“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” పై విశ్వక్ ఆశలు…

gg "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" పై విశ్వక్ ఆశలు...

గోదావరి జిల్లాల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో వొందల చిత్రాలు వొచ్చాయి. ఎన్నెన్నో సూపర్ హిట్ కూడా అయ్యాయి.గోదారోళ్ళ భాష,యాస,సంస్కృతి, సాంప్రదాయాలు, వెటకారాలకి టాలీవుడ్ లో మచి క్రేజ్ ఉంది. ఇదే కోవలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సంయుక్త నిర్మాణంలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా విడుదల తేదీ మాటిమాటికీ వాయిదా పడుతూ వొస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ చివరికి మే 31 న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర బృందం ప్రోమోషన్ లలో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల అయిన glims,posters,టీజర్స్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వొస్తోంది. విశ్వక్సేన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా చేసిన “గామి” అస్సాం బండి ఎక్కేయటంతో.. విశ్వక్సేన్ కి ఇప్పుడు హిట్ చాలా అవసరం. స్వయంగా రచయిత,దర్శకుడు అయిన విశ్వక్ ఈ సినిమా హిట్ కోసం గట్టిగా కృషి చేశాడట. కొన్ని రీషూట్ లు కూడా చేశారట. పాటల రచయిత, డైలాగ్ రచయితగా పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. దర్శకుడిగా పెద్దగా హిట్లు లేని ఈ దర్శకుడికి కూడా హిట్ కావాలి. కథనంలో భాగంగా రాజకీయాల మీద వేసిన పంచ్ లు బాగా పేలాయని సమాచారం. ఎప్పుడూ సినిమా ప్రమోషన్లలో ముందుండే విశ్వక్ ఈ సినిమా ప్రచారంలో ఎందుకో ఆసక్తి చూపించడం లేదు. సినిమా ఆలస్యం అయిందనా? లేక ఎక్కడో డౌట్ అనుమానం కొడుతోందా? ఏ విషయం మే 31 న తేలుతుంది.

Leave a Comment