thug life) మూవీ పై అంచనాలు రోజురోజుకీ భారీగా ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో జయం రవి (Jayam Ravi), త్రిష (Trisha), అభిరామి (Abhirami), నాజర్ (Nazar), గౌతమ్ కార్తీక్ (Gowtham Karthik), జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi) వంటి భారీ తారాగణం నటిస్తోంది. 1987లో రిలీజైన బ్లాక్ బస్టర్ మూవీ నాయకుడు (Nayakudu)తర్వాత మళ్లీ మణిరత్నం, కమల్ హాసన్ (Kamal Haasan)కాంబోలో వస్తున్న మూవీ ఇది. దాదాపు 35 ఏళ్ల తర్వాత తెరముందుకు రాబోతున్న సినిమా ఇది. ఈ మధ్యనే రిలీజైన మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
దుల్కర్ సల్మాన్ అవుట్ :
ఈ మూవీలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer salman) ఓ కీలక పాత్రలో నటించాల్సి ఉంది. అయితే ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండటం డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమాకి నో చెప్పారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) మూవీకి నో చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ క్రమంలో మేకర్స్ ఆ క్యారెక్టర్ కోసం తమిళ స్టార్ హీరో శింబు (Simbu)ని సంప్రదించినట్లు తెలుస్తోంది. స్టోరీకి శింబు బాగా కనెక్ట్ కావడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా దుల్కర్ ప్లేస్ ను శింబు రీప్లేస్ చేశాడు.
శింబుకి ఇదే మొదటిసారి :
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), మణిరత్నం (Maniratnam)కాంబినేషన్ లో సినిమా చేయడం శింబుకి ఇదే ఫస్ట్ టైమ్. ఈ మధ్యనే మానాడు(Manaadu) వంటి సూపర్ హిట్ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన శింబుకి థగ్ లైఫ్ కూడా బాగా ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ మూవీని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ (Raj Kamal Films International), మద్రాస్ టాకీస్ (Madras Talkies ), రెడ్ జయింట్ మూవీస్ (Red Giant Movies) కలిసి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా . మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ ఆర్ రెహమాన్ (AR Rahman)ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.